newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్ ముంబై ఇండియన్స్ టాప్

12-10-202012-10-2020 08:08:07 IST
2020-10-12T02:38:07.002Z12-10-2020 2020-10-12T02:38:04.888Z - - 25-10-2020

ఢిల్లీ క్యాపిటల్స్‌కి షాక్ ముంబై ఇండియన్స్ టాప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒకే ఒక్క ఓటమితో దూసుకెళుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై ఇండియన్స్‌ బ్రేక్‌ వేసింది. బంతితోనూ, బ్యాట్‌తోనూ ఆకట్టుకున్న డిఫెండింగ్‌ చాంపియన్‌.. 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి ఓవర్‌కు సాగిన పోరులో సూర్యకుమార్‌ (53), డికాక్‌ (53) అర్ధసెంచరీలతో రాణించారు. వరుసగా నాలుగో విజయం సాధించిన ముంబై తిరిగి పాయింట్ల పట్టికలో టాప్‌నకు చేరింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్‌ ధవన్‌ (69 నాటౌట్‌), శ్రేయాస్‌ అయ్యర్‌ (42) రాణించారు. వీరి ఇన్నింగ్స్‌లో ఒకే సిక్సర్‌ రావడం గమనార్హం. క్రునాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై ఇండియన్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి నెగ్గింది. రబాడకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డికాక్‌ నిలిచాడు. 

టాప్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరకు ముంబై విజయఢంకా మోగించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(5) వెంటనే అవుటైనా మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్(36 బంతుల్లో 53) ఫామ్‌లోకి రావడం ముంబైకి కలిసొచ్చింది. డీకాక్‌తో పాటు సూర్య కుమార్ యాదవ్(32 బంతుల్లో 53) కూడా అర్థ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరికీ తోడు ఇషాన్ కిషన్(15 బంతుల్లో 28) కూడా రాణించడంతో ముంబై విజయానికి చేరువైంది. చివర్లో బర్త్‌డే బాయ్ హార్దిక్ పాండ్యా(0) డకౌట్‌గా వెనుదిరిగినా.. పొలార్డ్(11 బంతుల్లో 11), కృనాల్ పాండ్యా(7 బంతుల్లో 12) లాంచనాన్ని ముగించారు. దీంతో మరో రెండు బంతులు మిగిలుండగానే ముంబై విజయం సాధించింది. 

ముందుగా బ్యాటింగ్‌ చేసి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(42; 33 బంతుల్లో 5 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌(69 నాటౌట్‌; 52 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ ఆదిలోనే పృథ్వీ షా(4) వికెట్‌ను కోల్పోయింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో కృనాల్‌ పాండ్యా క్యాచ్‌ పట్టడంతో పృథ్వీ షా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ధావన్‌కు రహానే జత కలిశాడు. రహానే వచ్చీ రావడంతో మంచి టచ్‌లో  కనిపించాడు. రహాన్‌ మూడు ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్‌ చేరడంతో ఢిల్లీ 24 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 

ఆపై ధావన్‌-అయ్యర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 85 పరుగుల జోడించిన తర్వాత అయ్యర్‌ ఔట్‌ కాగా, స్టోయినిస్‌(13) కూడా ఎ‍క్కువ సేపు క్రీజ్‌లో  ఉండలేకపోయాడు. ధావన్‌తో సమన్వయం లోపంతో స్టోయినిస్‌ రనౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ధావన్‌ కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో పాటు అలెక్స్‌ క్యారీ( 14 నాటౌట్‌) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో కృనాల్‌ పాండ్యా రెండు వికెట్లు సాధించగా, ట్రెంట్‌ బౌల్ట్‌కు వికెట్‌ దక్కింది.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ మూడు మ్యాచుల తరువాత పరాజయం చవి చూసింది. అయితే ముంబై మాత్రం వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల టేబుల్లో అగ్రస్థానానికి చేరింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించడం విశేషం.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle