newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు

11-04-202111-04-2021 07:44:42 IST
Updated On 10-04-2021 22:08:49 ISTUpdated On 10-04-20212021-04-11T02:14:42.030Z10-04-2021 2021-04-10T15:39:42.788Z - 2021-04-10T16:38:49.797Z - 10-04-2021

IPL 2021: అతడే మా తురుపుముక్క.. హర్షల్‌పై కోహ్లీ ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దుర్బేధ్యమైన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ శ్రేణిని తుత్తునియలు చేసి ఐపీఎల్ లీగ్ 2021 తొలి మ్యా‌చ్‌ చివరి ఓవర్లో చుక్కలు చూపించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆల్ రౌండర్ హర్షల్ పటేల్ రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. ఇక కోహ్లీ ఆనందానికైతే పట్ట పగ్గాల్లేవు. కొరకరాని కొయ్యగా భావిస్తున్న ముంబై ఇండియన్స్ పని పట్టడంలో హర్షల్ సాధించిన ఘనతను చూసి ఆర్సీబీ కెప్టెన్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.

ఒక కెప్టెన్‌గా తననుంచి ఏం ఆశించానో ఆ అంచనాలను హర్షల్ అందుకున్నాడని కోహ్లీ కితాబిచ్చాడు. ఢిల్లీ నుంచి హర్షల్‌ను మేం కొనుగోలు చేశాం. తనదైన ప్రణాళికలతో, జట్టు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడంలో సఫలం అయ్యాడు. ఈ మ్యాచ్‌లో తను ఎంతో ప్రత్యేకంగా నిలిచాడు. డెత్‌ ఓవర్లలో తన సేవలు కచ్చితంగా వినియోగించుకుంటాం అని కోహ్లీ స్పష్టం చేశాడు. డెత్‌ ఓవర్‌ బౌలర్‌గా తనను సీజన్‌ మొత్తం కొనసాగిస్తామని పేర్కొన్నాడు. 

శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఫాస్ట్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌, మార్కో జెన్‌సన్‌ వంటి ముంబై ఇండియన్స్‌ కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చి ఉత్కంఠ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

ఆర్సీబీ తరపున ఒకే మ్యాచ్‌లో అయిదుమందిని ఔట్ చేసిన తొలి బౌలర్‌గా కూడా హర్షల్ రికార్డు సృష్టించాడు. తద్వారా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన హర్షల్‌ ఆర్సీబీ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, ఆర్సీబీ 2 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి గెలుపుతో బోణీ కొట్టింది.

27 పరుగులిచ్చి 5 వికెట్లు సాదించిన హర్షల్ డెత్ ఓవర్లో ముంబై ఇండియన్స్‌ని వణికించాడంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. బ్యాటింగ్‌లో డివీలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్ మెరుపులు సృష్టించినా ముంబై ఇండియన్స్ విజయావకాశాలను ఆదిలోనే తుంచేసిన ఘనత హర్షల్‌కే దక్కుతుంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తమ జట్టు 20 పరుగులు వెనకబడిందని అంగీకరంచాడంటేనే హర్షల్ తన ప్రత్యర్థి జట్టును ఎంతగా హడలెత్తించాడో అర్థమవుతుంది.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle