newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

పంజాబ్ నిలవాలంటే నెగ్గాల్సిందే..!

20-10-202020-10-2020 17:17:25 IST
Updated On 20-10-2020 17:49:54 ISTUpdated On 20-10-20202020-10-20T11:47:25.601Z20-10-2020 2020-10-20T11:47:22.022Z - 2020-10-20T12:19:54.110Z - 20-10-2020

పంజాబ్ నిలవాలంటే నెగ్గాల్సిందే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు చేసే చిన్న చిన్న తప్పిదాల వలన పాయింట్ల పట్టికలో కిందకు వెళ్ళిపోయింది. బెంగళూరు మీద ఆఖరి బంతికి సిక్స్ కొట్టి రెండు పాయింట్లను తన అకౌంట్ లో వేసుకున్న పంజాబ్.. ముంబై ఇండియన్స్ జట్టు మీద రెండు సూపర్ ఓవర్లలో పోరాడి విజయం అందుకుని ఇంకో రెండు పాయింట్లు సాధించింది. ఇక పంజాబ్ టోర్నమెంట్ లో నిలవాలంటే ప్రతి ఒక్కటి గెలవాల్సిన పరిస్థితి. ఈరోజు పంజాబ్ ముందు 'ఢిల్లీ క్యాపిటల్స్' రూపంలో సవాలు ఎదురైంది. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలోని  ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.  సీజన్‌ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌ ఢిల్లీ  చేతిలో సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. ఈసారి లెక్క సరి చేయాలని పంజాబ్ భావిస్తోంది. కెప్టెన్‌ రాహుల్‌, ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌,‌ క్రిస్‌గేల్‌ రాణిస్తున్నారు. ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌ నుండి మంచి ఇన్నింగ్స్ ను ఎదురుచూస్తూ ఉన్నారు పంజాబ్ అభిమానులు. 

ఇక ఢిల్లీ అద్భుతమైన ఫామ్ లో ఉంది. ఓ వైపు జట్టును గాయాలు ఇబ్బంది పెడుతూ ఉన్నా.. నెగ్గాలనే కసితో రాణిస్తూ ఉన్నారు. ఓపెనర్ పృథ్వీ షాలో నిలకడ లోపించినా.. శిఖర్ ధావన్ రాణిస్తూ ఉండడం ప్లస్ పాయింట్ గా మారింది. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. నోకియా, రబడా బౌలింగ్ లో అదరగొడుతూ ఉన్నారు. 9 మ్యాచ్‌‌ల్లో ఏడు  విజయాలతో ఢిల్లీ టాప్ పొజిషన్ లో ఉంది. 

పంత్ ఆడేనా: 

తొడ కండరాల గాయం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ పూర్తిగా కోలుకున్నాడు.  మంగళవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో అతడు బరిలో దిగబోతున్నాడని తెలుస్తోంది. ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌లకు దూరమైన పంత్  ఫిజియో, ట్రైనర్‌ పర్యవేక్షణలో సాధన చేస్తున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిట్‌నెస్‌ పరీక్షలు పాసయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు ఫిట్‌గా ఉన్నాడని.. టాస్‌ వేయడానికి ముందు తుది జట్టు ఎంపిక సమయంలో అతడి ఎంట్రీపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. పంత్ ఈ మ్యాచ్ లో ఆడడం దాదాపు ఖాయమేనని ఢిల్లీ కేపిటల్స్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. 

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

రోహిత్ శ‌ర్మ తండ్రికి క‌రోనా.. అందుకే ఆస్ట్రేలియా వెళ్ల‌ని హిట్‌మ్యాన్‌..!

   6 hours ago


ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

ఐసీసీకి కొత్త ఛైర్మ‌న్ వచ్చేశాడు‌

   7 hours ago


బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

బుట్టబొమ్మ తన పాట అనే ఫీలైపోతున్న డేవిడ్ వార్నర్

   24-11-2020


కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

కోహ్లీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన అవసరమే లేదు..!

   24-11-2020


టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..?  అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం..? అయ్య‌ర్‌కు ఛాన్స్‌..!

   24-11-2020


ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

ఆడకున్నా కెప్టెన్ గా చేస్తూ ఉన్నారుగా..!

   24-11-2020


ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

ఐపీఎల్ 2020.. బీసీసీఐ ఆదాయం ఎంతో తెలుసా..?

   23-11-2020


మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

మ‌రో మూడు రోజుల్లో రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా వెళ్ల‌క‌పోతే..

   23-11-2020


నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

నా బాధను అర్థం చేసుకుంది రోహిత్ శర్మ మాత్రమే: సూర్య కుమార్ యాదవ్

   23-11-2020


ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

ఫ్యాన్స్ రాబోతున్నారు.. గ్రౌండ్ లో అభిమానుల సందడి మధ్యనే క్రికెట్ సమరం

   21-11-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle