INDvENG: రోహిత్ భారీ శతకం.. చివర్లో కాస్త కుదుపు
13-02-202113-02-2021 17:17:37 IST
Updated On 13-02-2021 17:30:44 ISTUpdated On 13-02-20212021-02-13T11:47:37.487Z13-02-2021 2021-02-13T11:47:30.301Z - 2021-02-13T12:00:44.311Z - 13-02-2021

చెన్నైలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు రోహిత్ శర్మ భారీ సెంచరీతో చెలరేగాడు. 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో రోహిత్ శర్మ 161 పరుగులు చేశారు. ఇంకో గంటలో రోజు ముగుస్తుందన్న సమయంలో రోహిత్ శర్మ భారీ షాట్ కు వెళ్లి అవుట్ అయ్యాడు. క్రీజులో కుదురుకున్న రహానే కూడా 67 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. పంత్ 33 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉండగా.. అక్షర్ పటేల్ 5 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. జాక్ లీక్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు తీయగా.. ఓలీ స్టోన్ ఒక వికెట్, రూట్ ఒక వికెట్ తీశారు. రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అచ్చం వన్డే తరహాలో దాటిగా ఆడిన రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది ఏడో శతకం కాగా.. చెన్నై వేదికగా సెంచరీ నమోదు చేయడం ఇదే తొలిసారి. 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ చివరి సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో రోహిత్ శర్మ నమోదు చేసిన ఏడు సెంచరీలు భారత గడ్డపైనే వచ్చాయి. ఆఖర్లో భారీ షాట్స్ తో విరుచుకుపడాలని అనుకున్న రోహిత్ 161 పరుగుల వద్ద భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ పుజారా, రహానేతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్, కట్ షాట్లతో రోహిత్ శర్మ అలరించాడు. విరాట్ కోహ్లీ చెత్త రికార్డును అందుకున్నాడు. కోహ్లి ఇంగ్లండ్ స్పిన్నర్ మెయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. అలీ వేసిన బంతి ఆఫ్‌స్టంప్‌కు అవతల పడుతూ వెళ్లడంతో కోహ్లి కవర్ డ్రైవ్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్ స్టంఫ్ వికెట్‌ను గిరాటేసింది. తన టెస్టు కెరీర్లో కోహ్లి 11వ సారి డకౌట్‌గా వెనుదిరగ్గా.. ఒక స్పిన్నర్ బౌలింగ్‌లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. అంతకముందు 10 సార్లు విరాట్ కోహ్లి ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే డకౌట్‌గా వెనుదిరగాడు. అంతర్జాతీయ కెరీర్లో కోహ్లికి మొత్తం 26 డకౌట్లున్నాయి. టీమిండియా తరపున టెస్టు కెప్టెన్‌గా ఉంటూ అత్యధికసార్లు డకౌట్ అయిన రెండో ఆటగాడిగా కోహ్లి చెత్త రికార్డును నమోదు చేశాడు. తాజా డకౌట్‌తో కోహ్లి ధోనిని అధిగమించగా.. 13 డకౌట్లతో సౌరవ్ గంగూలీ మొదటి స్థానంలో ఉన్నాడు.

ప్రపంచంలోనే మేటి బౌలర్ బంతిని పంత్ అలా బాదేశాడే.. వాపోయిన రూట్
7 hours ago

టీమిండియా పై చస్తే బెట్ కట్టనంటున్న మైఖేల్ వాన్
12 hours ago

ఈ ఏడాది ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్ లో మ్యాచ్ లు లేనట్టే..!
07-03-2021

రోహిత్ శర్మ వీరోచిత ఇన్నింగ్స్ సీరీస్‌ని మలుపు తిప్పింది.. కోహ్లీ
07-03-2021

ఏప్రిల్ 9 నుండే ఐపీఎల్ సందడి షురూ..!
07-03-2021

టీమిండియా ప్రతిభ అద్భుతం.. ఇంగ్లండ్ ఎత్తుగడలు ఘోరం... మాజీ క్రికెటర్ల వ్యాఖ్య
07-03-2021

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
06-03-2021

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
06-03-2021

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
06-03-2021

సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!
06-03-2021
ఇంకా