newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

రిస్క్ వద్దనుకునే పూజారా జిడ్డు ఆట ఆడాడా?

10-01-202110-01-2021 15:05:07 IST
2021-01-10T09:35:07.822Z10-01-2021 2021-01-10T08:26:05.838Z - - 20-01-2021

రిస్క్ వద్దనుకునే పూజారా జిడ్డు ఆట ఆడాడా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ బ్యాట్స్‌మన్ అయినా దూకుడు మాని వికెట్ నిలుపుకోవడానికే ప్రాధాన్యమిస్తాడు. భారత్,. ఆస్ట్రేలియా మధ్య శనివారం జరిగిన మూడో రోజు ఆటలో చతేశ్వర్ పుజారా అలాంటి ఆటతీరే ప్రదర్సించి అడ్డుగోడలా నిలిచాడు కానీ కనీస పరుగులు కూడా చేయలేక వెనుకబడటంతో టీమ్ పై అది ప్రభావం చూపిందని పలువురు మాజీలు, అభిమానులు విమర్శించారు. చివరకు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా పుజారా బ్యాటింగ్ శైలిని తప్పుపట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆధిక్యతను తగ్గించాల్సివ తరుణంలో పుజారా జిడ్డు ఆట కారణంగా ఇతర బ్యాట్స్‌మన్‌ ఒత్తిడికి గురవుతారని పాంటింగ్ పేర్కొన్నాడు.

ఉదాహరణకు ఈ లెక్కలు దూద్దాం.. దాదాపు 400 బంతులు ఎదుర్కొన్న పుజారా చేసింది మాత్రం అర్ధసెంచరీ మాత్రమే. 100 బంతుల్లో 16 పరుగులు... 133 బంతుల్లో 40... 174 బంతుల్లో అర్ధ సెంచరీ... తొలి వంద బంతుల్లో ఒక్క ఫోర్‌ కూడా లేదు... శనివారం చతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ సాగిన తీరు ఇది. కానీ ఇలా ఆడటం ఇదేమీ మొదటిసారి కాదు! నిజానికి ఇదే అతని బలం కూడా. పరుగులు చేయడంలో అతని శైలే ఇది. పుజారా విషయంలో ఇలాంటిది బ్రహ్మాండంగా పని చేస్తుంది కూడా.

సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో పాతుకుపోయి... ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయి, గతి తప్పి పేలవ బంతులు వేసే వరకు వేచి చూడటం... ఆపై పరుగులు రాబట్టడం అతనికి తెలిసిన విద్య. 2018లో జొహన్నెస్‌బర్గ్‌ టెస్టులో 50వ బంతికి తొలి పరుగు తీసిన రోజు కూడా పుజారా శైలిపై విమర్శలు రాలేదు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి సిరీస్‌ గెలిచినప్పుడు పుజారా ఇదే మంత్రం పఠించాడు. సిరీస్‌ మొత్తంలో అసాధారణంగా సుమారు 30 గంటల పాటు అతను బ్యాటింగ్‌ చేసిన విషయం మరచిపోవద్దు.

అదేసమయంలో అతనిలో ‘దూకుడు’ లోపించిందని చెప్పడంలో అర్థం లేదు. సాధారణంగా అయితే నిలదొక్కుకోవడానికి కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత షాట్లు ఆడుతూ లెక్క సరి చేయడం అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ చేస్తుంటారు. అడిలైడ్‌ టెస్టులో కోహ్లి తన తొలి 80 బంతుల్లో 29 పరుగులే చేసి ఆపై కొంత జోరు పెంచాడు. అయితే పుజారాకు అలాంటి షాట్ల ‘రిస్క్‌’ విలువేమిటో బాగా తెలుసు. శనివారం భారత జట్టు ఉన్న స్థితిలో అలాంటి రిస్క్‌లు కూడా అనవసరమని అతను భావించినట్లున్నాడు.

అన్నింటికి మించి ఫామ్‌లో ఉన్న ముగ్గురు అత్యుత్తమ పేసర్లను అతను ఎదుర్కొంటున్నాడు. పిచ్‌ భిన్నంగా స్పందిస్తోంది. ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే అన్ని ఎక్కువ పరుగులు చేసే అవకాశం తనకు పెరుగుతుందని అతను అనుకున్నాడు. అన్నింటికి మించి తన సహచరుల బ్యాటింగ్‌ బలంపై కూడా అతనికి అంచనా ఉంది. టెస్టు క్రికెట్‌లో సుమారు 31 వేల బంతులు ఆడిన పుజారాకు తనకు ఏది బాగా పని చేస్తుందో తెలీదా!

చివరకు అతను భయపడినట్లే జరిగింది. కమిన్స్‌ వేసిన ఒక అద్భుత బంతికి పుజారా వెనుదిరిగాక జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అతను కూడా పట్టుదలగా నిలబడకుండా వేగంగా ఆడితే చాలనే భావనలో వెళితే అసలు ఈ మాత్రం స్కోరైనా వచ్చేదా! జట్టు పేలవ ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఎదుర్కోగలిగిన బ్యాట్స్‌మెన్‌ అని చూడకుండా రహానేపై ఒత్తిడి పెరిగి అవుట్‌ కావడానికి కారణమయ్యాడని, అతని ఆట శైలి కారణంగానే విహారి కూడా రనౌట్‌ అయ్యాడని విమర్శించడంలో ఏమాత్రం అర్థం లేదు.

అందుకే ఔటయ్యాక పూజారా తనకు తెలిసిన శైలి ఇదే అని చెప్పుకున్నాడు. నేను బాగా ఆడుతున్న సమయంలో ఒక మంచి బంతికి అవుటయ్యాను. నాకు తెలిసిన శైలిలోనే నేను బ్యాటింగ్‌ చేస్తాను. అంతకంటే మెరుగ్గా నేను ఏమీ చేయలేను. కమిన్స్‌ వేసిన ఆ బంతి ఈ సిరీస్‌లోనే అత్యుత్తమమైంది. నేను ఆడక తప్పని పరిస్థితి. మనది కాని రోజు చిన్న తప్పులు కూడా పెద్దవిగా కనిపిస్తాయి అని సమర్థించుకున్నాడు పుజారా..

ఏదీ ఏమైనా రాహుల్ ద్రావిడ్ తర్వాత అంత బలంగా గోడలాగా ప్రత్యర్థి జట్టు బౌలింగును అడ్డుకునే పుజారా మూడో రోజు ఆట కండిషన్స్ కారణంగా విమర్సలు పాలు కావలసి వచ్చింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle