ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్‌ని దెబ్బతీస్తుందనుకున్నా... పుజారా
05-04-202105-04-2021 12:31:40 IST
2021-04-05T07:01:40.175Z05-04-2021 2021-04-05T07:01:37.486Z - - 11-04-2021

గత సంవత్సరం ఏ ప్రాంచైజ్ కూడా కొనకపోవడంతో ఐపీఎల్ టోర్నీకి దూరం కావలసి వచ్చిన టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా ఈసారి కనీస ధర అయిన 50 లక్షల రూపాయలకు సీఎస్కే జట్టు తనను సొంతం చేసుకోవడంతో కొండంత ఆశతో సీఎస్కే జట్టులో భాగమయ్యాడు. అయితే కనీస ధర కింద తనను చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు చేయడం సంతోషమే కానీ తోటి ఆటగాడు హనుమ విహారి ఈ సారి ఐపీఎల్లో భాగం కాలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశాడు. హనుమ విహారి కూడా ఐపీఎల్లో భాగమై ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా నుంచి ఐపీఎల్‌ని మిస్సయిన ఏకైక బ్యాట్స్‌మన్ తానేనని పుజారా అంగీకరించాడు. ఈ సారి ఐపీఎల్లో భాగం కానివాడు హనుమ విహారి మాత్రమే. నేను నిజంగా తనకోసం బాధపడుతున్నాను. గత ఐపీఎల్లో అతడు ఆడాడు. ఈ దఫా కూడా తాను ఐపీఎల్లో భాగమై ఉంటే బాగుండేదని పుజారా అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఐపీఎల్లో ఆడితే టెస్టు క్రికెట్లో తన నైపుణ్యం దెబ్బతినిపోతుందని గతంలో భావించానని పుజారా అంగీకరించాడు. క్రికెట్ ప్రాథమిక అంశాలకు కట్టుబడుతూనే పొట్టి క్రికెట్లో పరుగులు తీయడం కూడా ముఖ్యమని పుజారా అంగీకరించాడు. పవర్ హిట్టింగ్‌లో నైపుణ్య లేమి కారణంగా తన స్ట్రయిక్ రేటు గురించి పదే పదే చర్చకు వస్తోందని పుజారా విచారం వ్యక్తంచేశాడు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ, అతడి డిప్యూటీ రోహిత్ శర్మలాగే తాను కూడా టైమింగ్‌పైనే ఆధారపడుతుంటానని చెప్పాడు. క్రికెటర్లకు కరోనా వ్యాక్సిన్.. ఐపీఎల్ కోసమేనా..! స్ట్రయిక్ రేటు విషయానికి వస్తే.. అవును... నేను పవర్ హిట్టర్‌ని కాదు. కానీ అదే సమయంలో మీరు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలనుంచి నేర్చుకోవాల్సి ఉంది. కోహ్లీ పూర్తిగా పవర్ హిట్టర్ కాదు. కానీ బంతిని సకాలంలో గ్రహించి ఆడటంలో పొట్టి క్రికెట్లోనే అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లలో కోహ్లీ ఒకరని పుజారా పేర్కొన్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు స్కిప్పర్ కేన్ విలియమ్సన్ కూడా టైమింగ్ విషయంలో గొప్ప ఉదాహరణగా నిలబడతాడు. కేన్ విలియమ్స్, స్టీవెన్ స్మిత్‌ల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. వీరు అన్ని రకాల షాట్లూ ఆడతారు. అదే సమయంలో వినూత్నమైన ఆటతీరును ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తారు అని పుజారా పేర్కొన్నాడు. నాకూ అలాంటి ఆలోచనా తీరే ఉంది. నేను సక్సెస్ కావాలంటే వినూత్నంగా, భిన్నమైన రీతిలో ఆడాలని భావిస్తాను. అదే సమయంలో క్రికెట్ షాట్లు కొడుతూ రన్స్ కూడా సాధించాల్సి ఉంటుంది. శక్తికొద్దీ బంతిని బాదవలసిన అవసరం ఉంది కాదనను. కానీ క్రికెట్ గురించిన స్పృహతో ఉండటమే మన ప్రధాన శక్తిగా ఉండాలనుకుంటాను అని పుజారా తెలిపాడు. ఐపీఎల్‌కు అలవాటు పడితే టెస్టు క్రికెట్ మజా పోతుందనుకున్నా.. పుజారా తన కెరీర్ మొదట్లో టీ20 అవసరాలకు అనుగుణంగా తన ఆటను మార్చుకున్నట్లయితే తన టెస్టు క్రికెట్ నైపుణ్యాలు దెబ్బతింటాయని భయపడేవాడినని 33 ఏళ్ల వెటరన్ క్రికెటర్ అంగీరించాడు. అయితే అనుభవంమీదే గుణపాఠాలు నేర్చుకుంటాము. గతంలో టి20 ఫార్మాట్లో ఆడేటప్పుడు, తన టెస్టు క్రికెట్ ప్రావీణ్యత దెబ్బతింటుందని భావించేవాడిని. ఈ ఆలోచనతో కొనసాగడంతో ఐపీఎల్ ముగియగానే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని పుజారా చెప్పాడు. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితినుంచి నేను బయటపడ్డాను. గత కొంతకాలంగా నేను గుర్తించింది ఏమిటంటే నా సహజసిద్ధమైన ఆటతీరు, నా బలాలు ఏ ఫార్మాట్లో ఆడినా క్షీణించిపోవని గ్రహించడమే అని పుజారా పేర్కొన్నాడు.

దటీజ్ డివీలియర్స్.. లారా.. హేడెన్‌ల ప్రశంసల జల్లు
16 hours ago

కోహ్లీ జాగ్రత్త..!
17 hours ago

మొదటి మ్యాచ్ ఆర్సీబీదే..!
a day ago

IPL 2021: ముంబై ఇండియన్స్.. అతి విశ్వాసం ప్రమాదకరం.. ప్రజ్ఞాన్ ఓజా
09-04-2021

IPL 2021 : ఐపీఎల్ టైం ఆగాయా
09-04-2021

వాంఖడేలో మ్యాచ్ లు అవసరం లేదంటున్న స్థానికులు..!
08-04-2021

ఐపీఎల్ కోసం ఎంతో వెయిటింగ్.. మరో స్టార్ కు కరోనా పాజిటివ్..!
08-04-2021

ముంబై ఇండియన్స్ శిబిరంలో కరోనా కలకలం
07-04-2021

ఫృధ్వీలో ఉండే అతి చెడ్డ గుణం అదే.. రికీ పాంటింగ్ వ్యాఖ్య
06-04-2021

ఐపీఎల్ ను వాయిదా వేసే అవకాశమే లేదు: సౌరవ్ గంగూలీ
05-04-2021
ఇంకా