newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

04-03-202104-03-2021 09:59:22 IST
Updated On 04-03-2021 10:06:29 ISTUpdated On 04-03-20212021-03-04T04:29:22.455Z04-03-2021 2021-03-04T04:29:17.731Z - 2021-03-04T04:36:29.608Z - 04-03-2021

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలార్డ్.. ఎంత విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లోనూ.. వెస్టిండీస్ కు పలు మ్యాచ్ లలోనూ తన బిగ్ హిట్టింగ్ తో విజయాన్ని అందించాడు. తాజాగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు పోలార్డ్. విండీస్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో పోలార్డ్ విధ్వంసం సృష్టించాడు. లంక బౌలర్ అఖిల ధనంజయకు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఇదే మ్యాచ్ లో అఖిల ధనంజయ అప్పటికి హ్యాట్రిక్ తీసి ఉండగా.. పోలార్డ్ అతడి బౌలింగ్ లో వరుసగా ఆరు సిక్సర్లు బాది ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవకుండా చేశాడు. అంతకు ముందు యువరాజ్ సింగ్, గిబ్స్ ఈ రికార్డును అందుకున్నారు. 

మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను అకీల ధనంజయ తన హ్యాట్రిక్ తో భయపెట్టాడు. పొలార్డ్ మెరుపులతో 13.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. మొత్తం 11 బంతులు ఆడిన పొలార్డ్ 38 పరుగులు చేశాడు. అందులో 36 పరుగులు సిక్సర్ల ద్వారా వచ్చాయి. ధనంజయ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో విండీస్ కెప్టెన్ ఆరు సిక్సర్లు బాదాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

మినీ ఐపీఎల్ వేలంపాట.. ఫ్రాంఛైజీలు తీసుకుంది వీరినే

ఇక అంతర్జాతీయ టీ20లో భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ తర్వాత ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదింది పోలార్డ్ మాత్రమే. ధనంజయ బౌలింగ్‌ను చితకబాదిన పొలార్డ్ ఆ తర్వాతి ఓవర్‌లోనే అవుటయ్యాడు. 4వ ఓవర్ వేసిన స్పిన్నర్ ధనంజయ హ్యాట్రిక్ తీశాడు. లెవిస్, క్రిస్ ‌గేల్ (0), నికోలస్ పూరన్ (0)లను ఔట్ చేశాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ ధనంజయ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదేశాడు. వెస్టిండీస్ కేవలం 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదిందించి. పొలార్డ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.

దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హర్ష్‌లీ గిబ్స్ 2007లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు. అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle