newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

సిరీస్ స‌మం చేసేనా..?

28-11-202028-11-2020 19:44:22 IST
Updated On 28-11-2020 20:52:24 ISTUpdated On 28-11-20202020-11-28T14:14:22.078Z28-11-2020 2020-11-28T14:13:55.736Z - 2020-11-28T15:22:24.953Z - 28-11-2020

సిరీస్ స‌మం చేసేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుదీర్ఘ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను భార‌త జ‌ట్టు ఓట‌మితో ఆరంభించింది. తొలి వ‌న్డేల్లో అన్ని విభాగాల్లో భార‌త జ‌ట్టు ఘోరంగా విఫ‌ల‌మైంది. దీంతో 66 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా రెండో వ‌న్డే ఆదివారం జ‌ర‌గ‌నుంది. సిరీస్‌లో నిలబ‌డాలి అంటే.. రేపటి మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు తప్ప‌క గెల‌వాల్సిందే. లేదంటే.. సిరీస్ ఆస్ట్రేలియా వ‌శం అవుతుంది. తొలి వ‌న్డే జ‌రిగిన సిడ్నిలోనే రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. కాబ‌ట్టి మ‌రోసారి భారీ స్కోర్లు న‌మోదైయ్యే అవ‌కాశం ఉంది. 

తొలి వ‌న్డేల్లో ధార‌ళంగా ప‌రుగులు ఇచ్చిన భార‌త బౌల‌ర్లు రెండో వ‌న్డేల్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ల‌ను ఎంత వ‌ర‌కు క‌ట్ట‌డి చేస్తార‌నే దానిపైనే భార‌త విజ‌యావ‌శాలు ఆధార‌ప‌డి ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో సైనీ, చాహ‌ల్ క‌లిసి 20 ఓవ‌ర్ల‌లో 172 ప‌రుగులు ఇచ్చారు. త‌న కోటా పూర్తి అయిన అనంత‌రం చాహ‌ల్ గాయంతో మైదానాన్ని వీడ‌గా.. సైనీ సైతం వెన్నునొప్పితో బాధ‌ప‌డుతున్నారు. దీంతో వీరిద్ద‌రు రెండో వ‌న్డేలో ఆడ‌తారో లేదో అనే విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. వీరిద్ద‌రు అందుబాటులో లేకుంటే.. చాహ‌ల్ స్థానంలో కుల్దీప్‌కు అవ‌కాశం ద‌క్క‌వ‌చ్చు. సైనీ స్థానంలో శార్ధూల్ ఠాకుర్‌, న‌ట‌రాజ‌న్ ల‌లో ఒకరికి ఆడే అవ‌కాశం వ‌స్తుంది. అయితే.. అంతో ఇంతో బ్యాటింగ్ చేయ‌గ‌ల శార్ధూల్ వైపే కోహ్లీ మొగ్గు చూపే అవ‌కాశం ఉంది. బౌల‌ర్లో ష‌మీ ఒక్క‌డే కాస్త ఫ‌ర్వాలేద‌నిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో రాణించిన స్టార్ పేస‌ర్ బుమ్రా త్వ‌ర‌గా ల‌య‌ను అందుకోవాల్సి ఉంది. ష‌మీ తోడు బుమ్రా కూడా ఫామ్‌లోకి వ‌స్తే.. ఆసీస్ బ్యాట్స్‌మెన్ల‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు. 

ఇక బ్యాటింగ్‌లో కూడా శిఖ‌ర్ ధావ‌న్‌, హార్ధిక్ పాండ్యా మినహా.. మిగ‌తా బ్యాట్స్‌మెన్లు అంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. టీ20 ఫార్మాట్ నుంచి వారు ఇంకా బ‌య‌టికి రాలేక‌ పోయారనే విష‌యం తొలి వ‌న్డేలో స్ప‌ష్ట‌మైంది. వ‌చ్చి రాగానే దూకుడుగా ఆడేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. కెప్టెన్ కోహ్లీతో పాటు, శ్రేయాస్‌, మ‌యాంక్‌, రాహుల్ గాడిలో ప‌డితే.. బ్యాటింగ్‌లో భార‌త్‌కు తిరుగుండ‌దు. ఇక భార‌త ఫీల్డింగ్ గురించి ఎంత త‌క్కువ‌గా మాట్లాడుకుంటే అంత మంచిది. తొలి వ‌న్డేలో చేసిన త‌ప్పిదాల‌ను పున‌రావృతం చేయ‌కుండా ఉంటే.. భార‌త్ సిరీస్ స‌మ‌యం చేసే అవ‌కాశం ఉంది. 

అన్ని విభాగాల్లో బ‌లంగా క‌నిపిస్తున్న ఆసీస్‌

తొలి వ‌న్డేలో గెలుపు ఇచ్చిన ఉత్సాహాంతో ఉన్న‌ ఆసీస్ జ‌ట్టు రెండో వ‌న్డేలో మ‌రింత ఆత్మ‌విశ్వాసంతో బ‌రిలోకి దిగుతుంద‌న‌డంలో సందేహాం లేదు. ఆ జ‌ట్టు అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ ఆరోన్ పించ్‌తో పాటు స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ లు ఫామ్‌లో ఉండ‌డంతో మ‌రోసారి ఆ జ‌ట్టు భారీ స్కోర్‌పై క‌న్నేసే అవ‌కాశం ఉంది. బౌలింగ్‌లో ఆడ‌మ్ జంపాతో పాటు హ‌జివుడ్ క‌ట్టుదిట్టంగా బంతులేస్తూ.. ప్ర‌త్య‌ర్థి వికెట్లు తీస్తుండ‌గా మిగ‌తా బౌల‌ర్లు వారికి స‌హాకారం అందిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో కోహ్లీ క్యాచ్ మిన‌హా ఫిల్డింగ్‌లో ఎలాంటి త‌ప్పిదాలు చేయ‌లేదు. త‌మ‌కు అచ్చొచ్చిన సిడ్ని మైదానంలో మ‌రోసారి చెల‌రేగి సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని ఆసీస్ బావిస్తోంది.  

 

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

   2 hours ago


వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

   5 hours ago


గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

   9 hours ago


ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

   6 hours ago


ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

   27-01-2021


మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

   26-01-2021


కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

   25-01-2021


టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

   25-01-2021


ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

   24-01-2021


ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

   24-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle