బ్రిస్బేన్ టెస్ట్.. వర్షం వస్తుందా.. ఫలితం వస్తుందా..?
18-01-202118-01-2021 15:36:20 IST
Updated On 18-01-2021 17:05:43 ISTUpdated On 18-01-20212021-01-18T10:06:20.314Z18-01-2021 2021-01-18T10:06:03.390Z - 2021-01-18T11:35:43.855Z - 18-01-2021

బ్రిస్బేన్ లో టీమిండియా, ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. 328 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 1.5 ఓవర్లలో 4 పరుగులు చేసింది. వరుణుడు మరోసారి పలకరించడంతో నాలుగో రోజు ఆఖరి సెషన్ ఆట కొనసాగించడానికి వీలుపడలేదు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే ఇంకా 324 పరుగులు చేయాలి. ఆటకు మరో రోజు మిగిలివున్నందున చివరిరోజు మరింత ఆసక్తికరంగా మారింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమిండియా గెలుపు కోసం పోరాడుతుందో, లేక డ్రా చేసుకోవడానికి మొగ్గు చూపుతుందో చూడాలి. లేక వర్షం అయిదో రోజు ఆట జరగనివ్వకుండా క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆతిథ్య ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. మాజీ కెప్టెన్ స్మిత్ 55, వార్నర్ 48 పరుగులతో రాణించారు. చివర్లో కామెరాన్ గ్రీన్ (37), కెప్టెన్ టిమ్ పైన్ (27), పాట్ కమ్మిన్స్ (28 నాటౌట్) రాణించారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లు తీయడం హైలైట్ అని చెప్పాలి. కెరీర్ లో రెండో టెస్టు ఆడుతున్న ఈ హైదరాబాదీ పేసర్ మంచి బౌలింగ్ వేసాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆసీస్ తిరిగి చేజిక్కించుకోవాలంటే, 10 వికెట్లు తీయాల్సిందే. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ ని డ్రా చేసుకోగలిగితే, పూర్వపు విజేత హోదాలో మరో మారు ట్రోఫీని తన వద్దే ఉంచుకోనుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేయగా, భారత్ 336 పరుగులు చేసింది. సిరాజ్ బౌలింగ్ కు ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సిరాజ్ ను అభినందించాడు. ఈ టూర్ తో పిల్లోడు కాస్తా పెద్దోడు అయ్యాడంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సిరాజ్ తన తొలి టెస్టు సిరీస్ లోనే భారత పేసర్లకు నేతృత్వం వహించేంతగా ఎదిగాడని.. టీమిండియా పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడని పొగడ్తల జల్లు కురిపించాడు. ఈ సిరీస్ లో కొత్త ఆటగాళ్లు రాణిస్తున్న తీరు చాలాకాలం పాటు శిలాఫలకంలా నిలిచిపోతుందని, ట్రోఫీని నిలబెట్టుకుంటే కొత్త ఆటగాళ్ల శ్రమకు న్యాయం చేసినట్టవుతుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లలో 75 శాతం గాయాల కారణంగా బెంచ్ కే పరిమితం అయ్యారు. దీంతో భారతజట్టు ఎప్పుడు లేనంత మందికి ఈ సిరీస్ లో అవకాశాలు ఇచ్చింది.

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
16 hours ago

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
18 hours ago

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
21 hours ago

సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!
21 hours ago

పంత్ సూపర్ సెంచరీ.. లీడ్ లో భారత్..!
05-03-2021

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
04-03-2021

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
04-03-2021

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
03-03-2021

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-2021
ఇంకా