newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

ఐపీఎల్ 2021 కౌంట్ డౌన్ మొదలైంది.. ఫ్రాంచైజీలు రిలీజ్, రిటైన్ చేసుకుంది ఎవరినంటే

21-01-202121-01-2021 09:06:51 IST
Updated On 21-01-2021 10:23:49 ISTUpdated On 21-01-20212021-01-21T03:36:51.434Z21-01-2021 2021-01-21T03:36:35.528Z - 2021-01-21T04:53:49.021Z - 21-01-2021

ఐపీఎల్ 2021 కౌంట్ డౌన్ మొదలైంది.. ఫ్రాంచైజీలు రిలీజ్, రిటైన్ చేసుకుంది ఎవరినంటే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఐపీఎల్-2021 కు సంబంధించిన కౌంట్ డౌన్ మొదలైంది. ముఖ్యంగా అంటిపెట్టుకునే ఆటగాళ్లు.. వేలంపాట ద్వారానే సగం విజయావకాశాలు ముడిపడి ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇక 2021 సంవత్సరం ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీలు రిలీజ్, రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధికంగా 10 మంది ఆటగాళ్లకు ఉద్వాసన పలకగా... సన్‌రైజర్స్ హైదరాబాద్ 22 మంది ఆటగాళ్లను అంటిపెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ కూడా ఏడుగురు ప్లేయర్లకు ఉద్వాసన పలికింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. మ్యాక్స్‌వెల్‌తో సహా ఏడుగురిని విడుదల చేసింది. గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆరుగురిని వదులుకుంది. 

ముంబై ఇండియన్స్:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, క్రిస్ లిన్, సౌరభ్ తివారీ, ధావల్ కులకర్ణి, బుమ్రా, రాహుల్ చాహర్, బౌల్ట్, ఎం ఖాన్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్, పొలార్డ్, కృనాల్ పాండ్యా, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, డికాక్, ఆదిత్యా తారే.

వదులుకున్న ప్లేయర్లు: మలింగ, కౌల్టర్​నీల్, ప్యాటిన్సన్, రూథర్​పొర్డ్, దిగ్విజయ్, ప్రిన్స్, మెక్​క్లెనగన్

ఢిల్లీ క్యాపిటల్స్:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ధావన్, రిషభ్ పంత్, ఇషాన్ శర్మ, అజింక్యా రహానె, రవి అశ్విన్, పృథ్వీ షా, లలిత్ యాదవ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడ, స్టోయినిస్, క్రిస్ వోక్స్, హెట్​మెయర్, ప్రవీణ్ దూబే

వదులుకున్న ఆటగాళ్లు: మోహిత్ శర్మ, సందీప్ లమిచానే, అలెక్స్ కారే, జాసన్ రాయ్, కే పాల్, హర్షల్ పటేల్ (ట్రేడెడ్), దేశ్​పాండే (ట్రేడెడ్)

సన్‌రైజర్స్ హైదరాబాద్:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: డేవిడ్ వార్నర్(కెప్టెన్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్ స్టో, వృద్దిమాన్ సాహా, శ్రీవాత్స్ గోస్వామి, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, రషీద్ ఖాన్, నటరాజన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, అభిషేక్ శర్మ, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమాద్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, బసిల్ థంపి, షాబాజ్ నదీమ్, సిద్దార్థ్ కౌల్, భువనేశ్వర్ కుమార్

వదులుకున్న ఆటగాళ్లు: బిల్లీ స్టాన్​లేక్, ఫాబియాన్ అలెన్, ఎస్ యాదవ్, బావనక సందీప్, యర్ర పృథ్వీరాజ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, ఆడమ్ జంపా, షెబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే

వదులుకున్న ఆటగాళ్లు: మోయిన్ అలీ, శివమ్ దూబే, గుర్‌క్రీత్ సింగ్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, పవన్ నేగి, పార్థీవ్ పటేల్(రిటైర్డ్), డేల్ స్టేయిన్, ఇసురు ఉడానా, ఉమేశ్ యాదవ్

చెన్నై సూపర్ కింగ్స్:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోనీ(కెప్టెన్), సురేశ్ రైనా, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్, ఫాఫ్ డూప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, జోష్ హజెల్ వుడ్, శార్దూల్ ఠాకూర్, కరన్ శర్మ, ఆసిఫ్, ఇమ్రాన్ తాహిర్, సాయి కిషోర్, దీపక్ చాహర్, లుంగి ఎంగిడి

వదులుకున్న ప్లేయర్లు: కేదార్ జాదవ్, షేన్ వాట్సన్(రిటైర్డ్), పియూష్ చావ్లా, మురళీ విజయ్, మోను కుమార్, హర్భజన్ సింగ్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: కేఎల్ రాహుల్(కెప్టెన్)​, గేల్​, పూరన్​, షమీ, జోర్డాన్​, మయాంక్​, మన్‌దీప్ సింగ్, బిష్ణోయ్​, ప్రభు సిమ్రాన్ సింగ్, దీపక్ హుడా, సర్ఫ్​రాజ్ ఖాన్​, అర్ష్​దీప్ సింగ్​, మురుగున్ అశ్విన్​, ఇషాన్ పోరెల్​, హర్​ప్రీత్ బ్రార్​

వదులుకున్న ప్లేయర్లు: గ్లేన్ మ్యాక్స్ వెల్, షెల్డన్ కాట్రెల్, కృష్ణప్ప గౌతమ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జిమ్మీ నీషమ్, హర్దస్ విల్‌జోయిన్, కరుణ్ నాయర్

కోల్‌కతా నైట్‌రైడర్స్:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్)​, దినేశ్ కార్తీక్, ఆండ్రూ రసెల్, గున్రే, నాగర్​కోటి, కుల్దీప్ యాదవ్, ఫెర్గుసన్, నితీశ్ రానా, పీ కృష్ణ, వారియర్, శివం మావి, శుభ్​మన్ గిల్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ త్రిపాఠి

వదులుకున్న ప్లేయర్లు: టామ్ బాంటన్, క్రిస్ గ్రీన్, నాయక్, సిద్దేశ్ లాడ్, సిద్దార్థ్

రాజస్థాన్ రాయల్స్:

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: సంజూ శాంసన్ (కెప్టెన్), మనన్ వొహ్రా, డేవిడ్ మిల్లర్, జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, రాబిన్ ఊతప్ప, అనుజ్ రావత్, బెన్ స్టోక్స్, రాహుల్ తెవాటియా, మహిపాల్ లోమ్‌రోర్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనాద్కత్, కార్తీక్ త్యాగీ, శ్రేయస్ గోపాల్, మయాంక్ మార్కండే

వదులుకున్న ప్లేయర్లు: స్టీవ్ స్మిత్, అంకిత్ రాజ్‌పుత్, ఓషానే థామస్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, అనిరుద్ జోషి, ఆకాశ్ సింగ్, శశాంక్ సింగ్

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మార్పు.. గంగూలీ చెప్పేశారు

టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వేదిక మార్పు.. గంగూలీ చెప్పేశారు

   6 hours ago


ప్రపంచంలోనే మేటి బౌలర్‌ బంతిని పంత్ అలా బాదేశాడే.. వాపోయిన రూట్

ప్రపంచంలోనే మేటి బౌలర్‌ బంతిని పంత్ అలా బాదేశాడే.. వాపోయిన రూట్

   20 hours ago


టీమిండియా పై చస్తే బెట్ కట్టనంటున్న మైఖేల్ వాన్

టీమిండియా పై చస్తే బెట్ కట్టనంటున్న మైఖేల్ వాన్

   08-03-2021


ఈ ఏడాది ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్ లో మ్యాచ్ లు లేనట్టే..!

ఈ ఏడాది ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్ లో మ్యాచ్ లు లేనట్టే..!

   07-03-2021


రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ సీరీస్‌ని మలుపు తిప్పింది.. కోహ్లీ

రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ సీరీస్‌ని మలుపు తిప్పింది.. కోహ్లీ

   07-03-2021


ఏప్రిల్ 9 నుండే ఐపీఎల్ సందడి షురూ..!

ఏప్రిల్ 9 నుండే ఐపీఎల్ సందడి షురూ..!

   07-03-2021


టీమిండియా ప్రతిభ అద్భుతం.. ఇంగ్లండ్ ఎత్తుగడలు ఘోరం... మాజీ క్రికెటర్ల వ్యాఖ్య

టీమిండియా ప్రతిభ అద్భుతం.. ఇంగ్లండ్ ఎత్తుగడలు ఘోరం... మాజీ క్రికెటర్ల వ్యాఖ్య

   07-03-2021


ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్

   06-03-2021


మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం

   06-03-2021


5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్

   06-03-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle