నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-202103-03-2021 10:36:31 IST
2021-03-03T05:06:31.203Z03-03-2021 2021-03-03T05:06:28.475Z - - 11-04-2021

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మొతేరా స్టేడియంలో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ముగిసి వారం రోజులు కావస్తున్నా అనూహ్యంగా స్పందించిన పిచ్ పట్ల స్పందనలు, ప్రతిస్పందనలు ఆగడం లేదు. క్రికెట్ ప్రపంచం మొత్తంగా.. రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్‌ను ముగించేసిన తరహా పిచ్ అవసరమా, అసలు అది టెస్టు మ్యాచ్‌కు తగిన పిచ్‌లా ఉందా అంటూ విమర్శలు, ప్రతివిమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కూడా మొతేరా పిచ్‌పై వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సైతం మొతేరా మైదానంలో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అయిదువికెట్లు తీయడం వింతల్లో కెల్లా వింత కాదా అని ప్రశ్నించాడు. చివరకు టీమిండియానే ఇక్కడ 145 పరుగులకే కుప్పగూలిందని, ఎలాంటి పిచ్‌పైన అయినా సరే ఇంగ్లండ్ జట్టును ఓడించగల సామర్థ్యం ఉన్న టీమిండియా ప్రత్యర్థిని చూసి ఇంతగా భయపడాల్సిన పనేంటని అక్తర్ వ్యాఖ్యానించాడు. పైగా, మొతేరాలోనే జరగనున్న నాలుగో టెస్టుకయినా కాస్త న్యాయమైన పిచ్‌ను ఆశిస్తున్నట్లు అక్తర్ పేర్కొన్నాడు. ఏ జట్టైనా సరే.. స్వదేశంలో అనుకూల పిచ్‌ను ఆశించడంలో ఏ తప్పూ లేదని అక్తర్ పేర్కొన్నాడు. కానీ మూడో రోజు నుంచి పిచ్ అనూహ్యంగా మారినప్పడు మాత్రమే అర్థం చేసుకోగలమని కానీ ఆట తొలి రోజునుంచే వికెట్లు టపటపా కూలడం టెస్టు క్రికెట్‌కు మంచిది కాదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. ఎలాంటి పిచ్‌పై ఆడినా సరే గెలిచే సత్తా టీమిండియాకు ఉందని, కాబట్టి నాలుగో టెస్టులో నాణ్యమైన పిచ్ రూపొందించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విజ్ఞప్తి చేశాడు. భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించగలదని, అనవసర భయాలు అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా అహ్మదాబాద్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో కోహ్లి సేన ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన సంగతి తెలిసిందే. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1తో టెస్టు సిరీస్‌లో ముందంజలో నిలిచింది. అయితే మొతేరా పిచ్‌ని స్పిన్నర్లకు అనుకూలంగా రూపొందించడం వల్లే భారత్ విజయం సాధించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సిరీస్ విజయంలో నిర్ణయాత్మకమైన ఆఖరి టెస్టు కూడా అదే మైదానంలో జరుగనుండటంతో పిచ్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాక్ మాజీ పేసర్ షోయబ్ సైతం సోషల్ మీడియా వేదికగా తన అనుభవాలు పంచుకున్నాడు. అలాంటి వికెట్‌పై ఎవరైనా టెస్టు మ్యాచ్‌లు ఆడతారా అస్సలు ఆడరు కదా. రెండు రోజుల్లో మ్యాచ్ ముగిసిపోవడం టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు. స్వదేశంలో సిరీస్ జరుగుతున్నందున పిచ్ అడ్వాంటేజ్ తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఇక్కడ కాస్త అది శ్రుతి మించింది. ఒకవేళ ఇండియా 400 పరుగులు చేసి, ఇంగ్లండ్ 200 రన్స్‌కే ఆలౌట్ అయితే, పర్యాటక జట్టు బాగా ఆడలేకపోయిందని చెప్పవచ్చు. కానీ భారత్ కూడా 145 పరుగులకే కుప్పకూలింది కదా అని అక్తర్ పేర్కొన్నాడు. టీమిండియా ప్రపంచంలోనే అతి పెద్ద జట్టు. ఇలా ఆడకూడదు. నాణ్యమైన పిచ్‌లపై కూడా ఇంగ్లండ్ వంటి జట్లను మట్టికరిపించగల సత్తా వారికి ఉంది. అనవసర భయాలతో ఇలాంటి పిచ్ తయారు చేయడం సరికాదు. అడిలైడ్‌లో ఇండియాకు అనుకూలమైన పిచ్ రూపొందించారా? మెల్బోర్న్లో భారత్‌కు లబ్ది చేకూరేలా పిచ్ తయారు చేశారా? అయినా కూడా ఇండియా విదేశీ గడ్డపై సిరీస్ గెలిచింది కదా నిజాయితీగా ఆడి గెలిస్తేనే మజా ఉంటుంది. మనం స్వదేశంలో, విదేశాల్లో ఎంతో మెరుగ్గా ఆడగలం. ఈ విషయాలను ఇండియా పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి పిచ్‌లపై ఆడటం మీ స్థాయికి తక్కువే. ఎవరేమన్నా ఇది నిజం. ఆట మూడో రోజు లేదంటే నాలుగో రోజు అడ్వాంటేజ్ తీసుకున్నారు అంటే ఓకే. కానీ.. దురదృష్టవశాత్తూ అక్కడ జో రూట్ కూడా వికెట్లు తీశాడు. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నాలుగో టెస్టులో మంచిగా ఆడతారు అనుకుంటున్నా. బెస్ట్ పిచ్ తయారు చేస్తారు అని భావిస్తున్నా. హోం అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన స్థితిలో టీమిండియా లేదు. సిరీస్ గెలిచే సత్తా భారత్ సొంతం. ఆస్ట్రేలియా గడ్డపై వాళ్లను ఓడించిన జట్టుకు స్వదేశంలో గెలవడం పెద్ద సమస్యేమీ కాదు. కాబట్టి నాణ్యమైన పిచ్ రూపొందించండి అని అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా మార్చి 4 నుంచి అహ్మదాబాద్‌లో టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఆఖరి టెస్టు ఆరంభం కానుంది. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 145 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ 112 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే పర్యాటక జట్టును ఆలౌట్ చేసిన భారత్ పది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆడలేని వారు పిచ్‌పై ఆరోపించడం ఏంటని వివియన్ రిచ్చర్డ్స్, అజారుద్దీన్, నాథన్ లియోన్ వంటి ప్రముఖ క్రికెటర్లు మొతేరా పిచ్‌ను సమర్థించడం గమనార్హం.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
15 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
17 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
a day ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్‌ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-2021
ఇంకా