newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

ఆ బాధతోనే ముఖం చాటేసిన రోహిత్ శర్మ..!

19-10-202019-10-2020 09:33:35 IST
Updated On 19-10-2020 10:01:18 ISTUpdated On 19-10-20202020-10-19T04:03:35.494Z19-10-2020 2020-10-19T04:03:31.936Z - 2020-10-19T04:31:18.761Z - 19-10-2020

ఆ బాధతోనే ముఖం చాటేసిన రోహిత్ శర్మ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రోహిత్ శర్మ.. ఐపీఎల్ లో గొప్ప నాయకుడు. ఈ సీజన్ లో రెండు ఇన్నింగ్స్ మినహా గొప్ప బ్యాటింగ్ ను చేయలేకపోతూ ఉన్నాడు. ముఖ్యంగా నిలకడ అన్నది లోపించింది. అలాగని అతడి ట్యాలెంట్ ను ఎవరూ సందేహించరు. తాను బ్యాట్ తో రాణించలేకపోతున్నాను అనే బాధ అతడిలో కూడా కనిపిస్తోంది. కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సూపర్ ఓవర్ లో పేలవమైన ఆటతీరును కనబరిచాడు. అద్భుతమైన బౌలింగ్ తో మొదటి సూపర్ ఓవర్ లో బుమ్రా కట్టడి చేస్తే.. 6 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ శర్మ-డికాక్ లు కలిసి కొట్టలేకపోయారు. ఇక రెండో సూపర్ ఓవర్ లో పంజాబ్ విజయం సాధించింది. మొదటి సూపర్ ఓవర్ లో  మరీ అంత పెద్ద లక్ష్యం లేకపోయినా రోహిత్ శర్మ సరిగా ఆడలేకపోయాడు. ఇక్కడే మ్యాచ్ ను నెగ్గే మంచి ఛాన్స్ ముంబైకి వచ్చింది. కానీ నెగ్గలేకపోయారు. 

ఈ బాధతోనే ప్రెజెంటేషన్ కు కెప్టెన్ రోహిత్ శర్మ రాలేకపోయాడు. రోహిత్ బదులుగా కెప్టెన్ గా కీరన్ పోలార్డ్ వచ్చాడు. రోహిత్ శర్మ బాధలో ఉన్నాడని అందుకే తాను వచ్చానని పోలార్డ్ తెలిపాడు. టీ20 క్రికెట్‌లో ఒక్కో పరుగు ఎంత విలువైందో ఈ మ్యాచ్ తెలియజేసిందని పోలార్డ్ అన్నాడు. అభిమానులకు కావాల్సిన మజా లభించిందనుకుంటున్నానని, ఈ విజయానికి పంజాబ్ ఆటగాళ్లు పూర్తిగా అర్హులని చెప్పాడు. మా కంటే అద్భుతంగా ఆడిన పంజాబ్‌ ప్లేయర్స్ ఈ విజయానికి అర్హులు. 170 పరుగులు మంచి లక్ష్యం. స్లో వికెట్, పెద్ద మైదానం కారణంగా ఈ లక్ష్యాన్ని కాపాడుకుంటామనుకున్నాం. కానీ కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వారందరికి నా అభినందనలు. ఇలాంటి ఫలితాలు సహజమేనని తప్పులును సవరించుకుంటూ ముందుకు వెళ్లాల్సిందేనన్నాడు పోలార్డ్. 

మ్యాచ్ టై కావడంతో ఫలితాన్ని తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేసింది. బుమ్రా మరో సంచలమైన ఓవర్ వేశాడు. షమీ అద్భుత బౌలింగుతో ముంబై ను మొదటి సూపర్ ఓవర్ లో విజయం సాధించకుండా అడ్డుకున్నాడు. తొలి 5 బంతుల్లో 4 పరుగులు రాగా, చివరి బంతికి ఒక పరుగు తీసి, రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో డికాక్ రన్ అవుట్ అయ్యాడు. మ్యాచ్ మరోమారు టై అయింది.  ఫలితంగా విజేతను తేల్చేందుకు మరో సూపర్ ఓవర్ పెట్టారు. 

ముంబై పొలార్డ్, హార్దిక్ పాండ్యాలను బరిలోకి దింపింది. జోర్డాన్ కట్టుదిట్టమైన బౌలింగుకు దిగాడు. తొలి రెండు బంతులకు మూడు పరుగులు రాగా, మూడో బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించాడు. నాలుగో బంతి వైడ్ కాగా,  ఆ తర్వాతి బంతికి పాండ్యా రనౌట్ అయ్యాడు. ఐదో బంతి డాట్ బాల్. చివరి బంతికి పొలార్డ్ రెండు పరుగులు చేయడంతో ముంబై వికెట్ నష్టానికి 11 పరుగులు మాత్రమే చేసింది. 12 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ మొదలుపెట్టగా..  గేల్‌, అగర్వాల్‌ క్రీజులోకి వచ్చారు. బౌల్ట్ వేసిన తొలి బంతినే గేల్ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికి సింగిల్ రాగా, మూడో బంతిని అగర్వాల్ బౌండరీకి పంపాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా, నాలుగో బంతిని అగర్వాల్ బౌండరీకి తరలించడంతో మ్యాచ్ పంజాబ్ గెలిచింది.  

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

   5 hours ago


ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

   6 hours ago


బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

   24-11-2020


కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

   24-11-2020


టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..?  అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..? అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

   24-11-2020


ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

   24-11-2020


ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

   23-11-2020


మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

   23-11-2020


నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

   23-11-2020


ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

   21-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle