newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

వీరూ మాటలకు ఫీల్ అయిన మ్యాక్స్ వెల్

21-11-202021-11-2020 08:45:11 IST
2020-11-21T03:15:11.206Z21-11-2020 2020-11-21T03:15:08.544Z - - 29-11-2020

వీరూ మాటలకు ఫీల్ అయిన మ్యాక్స్ వెల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో అత్యంత దారుణ ప్రదర్శన కనబరిచాడు. 13 మ్యాచ్ లు ఆడి కేవలం 108 పరుగులు చేశాడు. అతని సగటు 15.42.  కింగ్స్ లెవెన్ పంజాబ్ ఆటగాడు మ్యాక్స్ వెల్ మీద కొద్ది రోజుల కింద భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  సెటైర్లు వేశారు. ఈ సీజన్ లో మ్యాక్స్ వెల్ రూ. 10 కోట్లు తీసుకున్న చీర్ లీడర్ గా మాత్రమే మిగిలిపోయాడని అన్నారు. "గ్లెన్ మ్యాక్స్ వెల్ ను రూ. 10 కోట్లు పెట్టి పంజాబ్ కొనుగోలు చేసింది. గత కొన్ని సీజన్లలో అతనికి చాలా బ్యాడ్ రికార్డు ఉంది. ఈ సీజన్ లో అతనికి డబ్బులు వచ్చాయి గానీ, అభిమానులకు ఆనందం మాత్రం మిగల్లేదు" అని చెప్పుకొచ్చారు. చాలా ఎక్కువ ఖర్చు చేసి మ్యాక్స్ వెల్ కు విశ్రాంతి ఇచ్చినట్లయిందని సెహ్వాగ్ అన్నారు. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఎన్నో అవకాశాలను ఇచ్చినా కూడా మ్యాక్స్ వెల్ వినియోగించుకోలేకపోయాడు. ఇంటర్నేషనల్ లో అద్భుతంగా ఆడే మ్యాక్స్ వెల్ ఎందుకు ఇంత చెత్తగా ఆడుతున్నాడోనని అభిమానులు అయోమయ పడ్డారు. 

కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు  ఈ సీజన్ లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌లను తప్పించాలని భావిస్తోంది. మ్యాక్స్‌వెల్‌ (రూ.10.75 కోట్లు), కాట్రెల్‌ (రూ.8.5 కోట్లు) సరైన ప్రదర్శన చేయకపోవడంతో వారిని తర్వాతి సీజన్ లో కొనసాగించకపోవచ్చనే తెలుస్తోంది. 

సెహ్వాగ్ వ్యాఖ్యలపై మ్యాక్స్ వెల్ స్పందించాడు. తానంటే నచ్చకపోవడంతోనే వీరూ ఇలా మాట్లాడి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. అందుకు తానేమీ అభ్యంతరపెట్టబోనని, తాను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో సెహ్వాగ్ అది మాట్లాడొచ్చని అన్నాడు. ప్రస్తుతం అతను మీడియాలో ఉన్నాడు... ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోతే ఎలా! నేను మాత్రం అతని వ్యాఖ్యలను పట్టించుకోవడంలేదని చెప్పుకొచ్చాడు. ఆ వ్యాఖ్యలను తేలిగ్గానే తీసుకుంటున్నా. ఈ సంవత్సరం నాకు కఠినపరీక్షగానే భావిస్తానని తెలిపాడు.

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   12 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   16 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   18 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle