newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

14-01-202114-01-2021 16:44:24 IST
2021-01-14T11:14:24.853Z14-01-2021 2021-01-14T11:14:22.094Z - - 14-05-2021

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ లోని మూడు ఫార్మాట్లనుంచి వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోనీ క్షణం కూడా వృధా చేయకుండా ప్రైవేట్ బిజినెస్ వైపు మళ్లిన విషయం తెలిసిందే. సొంత ఫామ్ హౌస్‌లో కోళ్ల వ్యాపారం మొదలెట్టిన ధోనీ మంచి లాభాలు ఆర్జిస్తున్న సమయంలోనే బర్డ్ ఫ్లూ పులిమీద పుట్రలా వచ్చి పడింది. దీంతో మేలుజాతి కోళ్ల ఆర్డర్‌ను కూడా దోనీ రద్దు చేసుకోవలసి వచ్చింది.

క్రికెట్‌కు వీడ్కోలు పలికి, రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్‌లో ఆర్గానిక్‌ పౌల్ట్రీ  పరిశ్రమను నెలకొల్సిన ధోని..  అత్యధిక పోషక విలువలు కలిగిన నల్ల (కడక్‌నాథ్‌) కోళ్ల పెంపకం చేపట్టారు. అలాగే హైదరాబాద్‌ ప్రాంతంలో లభ్యమయ్యే గ్రామప్రియ కోళ్ల పెంపకంపై కూడా ధోనీ దృష్టి సారించాడు 

ఈ రకం కోళ్ల మాంసం ఆరోగ్య సంరక్షణలోనూ, సంతానోత్పత్తిని పెంపొందించడంలోనూ సత్ఫలితాల్నిస్తోందని సమాచారం.. కడక్‌నాథ్‌ చికెన్‌ ధర కేజీకి రూ. 900 నుంచి రూ. 1,200 వరకు ఉండగా, గ్రామప్రియ చికెన్‌ కూడా ఇంచుమించు అంతే ధర పలుకుతుంది. టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోని ప్రారంభించిన కడక్‌నాథ్‌ కోళ్ల వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ సెగ తగిలింది. 

దేశంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ విస్తరిస్తున్న నేపధ్యంలో ధోని ఆర్డర్‌ చేసిన రెండు వేల కడక్‌నాథ్‌ కోళ్లను, అంతే సంఖ్యలోని గ్రామప్రియ కోళ్ల ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ధోని ఆర్డర్‌ చేసిన కోళ్లు రవాణాకు సిద్దమైన తరుణంలో బర్డ్‌ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్‌ విశ్వరాజన్‌ దృవీకరించారు.

హైదరాబాద్ కోళ్లంటే దోనీకి మక్కువ..

మన దేశంలో కడక్‌నాథ్ చికెన్‌ పేరుతో పిలువబడే నల్లకోళ్ళను మధ్యప్రదేశ్‌లోని ఝబువా ప్రాంతం నుంచి గ్రామప్రియ కోళ్లను హైదరాబాద్‌ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారు. అందుకే పేరు మోసిన కడక్ నాథ్ కోళ్లతోపాటు హైదరాబాద్ గ్రామప్రియ కోళ్లను కూడా ధోనీ ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటున్నాడు.

మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే బర్డ్ ఫ్లూ ప్రభావంతో 2,500 కడక్‌నాథ్ కోళ్లను చంపేశారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ నుంచి కడక్ నాథ్ కోళ్లు, హైదరాబాద్ నుంచి గ్రామప్రియ కోళ్లను కొనాలని ధోనీ కోసం చేసిన ఆర్డర్‌ని విధిలేక రద్దు చేసుకున్నట్లు ధోనీ ఫౌల్ట్రీ ఫామ్ డైరెక్టర్ వినోద్ మెహతా చెప్పారు. వ్యవసాయ క్షేత్రంలో మొత్త 2,850 కోళ్లను పెంచాలని ధోనీ నిర్ణయించుకున్నప్పటికీ బర్డ్ ఫ్లూ వల్ల ఇప్పుడు ఫామో హౌస్‌లో 150 కోళ్లు మాత్రమే ఉన్నాయని మెహతా చెప్పారు.

కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా(బర్డ్‌ఫ్లూ) అనే వైరస్‌.. దేశంలో శరవేగంగా వ్యాపిస్తూ  వేలసంఖ్యలో పక్షి జాతుల మనుగడను ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. లక్షలాది పక్షుల ప్రాణాలను హరిస్తున్న ఈ వైరస్‌ దేశంలోని పది రాష్ట్రాలకు వ్యాపించింది. ముఖ్యంగా దీని ప్రభావం మధ్యప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle