newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!

03-03-202103-03-2021 22:19:40 IST
Updated On 04-03-2021 09:49:13 ISTUpdated On 04-03-20212021-03-03T16:49:40.399Z03-03-2021 2021-03-03T16:49:34.189Z - 2021-03-04T04:19:13.416Z - 04-03-2021

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో చివరిదైన టెస్టు మ్యాచ్ మార్చి 4 నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అంతకు ముందు డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ రెండ్రోజుల్లోనే ముగియడంతో పిచ్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. 

గత టెస్టులో ఆడిన పిచ్ కు, ఈ మ్యాచ్ కు ఏర్పాటు చేసిన పిచ్ కు పెద్దగా తేడా కనిపించడంలేదని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ చెప్పుకొచ్చాడు. గత రెండు టెస్టుల నుంచి తాము చాలా పాఠాలు నేర్చుకున్నామని, తప్పకుండా పుంజుకుంటామని రూట్ చెబుతున్నాడు. ఇక మంచి పిచ్ అంటే ఎలా ఉండాలన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని, తాము మాత్రం ప్రత్యర్థికంటే మెరుగ్గా ఆడడానికి ప్రాధాన్యత ఇస్తామని రూట్ స్పష్టం చేశాడు. 

నాలుగో టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ కు అనుకూలించే పిచ్ లు తరచుగా చర్చనీయాంశం అవుతున్నాయని.. అయితే స్పిన్ పిచ్ పై మూడ్రోజుల్లోనే మ్యాచ్ ముగిసినప్పుడు వినిపిస్తున్న గొంతుకలు... పేస్ పిచ్ లపై తక్కువ రోజుల్లోనే మ్యాచ్ ముగిసినప్పుడు వినిపించడంలేదని అన్నాడు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను తాను గౌరవిస్తానని, కానీ కేవలం స్పిన్ పిచ్ ల విషయంలోనే విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశాడు.

న్యూజిలాండ్ లో తాము ఓ టెస్టులో మూడో రోజు ఆటలో 36 ఓవర్లలోనే మ్యాచ్ ను కోల్పోయామని.. భారత్ కు చెందినవాళ్లెవరూ ఆ పిచ్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తాను కచ్చితంగా చెప్పగలనని కోహ్లీ అన్నాడు. న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఎంత చెత్తగా ఆడిందన్నదే చూస్తారని, అక్కడి పిచ్ లను మాత్రం ఎవరూ తప్పుబట్టరని అన్నాడు. ఆ పిచ్ లపై ఎంత గడ్డి ఉంది? బంతి ఎలా స్వింగ్ అవుతోంది? బంతి ఎలా దూసుకెళుతోంది? అనేది ఎవరూ చూడరని అన్నాడు. పిచ్ ఎలా ఉన్నా తాము పట్టించుకోమని, అదే టీమిండియా విజయాలకు కారణమని కోహ్లీ స్పష్టం చేశాడు. 

నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి టెస్టును ఇంగ్లండ్ 227 పరుగుల తేడాతో నెగ్గింది. అదే మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత్ 317 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. మూడో టెస్టులో భారత్ 10 వికెట్లతో గెలిచి సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle