newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐపీఎల్ అతిపెద్ద షో.. దాంట్లో ఆడే అనుభవం కోల్పోవద్దు.. పీటర్సన్

03-04-202103-04-2021 18:01:13 IST
2021-04-03T12:31:13.689Z03-04-2021 2021-04-03T12:31:07.478Z - - 20-04-2021

ఐపీఎల్ అతిపెద్ద షో.. దాంట్లో ఆడే అనుభవం కోల్పోవద్దు.. పీటర్సన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రపంచంలోనే అత్యధికులు చూసే ప్రదర్శనగా అవతరించింది. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు కళ్లు చెదిరే మొత్తంలో డబ్బు ముడుతుండంతో ప్రపంచ క్రికెట్ లోని సూపర్ స్టార్లు కూడా మరో రెండు నెలలపాటు సాగే ఈ లీగ్‌లో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతుంటారు. చివరకు ప్రపంచంలోని క్రికెట్ బోర్డులు కూడా ఐపీఎల్ ప్రాధాన్యతను గుర్తించాయి కాబట్టే తమతమ ఆటగాళ్లలో కొందరిని ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించి మరీ పంపుతున్నాయి.

అత్యంత తీవ్రమైన ఒత్తిడి పరిస్థితుల మధ్య దిగ్గజ ప్లేయర్ల సరసన ఆడే ఐపీఎల్ అనుభవం ఎంతో విలువైనదని గ్రహించబట్టే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టు సభ్యులు రెగ్యులర్‌గా ప్రతి ఐపీఎల్ టోర్నీలోనూ ఆడేందుకు అనుమతించి పంపుతున్న విషయం తెలిసిందే.

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా ఇదే అభిప్రాయం ప్రకటించాడు. భారత్‌లో జరిగే ఏపీఎల్ టోర్నీ ప్రపంచంలోనే అతిపెద్ద షోలలో ఒకటి. అందుకే ఐపీఎల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు మరే అంతర్జాతీయ గేమ్‌లనూ ఏ జట్టు కూడా షెడ్యూల్ చేసుకోకుండా జాగ్రత్త పడాలి అని కెవిన్ సలహా ఇచ్చాడు.

భారత్‌లో జరిగే ఐపీఎల్ టీ29 లీగ్ పోటీలు అతిపెద్ద ప్రదర్శన అని క్రికెట్ బోర్డులు గుర్తించాల్సిన సమయం వచ్చింది. అందుకే ఐపీఎల్ జరుగుతున్నప్పుడు మరే ఇతర అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు సమయం కేటాయించవద్దని కెవిన్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ టోర్నీ ముగిసిన వెంటనే అంటే జూన్ 2న న్యూజిలాండ్‌తో స్వదేశంలో రెండు టెస్టు మ్యాచ్‌లో సీరీస్ మొదలు కానుండడంతో కొంతమంది ఇంగ్లండ్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడాలా వద్దా అని డైలమ్మాలో పడిపోయారని సమాచారం. టీ20 లీగ్ ముగిసిన వెంటనే తమ తమ క్రికెట్ షెడ్యూల్‌ను ఆయా దేశాలు ప్రకటించినట్లయితే ఆ దేశాల తరపున ఐపీఎల్‌లో పాల్గొంటున్నవారు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. లేదా తమ తమ జాతీయ జట్ల తరపున ఆడే అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది.

ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆష్లే గిల్స్ ఇప్పటికే ఈ అంశంపై ఐపీఎల్ వైపే మొగ్గు చూపాడు. ఐపీఎల్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ ఆటగాళ్లను జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి తిరిగి రావాలంటూ ఒత్తిడి పెట్టవద్దని ఆష్లే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు సూచించారు.

ఈ సంవత్సరం కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు 14 మంది ఇంగ్లండ్ క్రికెటర్లు కాంట్రాక్టు పొందారు. వారిలో వైట్ బాల్ స్కిప్పర్ ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్, స్టోక్స్, జానీ బెయిర్ స్టో, మోయిన్ ఆలీ, సామ్ కరన్, టామ్ కరన్, సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్ స్టన్, డేవిడ్ మలన్ తదితర ఇంగ్లండ్ ప్లేయర్లు 2021 ఐపీఎల్‌ టీ20 టోర్నీలో పాల్గొంటున్నారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle