newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు

10-04-202110-04-2021 15:21:57 IST
2021-04-10T09:51:57.975Z10-04-2021 2021-04-10T09:51:55.016Z - - 15-05-2021

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్ 2021 లీగ్ తొలి మ్యాచ్‌లో 27 బంతులకు 48 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుపాన్ ఏబీ డివీలియర్స్‌పై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత సంవత్సరం చివరలో దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్ 2020 తర్వాత ప్రొఫెషనల్ సర్క్యూట్ లోకి తొలిసారిగా ప్రవేశించిన డివీలియర్స్‌ని లెజెండరీ క్రికెటర్లు బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్‌లు ప్రశంసలతో ముంచెత్తారు. 

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియన్ లారా తన జట్టుకు అవసరమైన క్షణంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆర్సీబీ ఇన్నిగ్స్ మొత్తంలో రక్షణ కవచంగా డివీలియర్స్ నిలబడ్డాడని లారా కితాబిచ్చాడు. 

డీవిలియర్స్ కాలాతీత వ్యక్తి. దండిగా అనుభవమున్నవాడు. ఐపీఎల్‌లో మాత్రమే క్రికెట్ ఆడుతున్నప్పటికీ డీవిలియర్స్ పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధమయ్యాడని భావిస్తున్నాను. ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ పడ్డాక జట్టుకు అత్యంత అవసరమైన క్షణంలో డీవీలియర్స్ మైదానంలోకి వచ్చాడు. సకాలంలో విస్పోటనం కలిగించాడు. ఆటను పూర్తిగా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. బ్యాటింగ్ వరసలో గ్లెన్ మ్యాక్స్ వెల్ తర్వాత వచ్చినప్పటికీ గేమ్‌పై నియంత్రణ సాధించి ముంబై ఇండియన్స్‌కి చుక్కలు చూపించాడు అంటూ లారా ప్రశంసించాడు.

కాగా అత్యంత క్లిష్టసమయంలో స్ట్రైక్ రోటెట్ చేయడమే ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో డివీలియర్స్ ఘనత అని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ పేర్కొన్నాడు. నిజంగానే కలకాలం గుర్తుంచుకోదగ్గ ప్రాభవం డివీలియర్స్ చూపించాడు. ప్రశ్నించడానికే లేదు. ఎప్పుడు దూకుడు ప్రదర్శించాలో, ఎప్పుడు కాచుకోవాలో స్పష్టంగా తెలిసిన పరిణితితో ఆడాడు. ముఖ్యమైన విషయం ఏమిటంటే స్ట్రైక్ రొటేషన్ కొనసాగించడమే. బంతిని ఇంత క్రమబద్ధంగా బాదడం అతడికే తెలిసిన విద్య అంటూ హెడెన్ వ్యాఖ్యానించాడు.

గొప్ప ఆటగాళ్ల ప్రతిభ ఎక్కడ ఉంటుందంటే ఇతర గొప్ప ప్లేయర్లపై తలపడినప్పుడే. జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ డెత్ బౌలర్లలో ఒకరు. ఈ టోర్నమెంటు తొలి మ్యాచ్‌లో పకడ్బందీగా బంతులేశాడు. కాని ఇంతటి గొప్ప బౌలర్‌ని కూడా డివీలియర్స్ బాదిపడేశాడు. ఫ్రంట్ ఫుట్ పై నేరుగా బంతిని ఆడుకున్న డివీలియర్స్ 19వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో 12 పరుగులు సాధించాడు. సరిగ్గా ముంబై ఇండియన్స్ ఇక్కడే వెనుకబడిపోయారు. అదే వారి ఓటమికి దారితీసింది అని హేడెన్ పేర్కొన్నాడు.

స్లో పిచ్‌లపై కూడా అత్యంత వైవిధ్యపూరితంగా, దూకుడుగా ఆడగలిగిన ఏకైక ఆటగాడు డివీలియర్స్ మాత్రమే నని శుక్రవారం మరోసారి రుజువైందని ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ తన సహచరుడిని ప్రశంసించడం తెలిసిందే.

ముంబై ఇండియన్స్ తన తదుపరి ఆటను కొల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆడనుండగా, ఆర్సీబీ.. సన్ రైజర్స్ జట్టుతో తలపడనుంది.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle