newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

రోహిత్ సేనకు వరుసగా ఐదో విజయం.. చిత్తయిన కేకేఆర్

17-10-202017-10-2020 11:27:23 IST
2020-10-17T05:57:23.260Z17-10-2020 2020-10-17T05:57:19.768Z - - 29-10-2020

రోహిత్ సేనకు వరుసగా ఐదో విజయం.. చిత్తయిన కేకేఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2020లో తనకు ఎదురే లేదన్న రీతిలో సాగుతున్న ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయంతో సంచలనం కలిగించింది. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‎తో జరిగిన మ్యాచ్‎లో ముంబై ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఓపెనర్లు కెప్టెన్ రోహిత్, డికాక్ జట్టుకు వికెట్ కోల్పోకుండా మంచి ఆరంభాన్ని అందిచారు. ముంబై బ్యాటింగ్‎లో డికాక్ (44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 78) రన్స్ చేయగా..రోహిత్ శర్మ (36 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్, 35) పరుగులు చేశారు. దీంతో అప్పటికే ముంబై ఇండియన్స్ విజయం దాదాపు ఖరారైంది. ఇదే క్రమంలో రోహిత్ 35 పరుగుల వద్ద ఔట్ కాగా ..అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా వెంటనే 10 పరుగుల వద్ద వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన హార్థిక్ పాండ్య (11 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్ తో 21)రన్స్ చేసి మ్యాచ్‎ను ముగించాడు. దీంతో ముంబై రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొలిస్థానంలో కొనసాగుతోంది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ టీమ్‎లో కెప్టెన్ ను మార్చిన కానీ మ్యాచ్‎కు కలిసి రాలేదు. కోల్‎కతా బ్యాటింగ్ వైఫల్యంతో. 61 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాలోపడింది. ఇదే తరుణంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మోర్గాన్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39)రన్స్ చేయగా.. తనకు తోడుగా కమిన్స్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53)పరుగులు చేసి..జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలింగింది.  దీంతో కోల్‎కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 148 రన్స్ చేసింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్, కౌల్టర్ నౌల్, బుమ్రాలు చెరో వికెట్ తీసుకున్నారు. 

ముంబై హోరెత్తిస్తోంది. ఆల్‌రౌండ్‌ సత్తా చాటుతోంది. బౌలింగ్‌తో కట్టేసి, మెరుపు బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని చుట్టేస్తోంది. తొలుత రాహుల్‌ చహర్‌ స్పిన్‌ మాయాజాలం రోహిత్‌ సేనకు బలంకాగా... ఓపెనర్లు రోహిత్, డికాక్‌ దూకుడుతో లక్ష్యం కూడా సులువైంది. వరుసగా ఐదో విజయంతో, ఓవరాల్‌గా ఆరో విజయంతో, మెరుగైన రన్‌రేట్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ గెలిచింది. దీనికి విరుద్ధంగా ముంబై ఇండియన్స్‌ వరుసగా ఐదో విజయం సాధించింది. ఐపీఎల్‌లో శుక్రవారం జరిగిన పోరులో రోహిత్‌ సేన 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది.

ఆడుతూ.. పాడుతూ: స్వల్ప లక్ష్య ఛేదనను ముంబై ఇండియన్స్‌ ఎలాంటి తడబాటు లేకుండా ముగించింది. తొలి బంతినే ఫోర్‌గా మలిచిన కెప్టెన్‌ రోహిత్‌.. ఆ తర్వాత మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదడంతో తొలి 18 బంతుల్లోనే జట్టు స్కోరు 30 పరుగులకు చేరింది. అటు డికాక్‌ కూడా వరుస ఫోర్లతో చెలరేగడంతో ఈ సీజన్‌లో ముంబై జట్టు తమ పవర్‌ప్లేలో 50+ స్కోరును సాధించడంతో పాటు ఒక్క వికెట్‌ను కూడా కోల్పోలేదు. మరో 19 బంతులుండగానే ముంబై విజయ లాంఛనం ముగించింది. ఇదే ఆటను చివరివరకు కొనసాగించిన రోహిత్ సేన సగర్వంగా వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది

ప్రత్యర్థి ఎవరైనా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ విజయమే లక్ష్యంగా సాగిపోతోంది. వరుసగా ఐదు విజయాలతో హోరెత్తిస్తూ తిరిగి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ముందుగా బౌలర్లు కోల్‌కతాను కట్టడి చేయగా.. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ ఆడుతూ, పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. డికాక్‌ ఫామ్‌ను చాటుకుంటూ మరో అర్ధసెంచరీతో మెరిశాడు. మరోవైపు కెప్టెన్‌ మారినా కేకేఆర్‌ రాత మాత్రం మారలేదు. వరుసగా రెండో పరాజయంతో డీలా పడింది.

 

సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

   19 hours ago


సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

   19 hours ago


రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

   20 hours ago


పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

   21 hours ago


రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

   a day ago


రోహిత్ శర్మకు ఏమైందో చెప్పండి

రోహిత్ శర్మకు ఏమైందో చెప్పండి

   a day ago


ఢిల్లీని అప్పుడే ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండా ఆపేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

ఢిల్లీని అప్పుడే ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండా ఆపేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

   a day ago


ఇప్పట్లో రిటైర్ అవ్వను: గేల్

ఇప్పట్లో రిటైర్ అవ్వను: గేల్

   27-10-2020


అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పండి: హర్భజన్ సింగ్

అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పండి: హర్భజన్ సింగ్

   27-10-2020


ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

   27-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle