newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

మళ్ళీ టాప్ కు వెళ్లిన ముంబై..!

17-10-202017-10-2020 09:06:45 IST
Updated On 17-10-2020 11:20:44 ISTUpdated On 17-10-20202020-10-17T03:36:45.856Z17-10-2020 2020-10-17T03:36:37.482Z - 2020-10-17T05:50:44.791Z - 17-10-2020

మళ్ళీ టాప్ కు వెళ్లిన ముంబై..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ 2020లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుసగా అయిదు మ్యాచ్ లలో ఈ సీజన్ లో విజయం సాధించింది ముంబై.  కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 19 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఈ గెలుపుతో 12 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు చేసింది. టాపార్డర్ విఫలమవ్వడంతో  ప్యాట్ కమ్మిన్స్ బ్యాటింగ్ భారాన్ని భుజాన వేసుకున్నాడు.  కమ్మిన్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తో కలిసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కమ్మిన్స్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  మోర్గాన్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 39 పరుగులు నమోదు చేశాడు. 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి కోల్ కతాను ఓ మోస్తరు స్కోరుకు తీసుకువచ్చారు కమిన్స్-మోర్గాన్. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ 2 వికెట్లు తీయగా, బౌల్ట్, కౌల్టర్ నైల్, బుమ్రా తలో వికెట్ తీశారు.

స్వల్ప లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 19 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఓపెనర్లు రోహిత్‌శర్మ క్వింటన్ డికాక్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  హార్ధిక్ పాండ్యా, డికాక్‌లు కలిసి లాంఛనాన్ని పూర్తీ చేశారు. డికాక్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78 పరుగులు చేయగా, పాండ్యా 11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 21 పరుగులు చేశాడు. మరో 19 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన క్వింటన్ డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

   18 hours ago


సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

   19 hours ago


రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

   20 hours ago


పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

   20 hours ago


రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

   a day ago


రోహిత్ శర్మకు ఏమైందో చెప్పండి

రోహిత్ శర్మకు ఏమైందో చెప్పండి

   a day ago


ఢిల్లీని అప్పుడే ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండా ఆపేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

ఢిల్లీని అప్పుడే ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండా ఆపేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

   a day ago


ఇప్పట్లో రిటైర్ అవ్వను: గేల్

ఇప్పట్లో రిటైర్ అవ్వను: గేల్

   27-10-2020


అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పండి: హర్భజన్ సింగ్

అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పండి: హర్భజన్ సింగ్

   27-10-2020


ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

   27-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle