newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వాంఖడే స్టేడియం సిబ్బందికీ పాజిటివ్.. ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లు డౌటేనా..

04-04-202104-04-2021 12:10:55 IST
2021-04-04T06:40:55.682Z04-04-2021 2021-04-04T05:36:00.726Z - - 20-04-2021

వాంఖడే స్టేడియం సిబ్బందికీ పాజిటివ్.. ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లు డౌటేనా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముంబైలోని వాంఖడే స్టేడియం సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలడంతో ఐపీఎల్ 2021 సీజన్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ సీజన్‌లో వాంఖడే స్టేడియం మొత్తం 10 గేమ్‌లకు ఆతిధ్యం ఇస్తుందని బీసీసీఐ ప్రకటించగా టోర్నీ మొదలు కావడానికి వారం రోజులముందే అటు ఆటగాళ్లూ, ఇటు స్టేడియం సిబ్బంది కూడా కరోనా బారిన పడుతుండటంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నిర్వహణపై కలవరం మొదలైంది.

ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌తోపాటు ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్‌ మేనేజర్లు వైరస్‌ బారిన పడ్డారు. అయితే గత అనుభవాల దృష్ట్యా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి పెద్దగా కంగారు పడకుండా చేయాల్సిన పనుల్ని చక్కబెడుతూ, ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని నిర్ణయించింది.  

ఈ క్రమంలో ముంబైలో కరోనా తీవ్రత ఇంకా పెరిగే పక్షంలో ప్రత్యామ్నాయ వేదికలుగా ఇండోర్, హైదరాబాద్‌లను కూడా బీసీసీఐ పరిశీలిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్‌కు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని తేలింది. ముంబైలో అతడు బసచేసిన హోటల్‌లో మార్చి 28న పరీక్షించగా నెగటివ్ అని వచ్చింది. ఆ తర్వాత శనివారం మళ్లీ టెస్టులో పాజిటవ్ అని తేలడంతో అక్షర్‌ని ఏకాంతంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ హిట్టర్‌ నితీశ్‌ రాణా వైరస్‌ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది.

ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్‌ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్‌ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్‌ లేదంటే ఇండోర్‌లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్‌ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. ‘స్టాండ్‌బై స్టేడియాలలో హైదరాబాద్‌ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్‌ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలోనే మరో బబుల్‌ ఏర్పాటు అంత సులభం కాదు’ అని ఒక సీనియర్‌ బీసీసీఐ అధికారి వెల్లడించారు. 

ఇదిలా ఉండగా తాము ఐపీఎల్‌-2021 నిర్వహణకు సిద్ధంగా ఉన్నమంటూ తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ గతంలోనే ఓ ప్రకటన విడుదల చేశారు. మరి వారం రోజుల సమయం కూడా అందుబాటులో లేని తరుణంలో ముంబైలోని జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్‌కు మార్చడం కష్టతరమే కావచ్చు. కానీ అసాధ్యమేమీ కాదు. 

ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్‌ను వేదికగా నిర్ణయిస్తే బాగుంటుందని బీసీసీఐ పెద్దలు షెడ్యూల్‌ ఖరారు చేసిన సమయంలో ఆలోచన చేసినప్పటికీ దానికి ముందడుగు పడలేదు. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలతో పాటు ముంబైను చివరకు వేదికగా ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే అది అంత మంచి ఆలోచన కాదనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి అర్థమవుతోంది. 

కాగా, అప్పుడు హైదరాబాద్‌ను వద్దనుకున్న బీసీసీఐ పెద్దలకు ఇప్పుడు అదే వేదికలో మ్యాచ్‌ల నిర్వహణ తప్పేలా కనిపించడం లేదు. మరి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle