newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

కదం తొక్కిన సన్ రైజర్స్ బౌలర్లు.. కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్

30-09-202030-09-2020 08:10:39 IST
Updated On 30-09-2020 08:10:34 ISTUpdated On 30-09-20202020-09-30T02:40:39.793Z30-09-2020 2020-09-30T02:39:31.252Z - 2020-09-30T02:40:34.400Z - 30-09-2020

కదం తొక్కిన సన్ రైజర్స్ బౌలర్లు.. కుప్పకూలిన ఢిల్లీ క్యాపిటల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్‌లో బ్యాట్స్‌మన్ల దూకుడుకు తిరుగు లేదంటున్న కామెంటేటర్ల వ్యాఖ్యలకు సన్ రైజర్స్ బౌలర్లు చెక్ పెట్టారు. 200కి పైగా స్కోరు సాధిస్తేనే గ్యారెంటీ లేని తాజా ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ చేసింది 162 పరుగులే.. అటు చూస్తే భీకర ఫామ్‌లో ఉండి ఓటమనేదే లేని ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఇంకేముంది రైజర్స్‌కు మరో ఓటమి ఖాయమే అనిపించింది.. 

కానీ బౌలింగే తమ ప్రధాన ఆయుధమనే అంచనాను నిజం చేస్తూ తొలిసారిగా రైజర్స్‌ బౌలర్లు కదం తొక్కారు. తొలి ఓవర్‌ నుంచే సాగించిన వికెట్ల వేటను చివరి వరకు కొనసాగిస్తూ తమ జట్టుకు గెలుపు బోణీ అందించారు. అంతకుముందు బెయిర్‌స్టో, వార్నర్‌, విలియమ్సన్‌ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచారు. బ్యాటింగ్‌లో సాధారణ ప్రదర్శనే చేసినా, తమ బలం బౌలింగ్‌ను నమ్ముకున్న హైదరాబాద్‌ జట్టు సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మొత్తం మీద  విజయం రుచి చూసింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో విశేష ప్రతిభ కనబరుస్తూ పటిష్ఠ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో గెలిచింది. ముఖ్యంగా రషీద్‌ ఖాన్‌ (314) తన లెగ్‌స్పిన్‌తో ముప్పుతిప్పలు పెడుతూ శ్రేయాస్‌, ధవన్‌, పంత్‌ వికెట్లు తీశాడు. అటు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లతో రైజర్స్‌ ఖాతా తెరిచింది. 

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), వార్నర్‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), విలియమ్సన్‌ (26 బంతుల్లో 5 ఫోర్లతో 41) రాణించారు. రబాడ, మిశ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి ఓడింది. ధవన్‌ (34), పంత్‌ (28) ఓమాదిరిగా ఆడారు. భువీకి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రషీద్‌ ఖాన్‌ నిలిచాడు.

బెయిర్‌స్టో, వార్నర్, విలియమ్సన్‌ బ్యాటింగ్‌లో జట్టుకు తగిన స్కోరునందిస్తే, ఆ తర్వాత రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ పదును ముందు ఢిల్లీ నిలబడలేకపోయింది. ఎంతగా శ్రమించినా లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈ లీగ్‌లో తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో మొత్తం 309 పరుగులు మాత్రమే రాగా, 9 సిక్సర్లే నమోదయ్యాయి!

సాధారణ లక్ష్యఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ కూడా తడబడుతూనే సాగింది. తొలి ఓవర్లోనే పృథ్వీ షా (2)ను భువనేశ్వర్‌ అవుట్‌ చేయగా, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (21 బంతుల్లో 17; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నంతసేపు ఇబ్బందిగా ఆడాడు. మరోవైపు ధావన్‌ మాత్రం తన అనుభవంతో ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా నడిపించే ప్రయత్నం చేశాడు. అయితే భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో మాత్రం ఎవరూ సఫలం కాలేకపోయారు. వీరిద్దరిని రషీద్‌ వెనక్కి పంపడంతో రైజర్స్‌లో గెలుపు ఆశలు పెరిగాయి. 

ఈ దశలో పంత్, హెట్‌మైర్‌ (12 బంతుల్లో 21; 2 సిక్సర్లు) కాస్త దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. అభిషేక్‌ బౌలింగ్‌లో పంత్, ఖలీల్‌ బౌలింగ్‌లో హెట్‌మైర్‌ వరుసగా రెండేసి సిక్సర్లు బాదారు. అయితే ఇదే జోరులో భువీ బౌలింగ్‌లో హెట్‌మైర్‌ అవుటయ్యాడు. 21 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన స్థితిలో ఢిల్లీ ఆశలన్నీ పంత్‌పైనే ఉండగా... రషీద్‌ ఖాన్‌ అతడిని డగౌట్‌ చేర్చడంతో రైజర్స్‌కు విజయావకాశం చిక్కింది. ఆపై స్టొయినిస్‌ (11) కూడా ఏమీ చేయలేకపోయాడు.  

న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లో చక్కటి ఇన్నింగ్స్‌తో తన విలువేంటో చూపించాడు. గాయంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన అతను నబీ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. 157.69 స్ట్రయిక్‌ రేట్‌తో రైజర్స్‌ చెప్పుకోదగ్గ స్కోరు సాధించడంలో కేన్‌ కీలకపాత్ర పోషించాడు. తనదైన క్లాస్‌ శైలిలో అతను చూడచక్కటి ఐదు బౌండరీలు కొట్టాడు. నోర్జే బౌలింగ్‌లో వరుసగా రెండు, స్టొయినిస్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన విలియమ్సన్‌... మిశ్రా బౌలింగ్‌లో కొట్టిన ఫ్లిక్‌ షాట్‌ బౌండరీ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. 

సన్ రైజర్స్ జట్టులో రషీద్ ఖాన్ మాయాజాలం మొదలైంది. అతి తక్కువ లక్ష్య ఛేదనను కూడా అడ్డుకొని ఢిల్లీ క్యాపిటల్స్ పని పట్టిన రషీద్.. ఇతర జట్లకు కూడా తన బౌలింగ్ విజృంభణతో హెచ్చరికలు పంపాడు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle