newssting
Radio
BITING NEWS :
తెరచుకున్న ఢిల్లీ - నోయిడా, ఢిల్లీ - ఘజియాబాద్ మార్గాలు. రైతుల ఆందోళనలతో రెండు నెలలుగా మూతపడిన మార్గాలు. రైతులు వెనుదిరగడంతో ప్రారంభమైన మార్గాలు. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో కొనసాగుతున్న ఆందోళనలు * తెలంగాణలో కొత్తగా 186 మందికి కరోనా, ఒకరు మృతి. రాష్ట్రంలో 2 లక్షల 9 వేల 923కి చేరిన కరోనా కేసులు. 1594 కి పెరిగిన మృతుల సంఖ్య . * ఢిల్లీలో భూ ప్రకంపనలు. వెస్ట్ ఢిల్లీలో స్వల్పంగా కంపించిన భూమి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.8గా నమోదు. * తూర్పుగోదావరి జిల్లా గంగవరం గిరిజన బాలుర హాస్టల్ లో విద్యార్థి ఆత్మహత్య. హాస్టల్ గదిలో ఉరేసుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రవీణ్. ప్రవీణ్ ఆత్మహత్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. * మణికొండలో టీవీ ఆర్టిస్ట్ సమీర్ వీరంగం. మద్యం మత్తులో ఇద్దరు మహిళలపై దౌర్జన్యం. గతరాత్రి 9గంటలకు మహిళల ఇంటికెళ్లి వేధించిన సమీర్. సమీర్ కు ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన సమీర్. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత మహిళలు. * రామతీర్థంలో వైభవంగా విగ్రహాల ప్రతిష్ట. 16 మంది రుత్వికులతో సీతారామలక్ష్మణ ప్రతిష్ట కార్యక్రమం.

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు

27-11-202027-11-2020 19:20:17 IST
Updated On 28-11-2020 08:36:20 ISTUpdated On 28-11-20202020-11-27T13:50:17.092Z27-11-2020 2020-11-27T13:50:13.681Z - 2020-11-28T03:06:20.974Z - 28-11-2020

మ్యాచ్ మధ్యలో దూసుకొచ్చిన అభిమాని.. షాకైన క్రికెటర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే సమయంలో ఓ ప్రేక్షకుడు గ్రౌండ్ లోకి దూసుకుని వచ్చేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో శుక్రవారం నాడు ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ తో పాటూ భారత జట్టు కూడా షాక్ అయింది. అతడు ప్లకార్డు పట్టుకుని తిరుగుతూ కనిపించాడు. సెక్యూరిటీ ఏమీ చేయలేదని భావించిన వార్నర్ తన కోపాన్ని ప్రదర్శించాడు. చాలా రోజుల తర్వాత గ్రౌండ్ లోకి అభిమానులను అనుమతించారు. కానీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో షాక్ కు గురయ్యారు అందరూ..! ముఖ్యంగా కోవిద్-19 కారణంగా బయో బబుల్ లో ఆటగాళ్లు ఉంటున్నారు. కానీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. 

ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ తొలి వ‌న్డేలో భార‌త్ జ‌ట్టు 66 ప‌రుగుల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. 375 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 308ప‌రుగుల‌కు మాత్ర‌మే ప‌రిమితమైంది. భార‌త ఆట‌గాళ్ల‌లో హార్థిక్ పాండ్యా (90; 76 బంతుల్లో 7 పోర్లు, 4 సిక్స‌ర్లు), శిఖ‌ర్ ధావ‌న్ (74; 86 బంతుల్లో 10పోర్లు)లు మాత్ర‌మే రాణించ‌గా.. మిగ‌తా ఆట‌గాళ్లు దారుణంగా విఫ‌లం కావ‌డంతో.. తొలి వ‌న్డేల్లో భార‌త్ ఓట‌మిని చ‌విచూసింది. ఒకానొక దశలో భారత్ దారుణమైన ఓటమిని చవిచూస్తుందని భావించారు.

101 ప‌రుగుల‌కే నాలుగు కోల్పోయి భార‌త్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో పడింది. ఈ ద‌శ‌లో పాండ్యా-శిఖ‌ర్ జోడి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను తీసుకున్నారు. పాండ్యా ధాటిగా ఆడ‌గా.. శిఖ‌ర్ అత‌డికి చ‌క్కిని స‌హ‌కారం అందించారు. ఇద్ద‌రూ అర్థ‌శ‌త‌కాలు పూర్తి చేసుకున్నారు. వీరిద్ద‌రు ఐదో వికెట్‌కు 128 ప‌రుగులు జోడించారు. కొద్ది తేడాతో ఈ ఇద్ద‌రిని ఆడ‌మ్ జంపా పెవిలియ‌న్ చేర్చాడు. అప్ప‌టి భార‌త స్కోర్ 6 వికెట్ల న‌ష్టానికి 246 ప‌రుగులు. అప్ప‌టికే దాదాపు భార‌త ఓట‌మి ఖాయ‌మైంది. చివ‌ర్లో ర‌వీంద్ర జ‌డేజా (25; 37 బంతుల్లో 1 సిక్స్‌), న‌వ‌దీప్ సైనీ( 29 ;35 బంతుల్లో 1 పోర్, 1 సిక్స్‌), మ‌హ్మ‌ద్ ష‌మీ (13; 10 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) లు ఓ మోస్తార్‌గా బ్యాటింగ్ చేయ‌డంతో.. భార‌త్ 300 ప‌రుగుల మార్క్‌నైనా దాట‌గ‌లిగింది.  ఆసీస్ బౌల‌ర్ల‌లో జంపా నాలుగు వికెట్లు తీయ‌గా.. హ‌జిల్‌వుడ్ మూడు వికెట్ల‌తో రాణించాడు. 

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

ఏ బ్రాండ్ అయినా అని అనుకుంటే.. కోహ్లీకి కూడా నోటీసులు అందుతాయి

   an hour ago


వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్‌లదే హవా

   5 hours ago


గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

గంగూలీ ఆరోగ్యంపై ఆందోళనలు వద్దు..!

   9 hours ago


ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

   6 hours ago


ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

ఫిట్‌నెస్ నిలుపుకోవడమే అతిపెద్ద సవాల్.. శార్దూల్ ఠాకూర్

   27-01-2021


మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

మరీ అంత చెత్తగా బౌలింగ్ చేస్తున్నానా.. అశ్విన్ సవాల్

   26-01-2021


కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

కెప్టెన్ గా కోహ్లీ తప్పుకోవాలిసిన సమయం వచ్చింది.. పనేసర్

   25-01-2021


టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

టీమిండియాకు సమయానికి దొరికిన ఆటగాడు సిరాజ్.. రవిశాస్త్రి వ్యాఖ్య

   25-01-2021


ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

ఆసీస్ పనైపోయిందని అప్పుడర్థమైంది... అశ్విన్ వ్యాఖ్య

   24-01-2021


ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

ఆసీస్ గడ్డపై పంత్‌లాగా ఎవరూ ఆడలేరు.. బ్రాడ్ హాగ్

   24-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle