క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
14-01-202114-01-2021 14:13:31 IST
2021-01-14T08:43:31.338Z14-01-2021 2021-01-14T08:43:24.834Z - - 24-01-2021

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి దుర్బేధ్యమైన ఆసీస్ బౌలింగ్ త్రయాన్ని ఎదిరించి గాయాలను కూడా లెక్క చేయకుండా సిడ్నీ టెస్టులో జట్టు ప్రయోజనాల కోసం హనుమ విహారి చూపిన పట్టుదల, మొక్కవోని స్థైర్యానికి యావద్దేశం నీరాజనాలు అర్పిస్తుండగా కేంద్రమంత్రి విహారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసి నెటిజన్ల చేతిలో పడ్డారు. భారత్, ఆసీస్ మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఒకవైపు కండరాలు పట్టేసినప్పటికీ పంటిబిగువన నొప్పిని భరిస్తూ 161 బంతులను అడ్డుకున్న హనుమ విహారిపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపించింది. కానీ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి, మాజీ గాయకుడు బాబుల్ సుప్రియో మాత్రం భారత జట్టుకు విజయావకాశాలు దక్కనీయకుండా విహారి నేరం చేశాడని ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్య చేశాడు. 109 బంతులాడి చేసింది 7 పరుగులు. ఇంతకంటే దారుణం ఉండదు. హనుమ బిహారి (తప్పుగా) భారత్ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకోవడాన్ని మాత్రమే నాశనం చేయలేదు.. క్రికెట్‌ను కూడా ఖూనీ చేశాడు అంటూ మంత్రి ట్వీట్ చేశాడు. దీనిపైనే ట్విట్టర్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సుప్రియో అజ్ఞానాన్ని నెటిజన్లు తిట్టిపోశారు. అయితే విహారి దీనికి ఒకే ఒక పదంతో సమాధానం ఇచ్చాడు. ఇది బుధవారం సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. కేంద్ర మంత్రి తన పేరును హనుమ బిహారి అని తప్పుగా రాయడాన్ని విహారి చూపిస్తూ తన పేరు హనుమ విహారి అని స్వయంగా ట్వీట్ చేశాడు. దీనికి సుమారుగా 64 వేల లైక్‌లు వచ్చాయి. మరోవైపున విహారితోపాటు మూడో టెస్టు డ్రా కావడంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం మంత్రి వ్యాఖ్యకు పడిపడి నవ్వుతున్నట్లు ట్వీట్ చేసాఢు. దీనికి కూడా 80 వేల లైకులు రావడం విశేషం. ఇక టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా విహారి ఏకవాక్య స్పందనను మెచ్చుకున్నాడు. ఒక్క విహారి అందరి లెక్క సరి చేశాడు అంటూ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. తనకు క్రికెట్‌పై ఎలాంటి అవగాహన లేదంటూనే.. ఆ మ్యాచ్‌లో విహారి దారుణంగా ఆడాడంటూ మంత్రి బాబుల్ చేసిన విమర్శనాత్మక ట్వీట్‌పై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.

టెస్ట్ మ్యాచ్ లలో ప్రేక్షకులకు అనుమతి లేనట్లే
5 hours ago

నటరాజన్ ను ఊరేగించిన గ్రామస్థులు..!
19 hours ago

ధోనీతో పోల్చవద్దు.. నాదైన స్థానం కావాలి.. రిషబ్ పంత్
22-01-2021

హైదరాబాద్ కు రాగానే.. తండ్రి సమాధి చెంతకు..!
21-01-2021

ఐపీఎల్ 2021 కౌంట్ డౌన్ మొదలైంది.. ఫ్రాంచైజీలు రిలీజ్, రిటైన్ చేసుకుంది ఎవరినంటే
21-01-2021

శుభమన్ గిల్ తండ్రి బాధ అదొక్కటే.. సెహ్వాగ్ కౌంటర్..!
20-01-2021

టీమిండియాను.. ఇకెన్నడూ తక్కువగా అంచనా వేయం.. ఆసీస్ కోచ్ లాంగర్
20-01-2021

ఉద్వేగానికి లోనైన రవి శాస్త్రి.. అద్భుత విజయంపై రహానే ఏమన్నాడంటే
19-01-2021

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక
19-01-2021

టీమిండియా గెలుపు దేశానికి గర్వకారణం.. మోదీతో సహా దిగ్గజాల ప్రశంసలు
19-01-2021
ఇంకా