newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

ఐపీఎల్ లో కడప జిల్లా కుర్రాడికి అవకాశం.. తుది జట్టులో అవకాశం దక్కేనా

19-02-202119-02-2021 09:13:37 IST
Updated On 19-02-2021 09:46:42 ISTUpdated On 19-02-20212021-02-19T03:43:37.169Z19-02-2021 2021-02-19T03:42:29.876Z - 2021-02-19T04:16:42.035Z - 19-02-2021

ఐపీఎల్ లో కడప జిల్లా కుర్రాడికి అవకాశం.. తుది జట్టులో అవకాశం దక్కేనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మినీ ఐపీఎల్ వేలంపాట ముగిసింది. పలువురు ఆటగాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. తక్కువ ధరకే పలుకుతాడు అని భావించిన ఆటగాళ్లు కాస్తా కోట్లలో ఆర్జించబోతున్నారు. ఇక పలువురు అనామక క్రికెటర్లపై కూడా ఫ్రాంఛైజీలు దృష్టి పెట్టాయి. దేశవాళీ క్రికెటర్లకు కూడా ఐపీఎల్ లో అదృష్టం కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన ఓ ఆటగాడిని ఐపీఎల్ జట్లు కనిపెట్టుకుని ఉన్నాయి. అనుకున్నట్లుగానే అతడిని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ జట్టు దక్కించుకుంది. దీంతో కడప జిల్లా రాయచోటిలో ఆ కుర్రాడి గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు. 

చెన్నైలో నిర్వహించిన వేలంలో హరిశంకరరెడ్డిని రూ.20 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దక్కించుకోవడం విశేషం. హరిశంకరరెడ్డి చిన్నమండెం మండలం బోనమల సమీపంలోని నాగూరివాండ్లపల్లె.  ఆంధ్రా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.. బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. 2018 నుంచి ఆంధ్రా టీమ్‌కు ఆడుతున్నాడు. 2018 జనవరి 11న ఆంధ్రా-కేరళ జట్ల మధ్య విశాఖపట్నంలో జరిగిన టీ20 మ్యాచ్‌తో క్రికెట్‌లో అడుగు పెట్టాడు హరి శంకర్ రెడ్డి. ఆడిన తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన హరి 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను తీశాడు.

హరిశంకర్ రెడ్డి ఇప్పటి వరకు 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ముంబైలో పుదుచ్చేరి టీమ్ మీద 35 పరుగులకు మూడు వికెట్లను తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాణిస్తుండటంతో ఐపీఎల్‌ మినీ ఆక్షన్‌లో ఎంట్రీ దక్కింది. ఎవరు బిడ్ వేస్తారా అని అందరూ ఆసక్తికరంగా గమనిస్తూ ఉండగా.. ఐపీఎల్ లో మంచి రికార్డు ఉన్న, రెండో సక్సెస్ ఫుల్ జట్టు అయిన చెన్నై సూపర్ కింగ్స్ హరి శంకర్ రెడ్డిని సొంతం చేసుకుంది. రిశంకర్‌రెడ్డికి సీఎస్‌కే అవకాశం కల్పించింది. హరిశంకరరెడ్డి ఐపీఎల్‌కు ఎంపిక కావడంపై తల్లిదండ్రులు రామచంద్రారెడ్డి, లక్ష్మిదేవి, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. అతడికి స్థానం దక్కడంపై పలువురు సామాజిక మాధ్యమాల్లో మా కుర్రాడే అంటూ చెప్పుకోవడం మొదలుపెట్టారు.  

గతంలో కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు ఐపీఎల్‌లో అవకాశం దక్కింది. ఆయన దక్కన్ ఛార్జర్స్‌కు ఆడారు. 2007లో బెంగాల్ టీమ్‌తో జరిగిన రంజీమ్యాచ్‌లో 10 వికెట్లను పడగొట్టిన అరుదైన రికార్డ్ విజయ్ కుమార్‌కు ఉంది. అప్పట్లో దక్కన్ ఛార్జర్స్ అతడికి అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఐపీఎల్ ఆడుతున్న మరో కడప వాసిగా హరి శంకర్ రెడ్డి నిలిచాడు. హరిశంకర్ రెడ్డికి తుది జట్టులో స్థానం లభిస్తుందా.. లేక బెంచ్ కే పరిమితం చేస్తారా అన్నది టోర్నీలో తెలియనుంది. 

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

   4 hours ago


హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్

   10 hours ago


మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

   a day ago


నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య

   03-03-2021


అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

   02-03-2021


స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ

స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ

   01-03-2021


ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్

ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్

   28-02-2021


టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!

టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!

   28-02-2021


ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య

ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య

   28-02-2021


నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం

   27-02-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle