newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

ఎవరిది మూడో విజయం..? ఎవరిది రెండో ఓటమి..?

03-10-202003-10-2020 13:36:57 IST
2020-10-03T08:06:57.498Z03-10-2020 2020-10-03T08:06:26.612Z - - 29-10-2020

ఎవరిది మూడో విజయం..? ఎవరిది రెండో ఓటమి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌లో నేడు తొలి డబుల్‌ హెడర్‌. అభిమానులకు పండుగే. ఒకే రోజు రెండు మ్యాచ్‌లు అలరించనున్నాయి. తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. లీగ్లో ఇప్పటిదాకా మూడు మ్యాచ్లాడిన ఇరుజట్లు చెరో రెండు విజయాలు సాధించాయి. ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ 5 స్థానంలో ఉండగా.. బెంగళూరు 6వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోనుంది.

వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్థాన్‌కు కేకేఆర్‌ షాకిచ్చింది. దీంతో బెంగళూరుపై గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని రాజస్థాన్‌ బావిస్తోంది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్, సంజు శాంసన్‌ లు రాణించడంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. కోల్‌కత్తాతో మ్యాచ్‌లో వారు విఫలం కావడంతో ఓటమి పాలైంది. వీరిద్దరే బ్యాటింగ్‌ భారాన్ని మొత్తం మోస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న జోస్ బట్లర్‌ రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో రాణించాలని బట్లర్‌ కృతనిశ్చయంతో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో రాణించిన యశశ్వీ జైస్వాల్‌ను గత రెండు మ్యాచ్‌ల్లో రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేశారు. బెంగళూరుతో మ్యాచ్‌లో అతడిని ఆడించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌లో అర్చర్‌ మాత్రమే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. జోఫ్రే ఆర్చర్‌కు తోడుగా జయదేవ్‌ ఉనద్కత్‌, అంకిత్‌ రాజ్‌పుత్‌, టామ్‌ కరన్‌లు రాణిస్తే.. ఆర్‌ఆర్‌ ఖాతాలో మూడో విజయం చేరినట్లే..

నిరాశపరిచిన ఓటమి తరువాత ముంబైపై వచ్చిన గెలుపుతో బెంగళూరు ఉత్సాహంగా కనిపిస్తోంది. నేటి మ్యాచ్‌లో కూడా గెలిచి విజయ పరంపర కొనసాగించాలని చూస్తోంది. ఓపెనర్లు పడిక్కల్‌, ఫించ్‌ మంచి ఆరంభాలు ఇస్తుండగా.. డివిలియర్స్‌, దూబే వాటిని భారీ స్కోర్లుగా మలుస్తున్నారు. కెప్టెన్‌ కోహ్లీ ఒక్కడు కూడా ఫామ్‌ అందుకుంటే.. రాజస్థాన్‌కు తిప్పలు తప్పవు. ఇక బౌలింగ్‌లో సైనీతో పాటు స్పిన్నర్‌ చాహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నారు. వీరిని ఎదుర్కొనడం రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్లకు సవాలే. వీరిద్దరు రాణిస్తే మరో గెలుపు ఆర్‌సీబీ సొంతం అయినట్లే.

ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకు 20 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ విజయం సాధించగా.. 8 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలిచింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. ఇన్నాళ్లూ లీగ్లో ప్లేయర్లను మంచు ఇబ్బంది పెట్టగా.. ఇప్పుడు ఉక్కపోత సవాల్ విసరనుంది. ఇదికాక.. షార్జా, దుబాయ్తో పోలిస్తే అబుదాబిలోని షేక్ జియెద్‌‌ స్టేడియం పెద్దది కావడం మరో చాలెంజ్.

సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

సానియా మీర్జా మీద సంచలన ఆరోపణలు చేసిన రాజా సింగ్

   19 hours ago


సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

సందడి.. సందడిగా.. వార్నర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

   19 hours ago


రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

రోహిత్‌కి ఏమైందో తెలుసుకునే హక్కు ఫ్యాన్స్‌కి లేదా.. గవాస్కర్ ప్రశ్న

   20 hours ago


పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

పుట్టినరోజు నాడు వీరవిహారం చేసిన వార్నర్.. ఏమి చెప్పాడంటే

   21 hours ago


రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

రబాడాను ఓ ఆటాడేసుకున్న సన్ రైజర్స్.. అరుదైన రికార్డును అందుకోలేకపోయాడు

   a day ago


రోహిత్ శర్మకు ఏమైందో చెప్పండి

రోహిత్ శర్మకు ఏమైందో చెప్పండి

   a day ago


ఢిల్లీని అప్పుడే ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండా ఆపేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

ఢిల్లీని అప్పుడే ప్లే ఆఫ్స్ కు వెళ్లకుండా ఆపేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

   a day ago


ఇప్పట్లో రిటైర్ అవ్వను: గేల్

ఇప్పట్లో రిటైర్ అవ్వను: గేల్

   27-10-2020


అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పండి: హర్భజన్ సింగ్

అతన్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదో చెప్పండి: హర్భజన్ సింగ్

   27-10-2020


ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

   27-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle