newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌

28-11-202028-11-2020 15:41:31 IST
Updated On 28-11-2020 15:53:22 ISTUpdated On 28-11-20202020-11-28T10:11:31.749Z28-11-2020 2020-11-28T10:11:28.198Z - 2020-11-28T10:23:22.047Z - 28-11-2020

అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు మ‌రో షాక్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుదీర్థ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌ను దారుణమైన ఓట‌మితో మొద‌లెట్టింది టీమ్ఇండియా. అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న భార‌త జ‌ట్టుకు మ‌రో షాకిచ్చింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). తొలి వ‌న్డేలో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా భార‌త జ‌ట్టు ఆట‌గాళ్లకు జ‌రిమానా విధించింది. ఒక్కో ఆట‌గాడి మ్యాచ్ ఫీజులో 20 శాతం చొప్పున కోత విధించింది. నిర్ణీత స‌మ‌యం కంటే.. ఎక్కువ స‌మ‌యం తీసుకున్నందుకు ఐసీసీ ఈ శిక్ష విధించింది. విరాట్ కోహ్లీ ఈ తప్పును అంగీకరించాడు. కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. 

టీమ్ఇండియా నిర్ణీత స‌మ‌యంలో ఒక ఓవ‌ర్ త‌క్కువ‌గా వేసింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫ‌రీల ఎలైట్ ప్యానెల్‌కు చెందిన డేవిడ్ బూన్ ఈ జరిమానా విధించిన‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ జట్టయినా.. 210 నిమిషాల్లో 50 ఓవర్ల కోటా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పెనాల్టీ విధిస్తారు. కాగా 50 ఓవర్లు వేయడానికి భారత్ 246 నిమిషాలు తీసుకుందని సమాచారం. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన ఐసీసీ ప్రపంచకప్‌ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం.. స్లో ఓవర్‌ రేట్‌తో బౌలింగ్ చేసిన జట్టు ఒక ఛాంపియన్‌షిప్ పాయింట్‌ను కోల్పోతుంది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సిడ్ని వేదిక‌గా జ‌రిగిన శుక్ర‌వారం జ‌రిగిన తొలి వ‌న్డేలో ఆసీస్ 66 పరుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్ ఆరోన్‌ ఫించ్ (114; 124 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (105 ;66 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్‌ వార్నర్‌ (69 ;76 బంతుల్లో 6ఫోర్లు ), గ్లెన్‌ మాక్స్‌వెల్ (45 ;19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించ‌డంతో ఆసీస్ భారీ స్కోర్ సాధించింది. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీశారు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 66 ప‌రుగుల తేడాతో ఓటమిపాలైంది. హార్దిక్ పాండ్యా(90; 76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), శిఖర్ ధావన్(74 ;86 బంతుల్లో 10 ఫోర్లు) రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు విఫ‌ల‌మ‌వ్వ‌డంతో.. సుదీర్ఘ ప‌ర్య‌ట‌న‌ను భార‌త్ ఓట‌మితో ఆరంభించింది.  ఆసీస్ బౌలర్లలో జంపా నాలుగు, హజల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. స్టార్క్ ఓ వికెట్ తీశాడు. ఇరు జ‌ట్ల మ‌ధ్య  ఆదివారం రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. 

 

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

   28 minutes ago


ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!

   2 hours ago


పాండ్యా సోదరులకు పితృ వియోగం

పాండ్యా సోదరులకు పితృ వియోగం

   9 hours ago


భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్

   15-01-2021


బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శ‌ర్మ గిఫ్ట్

   15-01-2021


భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!

   15-01-2021


ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్

   14-01-2021


క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్

   14-01-2021


మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క

   13-01-2021


అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం

   13-01-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle