newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్

28-02-202128-02-2021 22:43:37 IST
2021-02-28T17:13:37.227Z28-02-2021 2021-02-28T12:36:22.772Z - - 11-04-2021

ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా కారణంగా గత ఐపీఎల్ సీజన్ ను యూఏఈలో నిర్వహించింది బీసీసీఐ. ఈ ఏడాది మాత్రం భారత్ లోనే నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన వేదికలను కూడా ప్రకటించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని యూఏఈ తరహాలోనే పరిమిత వేదికల్లో మ్యాచ్ లు జరపాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఎంపిక చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్ కు స్థానం దక్కలేదు.  బెంగళూరు, కోల్ కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై నగరాలను మాత్రమే ఎంపిక చేశారు. కరోనాతో ఇప్పటికీ సతమతమవుతున్న ముంబయిని కూడా వేదికగా ఎంపిక చేయాలని భావించినా, అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ మహారాష్ట్ర సర్కారు అనుమతి నిరాకరిస్తే, ప్రత్యామ్నాయ వేదికగా హైదరాబాదును ఎంచుకునే అవకాశముంది. ఇటీవలే ఓపెనింగ్ జరుపుకున్న మొతేరాలోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలోనూ ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 

ఐపీఎల్ 14వ సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన వేదికల్లో హైదరాబాదు నగరం లేకపోవడం పట్ల మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం మ్యాచ్ లు నిర్వహించే వేదికల జాబితాలో హైదరాబాదును కూడా చేర్చాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీసీసీఐ, ఐపీఎల్ పాలకమండలిని బహిరంగంగా కోరుతున్నానని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యల కారణంగా హైదరాబాదులో అత్యంత తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చి చూస్తే ఈ విషయం తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహిస్తే తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించేది డౌట్ లాగే కనిపిస్తోంది. కాబట్టి హైదరాబాద్ వైపే బీసీసీఐ ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక కేటీఆర్ రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ కూడా ఉప్పల్ వేదికగా మ్యాచ్ లను నిర్వహించవచ్చు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle