newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్ ని తిరస్కరించిన మణికా బాత్రా

25-07-202125-07-2021 11:34:17 IST
2021-07-25T06:04:17.240Z25-07-2021 2021-07-25T06:04:12.025Z - - 21-09-2021

నేషనల్ టేబుల్ టెన్నిస్ కోచ్ ని తిరస్కరించిన మణికా బాత్రా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ బోణీ చేసింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె స్ఫూర్తితో భారత ఆటగాళ్ళు మరింత ఉత్సాహంగా ఆడతారని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే భారత పతకాలలో బోణీ కొట్టిందన్న సంతోషం లో ఉంటె మరో వైపు భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మణికా బాత్రా, జాతీయ కోచ్ సౌమదీప్ రాయ్ ల మధ్య వివాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశం అవుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో తన తొలి రౌండ్ మ్యాచ్‌లో జాతీయ టేబుల్ టెన్నిస్ కోచ్ సౌమదీప్ రాయ్ సలహా తీసుకోవడానికి మణికా బాత్రా విముఖత చూపించింది. దీంతో కోచ్ లేకుండానే ప్రపంచ 94 వ ర్యాంకర్ అయిన బ్రిటన్ కి చెందిన టిన్-టిన్ హోతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 62 వ ర్యాంకర్ అయిన మణిక 4-0తో గెలిచి సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఆడుతున్నప్పుడు కోచ్ స్థానంలో ఎవరూ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే మణికా బాత్రా తన వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరంజాపే ఆమెతో పాటు టోక్యోకు వెళ్ళడం, జాతీయ టేబుల్ టెన్నిస్ కోచ్ సౌమదీప్ రాయ్ సలహాలు స్వీకరించకపోవడం వివాదాస్పదమయ్యింది. 

అయితే మణిక వ్యక్తిగత కోచ్ సన్మయ్ పరంజాపేకి గేమ్స్ విలేజ్ లో ఉండడానికి అనుమతి లభించకపోవడంతో ఆటను ఒక హోటల్ లో ఉంటూ శిక్షణా సెషన్ల కి వెళ్లి ఆమెకి శిక్షణ ఇస్తున్నాడు. అయితే తన కోచ్ ని టెన్నిస్ కోర్టులోకి అనుమతించాలని మణిక  ఫీల్డ్-ఆఫ్-ప్లే కోసం టీటీఎఫ్‌ఐ సలహాదారు మరియు టోక్యోలో ఉన్న జట్టు నాయకుడు ఎంపి సింగ్ ని అభ్యర్థించగా ఆయన తిరస్కరించాడు. డి సన్మయ్ పరంజాపే అక్రెడిటేషన్‌ను అప్‌గ్రేడ్ చేస్తేనే గాని ఆయనకి టెన్నిస్ కోర్టులో అనుమతి లభిస్తుందని ఆయన వ్యాక్యానించారు. 

ఈ సందర్భంగా ఎంపి సింగ్ మాట్లాడుతూ మణిక వ్యక్తిగత కోచ్ ఆన్-కోర్ట్ యాక్సెస్ కోసం ఆమె చేసిన అభ్యర్థనని తిరస్కరించబదిందని, ఆమె మా జాతీయ కోచ్ చేత శిక్షణ ఇవ్వడానికి నిరాకరించడంతో తాను ఈ విషయంలో జోక్యం చేసుకోవలసి వచ్చిందని అన్నారు. అయితే మణిక, సౌమదీప్ రాయ్ ల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి కారణం అదే!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవడానికి కారణం అదే!

   2 hours ago


CSK vs MI: రుతురాజ్ గైక్వాడ్ వీరవిహారం.. 19 ఓవర్లలో ఏకంగా 24 పరుగులు

CSK vs MI: రుతురాజ్ గైక్వాడ్ వీరవిహారం.. 19 ఓవర్లలో ఏకంగా 24 పరుగులు

   19-09-2021


న్యూజిలాండ్ పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది: షోయబ్ అక్తర్

న్యూజిలాండ్ పాకిస్తాన్ క్రికెట్‌ను చంపేసింది: షోయబ్ అక్తర్

   17-09-2021


ఫ్యూచర్ భారత జట్టు కెప్టెన్‌గా ఆ ఆటగాడే సరైన నిర్ణయం: సునీల్ గవాస్కర్

ఫ్యూచర్ భారత జట్టు కెప్టెన్‌గా ఆ ఆటగాడే సరైన నిర్ణయం: సునీల్ గవాస్కర్

   17-09-2021


ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత భారత కెప్టెన్‌గా తప్పుకుంటాను: విరాట్ కోహ్లీ

ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత భారత కెప్టెన్‌గా తప్పుకుంటాను: విరాట్ కోహ్లీ

   16-09-2021


అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడు.. బీసీసీఐ

అన్ని ఫార్మాట్లలో కోహ్లీనే కెప్టెన్ గా కొనసాగుతాడు.. బీసీసీఐ

   14-09-2021


IPL 2021: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ లో ల్యాండ్

IPL 2021: ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ దుబాయ్ లో ల్యాండ్

   12-09-2021


ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దు తో 304 కోట్ల భారీ నష్టం..

ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దు తో 304 కోట్ల భారీ నష్టం..

   10-09-2021


Breaking: ఇండియా టీమ్ లో కేసులు పెరగడంతో 5 వ టెస్ట్ రద్దు

Breaking: ఇండియా టీమ్ లో కేసులు పెరగడంతో 5 వ టెస్ట్ రద్దు

   10-09-2021


ఎంఎస్ ధోని ని మెంటర్ గా నియమించడంపై వివాదం..

ఎంఎస్ ధోని ని మెంటర్ గా నియమించడంపై వివాదం..

   09-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle