newssting
Radio
BITING NEWS :
ఏపీలో జరుగుతున్న విగ్రహాల విధ్వంసాల వెనుక బీజేపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ గౌతమ్ సవాంగ్. డీజీపీ వ్యాఖ్యలపై సోము వీర్రాజు అభ్యంతరం, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు. 200 మంది బీజేపీ కార్యకర్తలు అరెస్ట్, మంగళగిరి పీఎస్ కు తరలింపు. * కృష్ణాజిల్లా కంచికచర్లలో హవాలా నగదు కలకలం. సరైన పత్రాలు లేకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్న కోటి రూపాయల నగదు స్వాధీనం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. * తిరుపతిలో టీడీపీ ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి రద్దు. ర్యాలీకి నిబంధనలు పాటించలేదని అనుమతి రద్దు చేసిన పోలీసులు. విజయసాయిరెడ్డిని ఏ చట్టం కింద రామతీర్థానికి అనుమతించారని ప్రశ్నించిన చంద్రబాబు. * హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్ అమెరికా కార్యక్రమం ప్రారంభం. * కూకట్ పల్లిలో దారుణం. టీవీ చూస్తున్న కన్నకొడుకుని దారుణంగా హతమార్చిన తండ్రి. ఈ నెల 18న కొడుకు చరణ్ కు నిప్పుపెట్టిన తండ్రి. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం చరణ్ మృతి. * హుజూరాబాద్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురిని హతమార్చిన భర్త. పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్.

బ్రిస్బేన్‌లో టెస్టు ఆడతాం కానీ.. బీసీసీఐ మెలిక

10-01-202110-01-2021 16:55:54 IST
2021-01-10T11:25:54.295Z10-01-2021 2021-01-10T11:25:52.333Z - - 21-01-2021

బ్రిస్బేన్‌లో టెస్టు ఆడతాం కానీ.. బీసీసీఐ మెలిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు వేదిక విషయంలో గత మూడు రోజులుగా సాగుతూ వచ్చిన సందిగ్ధత వీడింది. బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్‌ ఆడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ సమాచారం అందించింది. అయితే మ్యాచ్‌ ముగిశాక ఒక్క రోజు కూడా తాము అక్కడ ఉండబోమని, వెంటనే భారత్‌కు వెళ్లిపోయే ఏర్పాట్లు చేయాలని కోరింది.

చివరి టెస్టు ముగిసిన వెంటనే భారత్‌కు తిరిగి వెళ్లే ఏర్పాట్లు చేయమని వారిని కోరాం. అందుబాటులో ఉన్న మొదటి ఫ్లయిట్‌లోనే పంపిస్తే మంచిది. వీలుంటే మ్యాచ్‌ ముగిసిన రాత్రి కూడా అక్కడ ఆగకుండా బయల్దేరాలని భావిస్తున్నాం అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

మరోవైపు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో ప్రేక్షకులను అనుమతించడం లేదని భారతక్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. కఠిన బయో బబుల్‌ వాతావరణంలో క్రికెటర్లు ఉండబోతున్నారని, ఇలాంటి స్థితిలో తాము రిస్క్‌ తీసుకోలేం కాబట్టి అభిమానులను ఒక్క మ్యాచ్‌కూ అనుమతించమని వెల్లడించింది.

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ముగిసిన వెంటనే అఘమేఘాలమీద బారత జట్టును స్వదేశం పంపే ఏర్పాటుకు హామీ ఇవ్వాలని బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది. ఆట ముగిసిన మరుక్షణమే భారత ఆటగాళ్లు స్వదేశానికి బయలు దేరుతారు. వీలయితే రాత్రిపూట కూడా అక్కడ ఉండకుండా మావాళ్లు బయలుదేరతారు అని బీసీసీఐ స్పష్టం చేసింది.

బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడటానికి కానీ, అక్కడ కరోనా నేపథ్యంలో ఆరోగ్యపరమైన ప్రోటోకాల్ పాటించడాన్ని కానీ మేము ఎన్నడూ అభ్యంతరపెట్టలేదు. నాలుగో టెస్టు కచ్చితంగా జరుగుతుంది క్రికెట్ ఆస్ట్రేలియా స్థానిక ప్రభుత్వంతో విధివిధానాల గురించి చర్చిస్తోంది. క్వీన్స్‌లాండ్‌లో మూడురోజుల పాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఆట సాధ్యాసాధ్యాల గురించి వారే ఒక నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది.

 

ఐపీఎల్ 2021 కౌంట్ డౌన్ మొదలైంది.. ఫ్రాంచైజీలు రిలీజ్, రిటైన్ చేసుకుంది ఎవరినంటే

ఐపీఎల్ 2021 కౌంట్ డౌన్ మొదలైంది.. ఫ్రాంచైజీలు రిలీజ్, రిటైన్ చేసుకుంది ఎవరినంటే

   5 hours ago


శుభమన్ గిల్ తండ్రి బాధ అదొక్కటే.. సెహ్వాగ్ కౌంటర్..!

శుభమన్ గిల్ తండ్రి బాధ అదొక్కటే.. సెహ్వాగ్ కౌంటర్..!

   17 hours ago


టీమిండియాను.. ఇకెన్నడూ తక్కువగా అంచనా వేయం.. ఆసీస్ కోచ్ లాంగర్

టీమిండియాను.. ఇకెన్నడూ తక్కువగా అంచనా వేయం.. ఆసీస్ కోచ్ లాంగర్

   20-01-2021


ఉద్వేగానికి లోనైన రవి శాస్త్రి.. అద్భుత విజయంపై రహానే ఏమన్నాడంటే

ఉద్వేగానికి లోనైన రవి శాస్త్రి.. అద్భుత విజయంపై రహానే ఏమన్నాడంటే

   19-01-2021


ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక

ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక

   19-01-2021


టీమిండియా గెలుపు దేశానికి గర్వకారణం.. మోదీతో సహా దిగ్గజాల ప్రశంసలు

టీమిండియా గెలుపు దేశానికి గర్వకారణం.. మోదీతో సహా దిగ్గజాల ప్రశంసలు

   19-01-2021


యువ ఇండియా సాధించిన అద్భుత విజయం.. గవాస్కర్ వ్యాఖ్య

యువ ఇండియా సాధించిన అద్భుత విజయం.. గవాస్కర్ వ్యాఖ్య

   19-01-2021


బ్రిస్బేన్ టెస్ట్.. వర్షం వస్తుందా.. ఫలితం వస్తుందా..?

బ్రిస్బేన్ టెస్ట్.. వర్షం వస్తుందా.. ఫలితం వస్తుందా..?

   18-01-2021


భారత ఆటతీరుకు ఫిదా అవుతున్న క్రికెట్ లెజెండ్స్

భారత ఆటతీరుకు ఫిదా అవుతున్న క్రికెట్ లెజెండ్స్

   17-01-2021


విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

విమర్శలకు సమాధానం ఇచ్చిన రోహిత్

   16-01-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle