newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ఛేదనలో శతకొట్టిన ధావన్.. ఖంగుతిన్న సీఎస్కే

18-10-202018-10-2020 09:25:28 IST
Updated On 18-10-2020 10:50:50 ISTUpdated On 18-10-20202020-10-18T03:55:28.996Z18-10-2020 2020-10-18T03:55:12.783Z - 2020-10-18T05:20:50.599Z - 18-10-2020

ఛేదనలో శతకొట్టిన ధావన్.. ఖంగుతిన్న సీఎస్కే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తన బ్యాట్‌ పవర్‌ ఏమిటో చూపించిన ఢిల్లీ క్యాపిటల్స్ క్లాస్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ ఒంటిచేత్తో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఆటను లాగేసుకున్నాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 101 పరుగులు సాధించిన ధావన్ శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టుకు ఘనవిజయం సాధించిపెట్టాడు. ఢిల్లీ జట్టులోని మిగతా టాపార్డర్‌ ఆటగాళ్లు తడబడ్డ చోట ధావన్‌ మెరిశాడు. తాను ఎప్పుడూ క్లాస్‌ ఆటగాడననే చెప్పుకునే ధావన్‌.. ఒక మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ధోనీతో సహా చెన్నయ్ జట్టు ధావన్, అక్షర్ దూకుడుతో చేష్టలుడిగి చూస్తుండిపోయింది.

ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ (58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగాడు. ఇది ధావన్‌కు ఐపీఎల్‌లో తొలి సెంచరీ.దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఆరు ఓటములతో చెన్నై తమ ప్లేఆఫ్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 179 పరుగులు చేసింది. డుప్లెసి (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), అంబటి రాయుడు (25 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 45 నాటౌట్‌), వాట్సన్‌ (28 బంతుల్లో 6 ఫోర్లతో 36) ఆదుకోగా చివర్లో జడేజా (13 బంతుల్లో 4 సిక్సర్లతో 33 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.  నోర్జేకు రెండు వికెట్లు దక్కాయి. 

ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసి గెలిచింది. అక్షర్‌ (5 బంతుల్లో 3 సిక్సర్లతో 21 నాటౌట్‌) దూకుడుగా ఆడాడు. దీపక్‌ చాహర్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ధవన్‌ నిలిచాడు. 

డివిలియర్స్ దంచి కొట్టాడు.. ఆఖర్లో చేతులెత్తేసిన రాజస్థాన్

కష్టసాధ్యంగా మారిన పిచ్‌పై ధావన్ బౌండరీలతో హోరెత్తిస్తూ ఏకంగా శతకమే బాదేశాడు.. అయితే ఆఖరి ఓవర్‌ వరకు వెళ్లిన ఈ మ్యాచ్‌లో అక్షర్‌ మూడు సిక్సర్లతో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ 14 పాయింట్లతో మరోసారి అగ్రస్థానానికి చేరింది. అటు చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లో పేలవ ప్రదర్శనతో మూల్యం చెల్లించుకుంది.

సీఎస్‌కే నిర్దేశించిన 180 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఢిల్లీ ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. దీపక్‌ చహర్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే పృథ్వీ షా డకౌట్‌ అయ్యాడు. ఆపై అజింక్యా రహానే(8) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(23; 23 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), స్టోయినిస్‌(24;14 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) మోస్తరుగా ఆడగా, ధావన్‌ మాత్రం జట్టు విజయం సాధించే వరకూ క్రీజ్‌లో ఉండి సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ధావన్‌ ఆటలో సిక్స్‌లు పెద్దగా లేకపోయినా బౌండరీలను గ్యాప్‌ల్లోంచి రాబట్టడం ద్వారా తనేమిటో నిరూపించుకున్నాడు.

కాగా, ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన సమయంలో ఆ బాధ్యతను అక్షర్‌ తీసుకున్నాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి ధావన్‌ సింగిల్‌ తీయగా,  అక్షర్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకున్నాడు.  ఇక నాల్గో బంతికి రెండు పరుగులు తీసిన అక్షర్‌.. ఐదో బంతికి మరో సిక్స్‌ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. ధావన్‌ సెంచరీకి అక్షర్‌ మంచి ఫినిషింగ్‌ ఇవ్వడంతో ఢిల్లీ ఇంకా బంతి ఉండగా విజయం సాధించింది. అక్షర్‌ 5 బంతుల్లో అజేయంగా 21 పరుగులు సాధించడంతో అప‍్పటివరకూ సీఎస్‌కే వైపు ఉన్న మ్యాచ్‌  కాస్తా ఢిల్లీ వైపు మొగ్గింది. ఇది ఢిల్లీకి ఏడో విజయం కాగా, సీఎస్‌కేకు ఆరో ఓటమి.

పోతే, కీలకమైన ఈ మ్యాచ్‌లో సీఎస్కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(3)  మళ్లీ విఫలమయ్యాడు. నోర్జే వేసిన 17 ఓవర్‌ మూడో బంతికి కీపర్‌ అలెక్స్‌ క్యారీ క్యాచ్‌ పట్టగా ధోని నిష్క్రమించాడు.  ఐపీఎల్‌లో అతి తక్కువ మ్యాచ్‌ (27)ల్లోనే 50 వికెట్లు తీసిన బౌలర్‌‌గా రబాడ రికార్డు సృష్టించాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle