newssting
Radio
BITING NEWS :
కరోనా ఎండమిక్‌ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసస్‌ హెచ్చరించారు. కరోనా వైరస్‌ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. * దేశంలో బీజేపీని జాతీయ స్థాయిలో ఓడించడంలో కాంగ్రెస్‌ది కీలకస్థానమని, కానీ ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వానికి (గాంధీ కుటుంబం) అంత శక్తి లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభిప్రాయపడ్డారు. * అఖిల భారత సర్వీసుల(ఏఐఎస్‌) కేడర్‌ రూల్స్‌–1954కు కేంద్రం ప్రతిపాదించిన సవర ణలు రాజ్యాంగానికి, సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ధ్వజ మెత్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసేలా ఆ సవరణలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. * రాష్ట్ర మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విపరీత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం ఆయన్ని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, కొద్దిసేపటి తర్వాత నోటీసులు ఇచ్చి వదిలేశారు. * ఐపీఎల్‌ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్‌ గొయెంకా సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

తొలి విజయాన్ని అందుకున్న హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌

10-04-202210-04-2022 06:45:50 IST
2022-04-10T01:15:50.975Z10-04-2022 2022-04-10T01:15:47.494Z - - 08-08-2022

తొలి విజయాన్ని అందుకున్న హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు వరస ఓటముల తర్వాత ఐపీఎల్‌–2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌ కింగ్స్‌కిది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ (35 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం హైదరాబాద్‌ 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 155 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (50 బంతుల్లో 75; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్‌ త్రిపాఠి (15 బంతుల్లో 39 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (40 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.  

ఓపెనర్ల వైఫల్యంతో చెన్నైకి టోర్నీలో మరోసారి చెప్పుకోదగ్గ ఆరంభం లభించలేదు. ఉతప్ప (15)ను అవుట్‌ చేసి సుందర్‌ తొలి దెబ్బ కొట్టగా, నటరాజన్‌ తన మొదటి బంతికే రుతురాజ్‌ (16)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో అలీ, అంబటి రాయుడు (27 బంతుల్లో 27; 4 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు 50 బంతుల్లో 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత మరో 2 పరుగుల వ్యవధిలోనే చెన్నై అలీ, దూబే (3) వికెట్లు కోల్పోయింది. ధోని (3) కూడా విఫలం కాగా, చివర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో చెన్నై కనీస స్కోరైనా చేయగలిగింది.  


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle