newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

14-04-202114-04-2021 07:32:53 IST
2021-04-14T02:02:53.211Z14-04-2021 2021-04-14T02:02:47.150Z - - 15-05-2021

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మ్యాచ్ ను లాగేసుకున్నారు.. అవును.. ముంబై ఇండియన్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ చేతుల్లో నుండి మ్యాచ్ ను లాగేసుకున్నారు. నైట్ రైడర్స్ ఓపెనర్లు ఆడిన ఆటను చూసి ఒకానొక దశలో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడిపోతుందని అనుకున్నారు. కానీ ముంబై ఇండియన్స్ బౌలర్లు మ్యాచ్ ను ఆఖరి బంతి వరకూ తీసుకుని వచ్చారు. పిచ్ కూడా బౌలింగ్ కు అనుకూలిస్తూ ఉండడం.. టాప్ క్లాస్ బౌలర్లు ఉండడంతో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.  

టాస్ ఓడిన ముంబై ఇండియన్స్ ను కోల్ కతా కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఒకానొక దశలో ముంబై 170 పరుగుల స్కోరు చేస్తుందని భావించారు. అయితే ఆఖర్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ ఆండ్రే రస్సెల్ బంతితో విజృంభించాడు. రస్సెల్ 2 ఓవర్ల వ్యవధిలో 5 వికెట్లు తీయడంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. క్రిస్ లిన్ స్థానంలో వచ్చిన ఓపెనర్ క్వింటన్ డికాక్ (2) విఫలమయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (43), సూర్యకుమార్ యాదవ్ జోడీ ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. 36 బంతులాడిన సూర్యకుమార్ యాదవ్ 7 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో, స్కోరు వేగం మందగించింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (1), రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత పతనమే.. 18 ఓవర్ లో రసెల్... తొలుత పొలార్డ్ ను అవుట్ చేశాడు. అదే ఓవర్లో మార్కో జాన్సెన్ ను కూడా అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో మళ్లీ బౌలింగ్ కు వచ్చిన రసెల్... ఈసారి మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వరుస బంతుల్లో కృనాల్ పాండ్య, బుమ్రా ను అవుట్ చేసి హ్యాట్రిక్ ముంగిట నిలిచాడు. రాహుల్ చహర్ హ్యాట్రిక్ బాల్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత బంతికే చహర్ అవుట్ కావడంతో రసెల్ ఖాతాలో ఐదో వికెట్ చేరింది. మొత్తమ్మీద 2 ఓవర్లలో 15 పరుగులిచ్చిన రసెల్ 5 వికెట్లు సాధించాడు. దీంతో ముంబై 152 పరుగులు చేసింది. 

ఛేజింగ్ లో కోల్ కతాకు మంచి ఆరంభం లభించింది. కోల్‌కతా ఓపెనర్లు రాణా, గిల్‌  72 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం నమోదు చేశారు. చహర్ మ్యాజిక్ చూపించాడు. శుభమన్ గిల్ 33 పరుగుల వద్ద అవుట్ చేసిన చహర్‌ తన తదుపరి ఓవర్లలో వరుసగా రాహుల్‌ త్రిపాఠి (5), కెప్టెన్‌ మోర్గాన్‌ (7), నితీశ్‌ రాణాలను ఔట్‌ చేయడంతో ముంబై పట్టు బిగించింది. షకీబ్‌ (9) కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 15.2 ఓవర్లలో కోల్‌కతా 122 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.  16వ ఓవర్లో కృనాల్‌ ఒక పరుగు మాత్రమే ఇచ్చి వికెట్‌ తీశాడు. రసెల్‌ రిటర్న్‌ క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 17వ ఓవర్లో బుమ్రా 8 పరుగులిచ్చినా... మరుసటి ఓవర్‌ వేసిన కృనాల్‌ 3 పరుగులే ఇచ్చాడు. బుమ్రా తన 19వ ఓవర్లో 4 పరుగులు ఇచ్చాడు. ఇక ఆఖరి 6 బంతుల్లో కోల్‌కతా విజయానికి 15 పరుగులు అవసరం కాగా..  బౌల్ట్‌ మూడో బంతికి రసెల్‌ (9)ను రిటర్న్‌ క్యాచ్‌తో, నాలుగో బంతికి కమిన్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. చివరకు 4 పరుగులే ఇవ్వడంతో కోల్‌కతా 142/7 స్కోరు దగ్గరే ఆగిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాహుల్ చహర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle