newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

సారీ తెవాటియా.. తప్పుగా అంచనా వేశా.. ఎమెస్కే ప్రసాద్

29-09-202029-09-2020 10:32:44 IST
2020-09-29T05:02:44.018Z29-09-2020 2020-09-29T05:02:41.894Z - - 25-10-2020

సారీ తెవాటియా.. తప్పుగా అంచనా వేశా.. ఎమెస్కే ప్రసాద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఓటమి తప్పదని ఆశలు వదిలేసుకున్న తరుణంలో ఒకే ఒక్క ఓవర్‌లో 5 సిక్సర్లు మోది గేమ్ స్వరూపాన్నే మార్చివేసిన రాజస్థాన్ రాయల్స్ డాషింగ్ బ్యాట్స్‌మన్ తెవాటియాపై ప్రశంసల వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కానీ అదే మ్యాచ్‌లో మొదట్లో జిడ్డు ఆట ఆడి అందరి సహనానికి పరీక్ష పెట్టిన తెవాటియాను మాటల్లో ఆడిపోసుకున్న టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమెస్కే ప్రసాద్ తన తప్పును ఒప్పుకోవడమే కాకుండా మనస్ఫూర్తిగా తెవాటియాకు క్షమాపణలు చెప్పాడు. 

స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు చానల్‌లో కామెంట్రీ చెబుతున్న సమయంలో తెవాటియా బ్యాటింగ్‌ చూసి ఎంఎస్‌కే అసహనం వ్యక్తం చేశారు. తెవాటియాకు బ్యాటింగ్‌ రికార్డులు ఉండటం తాను ఎక్కడ చూడలేదని, మరి రాజస్తాన్‌ రాయల్స్‌ అతన్ని సెకెండ్‌ డౌన్‌లో దింపి తప్పు చేసిందన్నాడు. దీనివల్ల అవతలి ఎండ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై ఒత్తిడి పెరుగుతుందని ఎంఎస్‌కే అన్నారు. ఆపై కాసేపటికి షమీ వేసిన బౌన్సర్‌ను అప్పర్‌ కట్‌ ఆడే ప్రయత్నంలో సంజూ శాంసన్‌ కీపర్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

దాంతో కింగ్స్‌ పంజాబ్‌  విజయం ఖాయమని ఆ ఫ్రాంచైజీ సంబరాలు చేసుకుంది. కానీ ఆ తర్వాతే కథ మొదలైంది. తెవాటియా తన బ్యాట్‌కు పని చెప్పి సిక్సర్లతో హోరెత్తించాడు. టీ20లో అసలైన మజాను అందించాడు. వరుస సిక్సర్లతో కాట్రెల్‌పై విరుచుకుపడ్డాడు. దాంతో కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాళ్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టడంతో ఒక్కసారి మ్యాచ్‌ టర్న్‌ అయిపోయింది.

మ్యాచ్ అనంతరం బైజూస్ క్రికెట్‌ లైవ్‌లో హోస్ట్ నందుతో మాట్లాడిన ఎమ్మెస్కే ప్రసాద్‌.. తన తప్పిదానికి క్షమాపణలు కోరాడు. ‘తెవాటియా గురించి అనవసరమైన వ్యాఖ్యలు చేసినట్లున్నాను. తెవాటియా ఒక అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడాడు. భారీ సిక్స్‌లతో విరుచుకుపడి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. తాను ముందుగా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా. అతనిలో సామర్థ్యాన్ని గుర్తించే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు’ అని అన్నారు. తెవాటియా బ్యాటింగ్ సామర్థ్యం తెలియక తక్కువ అంచనా వేసానని తన చెవులు పట్టుకోని మరి క్షమించమని కోరాడు ప్రసాద్.

ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌-రాజస్తాన​ రాయల్స్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల మోత మోగింది. తొలుత కింగ్స్‌ పంజాబ్‌ 223 పరుగులు చేస్తే, తాము  ఏమీ తక్కువ తినలేదని జవాబిస్తూ రాజస్తాన్‌ రాయల్స్‌ దాన్ని ఇంకా మూడు బంతులు ఉండగానే ఛేదించి భళా అనిపించింది.  ఈ మ్యాచ్‌లో గేమ్‌ ఛేంజర్‌ తెవాటియానే. తొలుత స్మిత్‌, సంజూ శాంసన్‌లు ధాటిగా ఆడినా తెవాటియా ఇన్నింగ్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌. భారీ లక్ష్య ఛేదనలో సెకండ్‌ డౌన్‌లో వచ్చాడు. అయితే పెద్దగా అంచనాలు లేని తెవాటియాను ఆ స్థానంలో ఎందుకు పంపారనే ప్రశ్న వచ్చింది. 

దానికి తగ్గట్టుగానే తెవాటియా తొలుత తడబడ్డాడు. తెవాటియా ఎదుర్కొన తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేసి ఇదేమి బ్యాటింగ్‌ అనిపించాడు. కానీ శాంసన్‌ ఔటైన తర్వాత మొత్తం గేమ్‌ స్వరూపాన్ని మార్చేశాడు తెవాటియా. కాట్రెల్‌ వేసిన 18 ఓవర్‌లో ఐదు సిక్స్‌లు కొట్టి గేమ్‌ను చేంజ్‌ చేసేశాడు. ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ ఆడిన ఇన్నింగ్స్‌ కింగ్స్‌ పంజాబ్‌కు పరాజయాన్ని మిగిల్చింది. తెవాటియా మొత్తంగా 31 బంతుల్లో 7 సిక్స్‌లతో 53 పరుగులు చేసి మొత్తం గేమ్‌ స్వరూపాన్ని మార్చేసి తిట్టిన నోళ్లనే పొగిడేలా చేసుకున్నాడు. ఇలా తెవాటియా విమర్శించిన వారిలో టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప‍్రసాద్‌ కూడా ఉన్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle