newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

చెన్నై వైఫల్యం కాదు.. ఇక ధోనీ నిష్క్రమణే

24-10-202024-10-2020 18:52:06 IST
Updated On 24-10-2020 18:52:38 ISTUpdated On 24-10-20202020-10-24T13:22:06.013Z24-10-2020 2020-10-24T13:21:57.686Z - 2020-10-24T13:22:38.540Z - 24-10-2020

చెన్నై వైఫల్యం కాదు.. ఇక ధోనీ నిష్క్రమణే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శుక్రవారం ఒక మేటి జట్టు దారుణ పరాభవాల చరిత్రకు ముగింపు పలికింది. ఇది ఒక జట్టు పరాభవం కంటే బారత జట్టుకు ప్రపంచ కప్‌లను సాధించిపెట్టిన మేటి కేప్టెన్ ఘన చరిత్రకు మంగళం పలికినట్లయింది. అనితర సాధ్యమైన విజయాలతో భారత క్రికెట్‌ని దశాబ్దంపైగా శాసించిన మహేంద్ర సింగ్ ధోనీ నిష్క్రమణకు ఈ శుక్రవారం నాటి పరాజయం నాంది పలికినట్లేనని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

ఐపీఎల్‌-2020 సీజన్‌లో మాజీ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) కథ ముగిసింది. శుక్రవారం రాత్రి షార్జా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలై ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్‌కే అభిమానులు ఆశలను అడియాశలు చేస్తూ.. ఎవరూ ఊహించిన విధంగా 11 మ్యాచ్‌ల్లో ఎనిమిదో ఓటమితో తీవ్రంగా నిరాశపరిచింది. 

ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో తొలిసారి చివరి స్థానానికి పరిమితం అయ్యింది. మూడు సార్లు ఛాంపియన్‌, ఐదుసార్లు రన్నరఫ్‌తో పాటు అన్ని సీజన్స్‌లో ఫ్లే ఆఫ్స్‌కి చేరిన ఘనత కలిగిన చెన్నై ఈసారి టోర్నీలో కనీస పోరాట పటిమను సైతం చూపలేక ఆటగాళ్లు ప్రత్యర్థికి దాసోహమన్నారు. దీంతో కేవలం మూడు విజయాలు ఆరు పాయింట్లతో చివరి స్థానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ కావడంతో తొలి నుంచీ చెన్నైకి అభిమానులు ఎక్కువే. ధోనీతో పాటు స్టార్‌ ఆటగాళ్లు సురేష్‌ రైనా, రవీంద్ర జడేనా, అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌లు ప్రధాన ఆటగాళ్లు కావడంతో తొలినుంచీ జట్టు ప్రదర్శనపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే అనుహ్యంగా టోర్నీ నుంచి మిస్టర్ ఐపీఎల్‌ సురేష్‌ రైనా, హర్బజన్‌సింగ్‌ వైదొలగడంతో ఆ ప్రభావం జట్టుపై తీవ్రంగా పడినట్టు పాయింట్ల పట్టికను చూస్తే అర్థమవుతోంది. 

సీజన్‌-2020లో తొలి మ్యాచ్‌లోనే పటిష్టమైన ముంబైపై విజయం సాధించి ఖాతా తెరిచిన ధోనీ సేన అలాంటి ప్రదర్శన కేవలం ఆ ఒక్కమ్యాచ్‌కే పరిమితమైంది. టోర్నీ ఆసాంతం ఫేలమైన ఆట తీరుతో సీనియర్‌ సిటిజన్స్‌ అనే బిరుదుతో పాటు అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కొంది. 

రైనాలేని లోటు సగం దెబ్బతీసింది

వాట్సన్‌, రాయుడు, డుప్లెసిస్‌తో పాటు ధోనీ లాంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్స్‌‌ ఉన్నా.. జట్టును గట్టెక్కించలేకపోయారు. టాప్‌ ఆర్డర్‌లో రైనా లేని లోటు టోర్నీ అంతా స్పష్టంగా కనిపించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ నుంచి అభిమానులు ఎంతో అశించి చివరికి భంగపడ్డారు. స్థాయికి తగ్గ ఆటను కెప్టెన్‌ ప్రదర్శించలేదని జట్టు యాజమాన్యంతో పాటు, అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. 

మరోవైపు సోషల్‌ మీడియాలో సీఎస్‌కేపై పెద్ద ఎత్తున కామెంట్స్‌ వస్తున్నాయి. వచ్చే సీజన్‌లోనైనా టీంను పూర్తిగా ప్రక్షాళన చేయాలని రైనాను తిరిగి జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. ధోనీ ఇక రిటైర్మెంట్‌ ప్రకటించాలని కామెంట్స్‌ పెడుతున్నారు. జట్లులో దాదాపు చాలామంది ఆటగాళ్లు 33 ఏళ్లుకు పైబడిన వారు కావడంతో ఇతర జట్లతో సమానంగా వేగాన్ని అందుకోలేకపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. 

వారందరినీ తొలగించి యువకులతో కూడిన జట్టుతో బరిలోకి దిగాలని ఆశిస్తున్నారు. బౌలింగ్‌తో పాటు బ్యాంటిగ్‌ ఆర్డర్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేసి.. యంగ్‌ ప్లేయర్స్‌ను తీసుకోవాలనే వాదన బలంగా వినిపిస్తున్నారు. ఇక సీఎస్‌కే ప్రదర్శనపై సీఎస్‌కే జట్టు యాజమాన్యం ఏ విధమైన మార్పులకు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి.  

 

సిరీస్ స‌మం చేసేనా..?

సిరీస్ స‌మం చేసేనా..?

   12 hours ago


అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

   16 hours ago


హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

హార్దిక్ బౌలింగ్.. ఎన్నో ప్రశ్నలకు సమాధానం

   18 hours ago


ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

ఓటమిపై స్పందించిన కోహ్లీ.. కొంపముంచింది అవే అంటూ..!

   19 hours ago


బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

బుట్ట బొమ్మ స్టెప్ వేసిన వార్నర్.. ఏమంటే ఈసారి భారతీయులు బాధలో ఉన్నప్పుడు

   27-11-2020


చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

చెత్త రికార్డు సాధించిన స్పిన్నర్ గా చాహల్

   27-11-2020


మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

   27-11-2020


హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

హార్థిక్ పాండ్య రాణించినా.. భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి

   27-11-2020


నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

నిబంధనలను ఉల్లంఘిస్తే పాక్ జట్టు వెనక్కే.. అఖ్తర్ మండిపాటు

   27-11-2020


శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

శ‌త‌కాల‌తో చెల‌రేగిన స్మిత్‌, ఫించ్‌.. టీమ్ఇండియా ముందు భారీ లక్ష్యం

   27-11-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle