newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డబుల్ సెంచరీ మిస్.. 193 పరుగుల వద్ద రనౌట్

05-04-202105-04-2021 16:39:30 IST
Updated On 05-04-2021 13:12:32 ISTUpdated On 05-04-20212021-04-05T11:09:30.163Z05-04-2021 2021-04-05T03:49:07.617Z - 2021-04-05T07:42:32.939Z - 05-04-2021

డబుల్ సెంచరీ మిస్.. 193 పరుగుల వద్ద రనౌట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పాకిస్థాన్ క్రికెటర్ ఫఖర్ జమాన్ ప్రపంచ రికార్డును సాధించాడు. ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికాతో రెండో వన్డేలో ఫఖర్ జమాన్ ఛేజింగ్ లో ఏకంగా 193 పరుగులు చేసి, డబుల్ సెంచరీకి 7 పరుగుల దూరంలో ఆగిపోయాడు. అది కూడా అనూహ్యంగా రనౌట్ అయ్యి వెనుదిరిగాడు. ఫఖర్ జమాన్ 192 పరుగులతో ఆడుతున్న సమయంలో షాట్ ఆడాడు.. అప్పుడు డబుల్ తిరుగుతూ ఉన్నాడు.

ఆ సమయంలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ నాన్ స్ట్రైక్ వైపు చేతిని చూపించాడు.. నాన్ స్ట్రైక్ కు బాల్ త్రో చేశాడేమోనని ఫఖర్ జమాన్ కాస్త నిదానంగా రెండో రన్ పూర్తీ చేద్దామని అనుకున్నాడు. కానీ మార్క్రమ్ ఏకంగా డైరెక్ట్ త్రో వేశాడు. దీంతో రెండో రన్ పూర్తీ కాకుండానే ఫఖర్ జమాన్ రనౌట్ అయ్యాడు. దీంతో డబుల్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ (155 బంతుల్లో 193; 18 ఫోర్లు, 10 సిక్స్‌లు) అద్భుతంగా ఆడాడు. మిగిలిన ఆటగాళ్లెవరూ పెద్దగా రాణించకపోవడంతో  దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్‌ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ఐపీఎల్ ను కమ్మేస్తున్న కరోనా..!

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసి ఓడింది. చివరి ఓవర్లో పాక్‌ విజయానికి 30 పరుగులు అవసరం ఉండగా... తొలి బంతికే ఫఖర్‌ అవుట్‌ కావడంతో పాక్‌ ఓటమి ఖాయమైంది. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. డికాక్‌ (80; 10 ఫోర్లు, సిక్స్‌), బవూ మా (92; 9 ఫోర్లు), డస్సెన్‌ (37 బంతుల్లో 60; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిల్లర్‌ (27 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం చెరో విజయంతో పాక్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది.

ఈ మ్యాచ్ లో ఆడిన ఇన్నింగ్స్ ద్వారా  ఫఖర్ జమాన్ ఛేజింగ్ సమయంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వాట్సన్ పేరిట ఉండేది. వాట్సన్ బంగ్లాదేశ్ పై 185 పరుగులు చేయగా, ఆ రికార్డును జమాన్ తిరగరాశాడు. షేన్ వాట్సన్ తర్వాత ధోని, విరాట్ కోహ్లీలు ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle