newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

రాజస్థాన్‌ విజయ పరంపర కొనసాగేనా..?

30-09-202030-09-2020 15:27:08 IST
2020-09-30T09:57:08.131Z30-09-2020 2020-09-30T09:56:40.939Z - - 20-10-2020

రాజస్థాన్‌ విజయ పరంపర కొనసాగేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్టు ఓ వైపు.. చివరి మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల ఖాతా తెరిచిన జట్టు మరో వైపు. నేడు దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపుమీదున్న రాజస్థాన్ తన విజయాల జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తుండగా.. రెండు మ్యాచుల్లో తొలి మ్యాచ్‌ ఓడి రెండో మ్యాచ్‌ గెలిచిన కోల్‌కత్తా.. రాజస్థాన్‌ను ఓడించాలని పట్టుదలతో ఉంది.

రాజస్థాన్‌ ఆడిన రెండు మ్యాచ్‌లు కూడా షార్జా స్టేడియంలో ఆడినవే. ఆరెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. గ్రౌండ్‌ చిన్నది కావడంతో.. సిక్సర్ల వర్షం కురిసింది. కోల్‌కత్తాతో జరిగే మ్యాచ్‌లోనే రాజస్థాన్‌కు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఎందుకంటే.. షార్జాతో పోలీస్తే దుబాయ్‌ బౌండరీ కొంచెం పెద్దది. బంతిని బౌండరీ దాటించడం అంత ఈజీ కాదు. మరీ రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్లు ఈ గ్రౌండ్‌లో ఎలా ఆడతారో అనేదానిపైనే ఆ జట్టు విజయావశాలు ఆధారపడి ఉన్నాయి.

అయితే.. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌పై రికార్డు స్కోర్‌ చేజింగ్‌ చేయడం రాజస్థాన్‌ అత్మవిశ్వాసం పెంచేదే. ముఖ్యంగా సంజు శాంసన్‌, కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ లు భీకర ఫామ్‌లో ఉన్నారు. వీరికి తోడు రాహుల్‌ తెవాటియా, జోప్రా అర్చర్‌లు తలో చేయి వేయడంతో.. ఆడిన రెండు మ్యాచుల్లో ఇబ్బందులు రాలేదు. క్వారంటైన్‌ నిబంధనలు కారణంగా.. తొలి మ్యాచ్‌ ఆడలేకపోయిన ఆ జట్టు స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో నిరాశపరిచాడు. బట్లర్‌ కూడా ఫామ్‌ అందుకుంటే.. బ్యాటింగ్‌లో రాజస్థాన్‌కు తిరుగుండదు.

ఇక కోల్‌కత్తా పరిస్థితి భిన్నంగా ఉంది. తొలి మ్యాచ్‌లో ఢిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓటమి తరువాత ఆ జట్టు బాగానే పుంజుకుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్ రెండో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కూడా ఈ యువఆటగాడు మరోసారి రాణించాలని కోల్‌కత్తా టీమ్‌మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఇక కెప్టెన్‌ కార్తీక్‌, ఆండ్రూ రసెల్‌, మోర్గాన్‌, సునీల్‌ నరేన్‌ తమ సత్తా చాటితే.. రాజస్థాన్‌కు తిప్పలు తప్పవు. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌లో విఫలమైన ప్యాట్‌కమిన్స్‌.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి విమర్శకుల నోరు మూయించాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 14 పరుగులే ఇచ్చి ఓ వికెట్‌ తీశాడు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌గిల్‌, సంజుశాంసన్‌లపై అందరి దృష్టి నెలకొంది. అయితే.. ఈ ఇద్దరికి బౌలర్ల నుంచి గట్టి పోటి ఎదరుకానుంది. అందులో ఒకరు రాజస్థాన్‌ బౌలర్‌ ఆర్చర్‌ కాగా.. ఇంకొకరు ప్యాట్ కమిన్స్‌. దీంతో ఈ పోరు గిల్‌ vs ఆర్చర్‌, కమిన్స్‌ vs శాంసన్‌గా మారనుంది. మరీ ఈ మ్యాచ్‌లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరీ. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle