ఐసీసీకి కొత్త ఛైర్మన్ వచ్చేశాడు
25-11-202025-11-2020 18:25:09 IST
2020-11-25T12:55:09.056Z25-11-2020 2020-11-25T12:55:05.764Z - - 16-01-2021

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నూతన ఛైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే ఎన్నికయ్యారు. ఐసీసీ నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల మెజార్టీ సాధించడంతో.. గ్రెగ్ ఈ పదవిని దక్కించుకున్నాడు. ఛైర్మన్ పదవికి తనతో పాటు పోటీ చేసిన తాత్కాలిక ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజాపై 11-5 ఓట్ల తేడాతో పైచేయి సాధించి స్వతంత్ర ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. శశాంక్ మనోహర్ తర్వాత ఎన్నికైన రెండో స్వతంత్ర ఛైర్మన్‌గా నిలవనున్నారు. గ్రెగ్ ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్న ఖవాజా తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఈ ఎన్నికలోని తొలి రౌండ్లో బార్క్లేకు 10 ఓట్లు, ఖవాజాకు 6 ఓట్లు మాత్రమే దక్కాయి. రెండో రౌండ్లో దక్షిణాఫ్రికా బోర్డు.. బార్క్లేకు మద్దతు తెలపడం వల్ల ఐసీసీ నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన బార్క్లే ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రెగ్ బార్క్లే మాట్లాడుతూ.. ఐసీసీ ఛైర్మన్‌గా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నాడు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. మహమ్మారి వల్ల ఏర్పడిన ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కలిసికట్టుగా పనిచేసి పురోగతి సాధిస్తామని ఆశిస్తున్నట్లు తెలిపాడు. కరోనా కష్టకాలంలో ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఖవాజాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2012 నుంచి న్యూజిలాండ్ క్రికెట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బార్క్లే న్యాయవాదిగా పనిచేశారు. అంతేగాక 2015 ప్రపంచకప్ డైరెక్టర్‌గా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని కొన్ని బోర్డులకు డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. అంతకుముందు జులైలో మనోహర్ పదవీ కాలం ముగియడంతో ఖవాజా తాత్కాలికంగా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే.

ఆ షాట్ ఎలా ఆడాలని అనుకున్నావ్ రోహిత్..!
an hour ago

పాండ్యా సోదరులకు పితృ వియోగం
8 hours ago

భారత్ దూకుడును అడ్డుకున్న లబుషేన్
15-01-2021

బిగ్ బాస్ అభిజిత్ కి రోహిత్ శర్మ గిఫ్ట్
15-01-2021

భారత ఆటగాళ్లకు అమ్మాయిలు పుట్టడంపై అమితాబ్ ట్వీట్..!
15-01-2021

ధోనీ ఫామ్ హౌస్‌లో హైదరాబాద్ కోళ్లు.. బర్డ్ ప్లూతో ఆర్టర్ క్యాన్సిల్
14-01-2021

క్రికెట్‌ను చంపేశాడు.. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు విహారి క్లాస్
14-01-2021

మా బిడ్డకు ప్రైవసీ ఇవ్వండి.. అర్థం చేసుకోండి అంటున్న విరాట్-అనుష్క
13-01-2021

అశ్విన్‌పై వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నా.. అసీస్ కెప్టెన్ పశ్చాత్తాపం
13-01-2021

ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానన్న వీరూ..!
13-01-2021
ఇంకా