ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-202107-04-2021 08:44:13 IST
Updated On 07-04-2021 10:06:06 ISTUpdated On 07-04-20212021-04-07T03:14:13.578Z07-04-2021 2021-04-07T03:14:03.044Z - 2021-04-07T04:36:06.652Z - 07-04-2021

డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఈ శుక్రవారం మొదటి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇలాంటి సమయంలో ఆ జట్టు శిబిరంలో కరోనా కలకలం మొదలైంది. టీమిండియా మాజీ వికెట్ కీపర్, ముంబై ఇండియన్స్ వికెట్ కీపింగ్ సలహాదారు కిరణ్ మోరేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మోరే ముంబై ఇండియన్స్‌కు వికెట్ కీపింగ్ కన్సల్టెంట్‌గా, ప్రతిభాన్వేషకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయన వైరస్ బారిన పడినట్లు తేలిందని ముంబై ఇండియన్స్ యాజమాన్యం వెల్లడించింది. మోరేకు ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ, నిబంధనల ప్రకారం ఆయనను ఐసోలేషన్‌కు తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందిస్తున్నామని అన్నారు. బీసీసీఐ రూపొందించిన ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోందని ముంబై ఇండియన్స్ యాజమాన్యం తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న వేళ అభిమానులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. జట్టు సభ్యులు బస చేస్తున్న హోటల్లోనే కిరణ్ మోరే కూడా ఉండటంతో తొలుత ముంబై యాజమాన్యం ఆందోళన చెందింది. తమ జట్టు ఆటగాళ్లు, సహయ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటివ్ రావడంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కిరణ్ మోరేకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన ఫ్రాంఛైజీ, మంగళవారం ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసి మరీ అందరికీ పరీక్షలు నిర్వహించింది. అయితే కోవిడ్ పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రావడంతో ఆనందం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 9న జరుగనున్న ఐపీఎల్ 14వ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొంటుంది. మరో వైపు వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా లక్షణాలు బయటపడుతూ ఉండడం.. బీసీసీఐని కాస్త భయపెడుతూ ఉంది. వాంఖడే మైదానం వేదికగా 14వ ఎడిషన్ ఐపీఎల్ మ్యాచ్‌లు యధాతధంగా జరుగుతాయని మహారాష్ట్ర సర్కారు ప్రకటించగా.. ఇంతలోనే మరో ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ నిర్ధారణ అయిన వారిలో ఒకరు ప్లంబర్ కాగా, మరో ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ అని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వెల్లడించింది.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
15 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
16 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
a day ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్‌ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021

ఐపీఎల్ ను వాయిదా వేసే అవకాశమే లేదు: సౌరవ్ గంగూలీ
05-04-2021
ఇంకా