newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!

10-04-202110-04-2021 07:25:33 IST
Updated On 10-04-2021 09:12:46 ISTUpdated On 10-04-20212021-04-10T01:55:33.270Z10-04-2021 2021-04-10T01:55:28.228Z - 2021-04-10T03:42:46.114Z - 10-04-2021

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్-14 సీజన్ మొదలైంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడించింది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆఖరి బంతి వరకూ మ్యాచ్ సాగింది. ఒకానొక దశలో ఎంతో సునాయాసంగా మ్యాచ్ ను బెంగళూరు గెలుస్తుందని భావించారు. కానీ మ్యాచ్ చివరికి ఉత్కంఠగా మారింది. అయినప్పటికీ విజయం ఆర్సీబీనే వరించింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ కు 2 వికెట్ల పరాజయం తప్పలేదు.

సీజన్ ఈ తొలిసమరంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా 160 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్ ఆఖరు బంతికి విజయాన్ని అందుకుంది. 5 వికెట్లను తీసిన బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబయి జట్టుకు తొలిసారి ఆడతున్న క్రిస్ లిన్ 49 పరుగులు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేశాడు. బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ 19, క్రిస్ లిన్ 49, సూర్యకుమార్ 31, ఇషాన్ 28, హార్థిక్ పాండ్యా 13 పరుగుల స్కోర్లకే పరిమితమయ్యారు. బెంగళూరు బౌలర్లలో యువఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్,జామీ సన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఆరు ఓవర్లలో ముంబై బ్యాటింగ్ విధ్వంసం ఈ మ్యాచ్ లో కనిపించకపోవడంతో భారీ స్కోరును ముంబై చేరుకోలేకపోయింది. 

బెంగళూరు ఇన్నింగ్స్ ను కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కలసి ప్రారంభించారు. సుందర్ 10 పరుగుల స్కోరుకే అవుటైనా…మాక్స్ వెల్ తో కలసి కెప్టెన్ కొహ్లీ కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. డివిలియర్స్ తో కలసి మరో కీలక భాగస్వామ్యం నమోదు చేసి అవుటయ్యాడు. కొహ్లీ 33 పరుగులు, మాక్స్ వెల్ 39 పరుగుల స్కోర్లకు వెనుదిరిగారు. ఇక డివిలియర్స్ తనదైన శైలిలో గ్రౌండ్ నలుమూలలకూ భారీషాట్లు కొట్టి 48 పరుగుల స్కోరు ద్వారా తనజట్టును విజయానికి చేరువ చేశాడు. ఆఖరి ఓవర్లో కాస్త సస్పెన్స్ నటించింది. హర్షల్ పటేల్ విజయానికి అవసరమైన పరుగు సాధించడం ద్వారా బెంగళూరు కు 2 వికెట్ల విజయం అందించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా,జెన్సన్ చెరో 2వికెట్లు, బౌల్ట్, కృణాల్ చెరో వికెట్ పడగొట్టారు. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle