newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

ముంబై ఐదో సారి.. ఫైనల్ లోనూ వార్ వన్ సైడ్..!

11-11-202011-11-2020 07:19:24 IST
2020-11-11T01:49:24.479Z11-11-2020 2020-11-11T01:49:17.795Z - - 30-11-2020

ముంబై ఐదో సారి.. ఫైనల్ లోనూ వార్ వన్ సైడ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

డిఫెండింగ్ ఛాంపియన్ గా ఐపీఎల్-13 లో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్ జట్టు.. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడింది. క్వాలిఫయర్-1, ఫైనల్ లోనూ తన ఛాంపియన్ గేమ్ ను ఢిల్లీకి చూపించింది. దుబాయ్ లో జరిగిన ఫైనల్లో ముంబయి జట్టు 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబయి జట్టు మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది. 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ట్రోఫీని ముద్దాడింది. 

 టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (50 బంతుల్లో 65 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (38 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్‌ కిషన్‌ (19 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయాన్ని అందుకుంది. 

ఢిల్లీ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టొయినిస్ ఫైనల్ లో ఒక్క బంతికే వెనుదిరిగాడు. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఆడిన తొలిబంతికే వెనుదిరిగాడు. ధావన్ (15), రహానే (2) కూడా విఫలమయ్యారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (65 నాటౌట్), రిషబ్ పంత్ (56) అర్ధసెంచరీలు నమోదు చేశారు. 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టును అయ్యర్, పంత్ జోడీ ఆదుకుంది.  పంత్ అవుటయ్యాక వచ్చిన హెట్మెయర్ (5), అక్షర్ పటేల్ (9) రాణించకపోవడంతో ఢిల్లీ భారీస్కోరు సాధించలేకపోయింది. ఢిల్లీ చివరి ఓవర్లలో ఆ జట్టు పరుగుల వేగం బాగా మందగించింది.  ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీశాడు. నాథన్ కౌల్టర్ నైల్ కు 2, జయంత్ యాదవ్ కు 1 వికెట్ లభించాయి.

ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్‌ (12 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభాన్ని అందించారు. రబడ వేసిన రెండో ఓవర్లో డికాక్‌ 2 ఫోర్లు, సిక్స్‌ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అక్కడే మ్యాచ్ ఏకపక్షంగా సాగబోతోందనే అంచనాకు అభిమానులు వచ్చేశారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన కెప్టెన్‌ రోహిత్ ఫైనల్ లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సింగిల్‌ కోసం ప్రయత్నించిన రోహిత్‌ను రనౌట్‌ నుంచి రక్షించేందుకు సూర్యకుమార్‌ (19) తన వికెట్‌ను త్యాగం చేశాడు. 36 బంతుల్లోనే రోహిత్‌ అర్ధసెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో కిషన్‌ కూడా దూకుడుగా ఆడటంతో ముంబై వేగంగా లక్ష్యం వైపు దూసుకుపోయింది. విజయానికి చేరువైన దశలో రోహిత్, పొలార్డ్‌ (9), హార్దిక్‌ పాండ్యా (3) అవుటైనా అప్పటికే చేయాల్సిన పరుగులు చాలా తక్కువ ఉండడంతో ముంబై విజయం కన్ఫర్మ్ అయింది. నోర్జే వేసిన 19వ ఓవర్‌ నాలుగో బంతిని కవర్స్‌ దిశగా ఆడి కృనాల్‌ సింగిల్‌ తీయడంతో ముంబై జట్టు ఐదోసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచింది.

ముంబయి కి ఇది ఐదో ఐపీఎల్ టైటిల్. ముంబయి ఇండియన్స్ ఇంతకుముందు 2013, 2015, 2017, 2019లోనూ ఐపీఎల్ విజేతగా నిలిచింది.

 

విరాట్ సెంచ‌రీ మిస్.. టీమ్ఇండియా సిరీస్ మిస్‌

విరాట్ సెంచ‌రీ మిస్.. టీమ్ఇండియా సిరీస్ మిస్‌

   10 hours ago


భారత క్రికెట్ జట్టు చేస్తున్న తప్పును స్పష్టంగా వివరించిన మైఖేల్ వాన్

భారత క్రికెట్ జట్టు చేస్తున్న తప్పును స్పష్టంగా వివరించిన మైఖేల్ వాన్

   13 hours ago


భారత్ మీద చెలరేగిపోతున్న స్మిత్.. అరుదైన రికార్డు నమోదు

భారత్ మీద చెలరేగిపోతున్న స్మిత్.. అరుదైన రికార్డు నమోదు

   14 hours ago


దంచికొట్టిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లు.. టీమ్ఇండియా ముందు భారీ టార్గెట్‌

దంచికొట్టిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లు.. టీమ్ఇండియా ముందు భారీ టార్గెట్‌

   15 hours ago


సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   28-11-2020


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   28-11-2020


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   28-11-2020


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   28-11-2020


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle