newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ అతడొక్కడే

27-12-202027-12-2020 16:34:33 IST
2020-12-27T11:04:33.790Z27-12-2020 2020-12-27T11:04:26.442Z - - 20-01-2021

ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ అతడొక్కడే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ కు ఐసీసీ టోర్నీ టైటిల్స్ అందించాడు. భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచిపోలేని ఆటగాళ్ల లిస్టులో ధోని కూడా ఒకడు. ఎంతో క్రేజ్.. భీభత్సమైన ఫాలోయింగ్.. కానీ వాటన్నిటినీ త్యజించినట్లుగా ఉంటాడు. భారత క్రికెట్ కు దక్కిన ఓ ఆణిముత్యం అతను. వివిధ దేశాల్లో కూడా అద్భుతమైన ఫాలోయింగ్.. ఎంతో మంది యంగ్ క్రికెటర్స్ కు ఆదర్శం. అలాంటి ధోని ఇటీవలే క్రికెట్ కు వీడ్కోలు కలిపాడు. ఒక ఫేర్ వెల్ మ్యాచ్ ధోని ఆడి ఉండాల్సింది అంటూ అభిమానులు ఎంతగానో బాధను వ్యక్తం చేశారు. తాజాగా ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్ జట్లను ప్రకటించింది. ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20, వన్డే జట్లకు సారథిగా మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేసింది. ఐసీసీ టీ20 జట్టులో భారత్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకున్నారు. విండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా స్థానం దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్), లసిత్ మలింగ (శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్) జట్టులోని ఇతర సభ్యులు.

ఇక ఈ దశాబ్దపు టెస్టు జట్టుకు సారథిగా విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. టెస్ట్ జట్టులో భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ కు కూడా స్థానం దక్కింది. ఇవే కాకుండా మహిళల విభాగాల్లోనూ ఐసీసీ ఈ దశాబ్దపు అత్యుత్తమ వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. మిథాలీరాజ్ (టెస్టు), ఝులాన్ గోస్వామి (టెస్టు), హర్మన్ ప్రీత్ (టీ20), పూనమ్ యాదవ్ (టీ20) లకు స్థానం లభించింది.

మరో వైపు 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తనతో పాటు రిటైర్ ప్రకటించినా రైనా, వీరిద్దరి కన్నా ముందే రిటైర్ ప్రకటించిన యువరాజ్ సింగ్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడబోతున్నాడు.  మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపడం లేదు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle