ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టు ఎంపిక
19-01-202119-01-2021 22:37:53 IST
Updated On 20-01-2021 10:30:33 ISTUpdated On 20-01-20212021-01-19T17:07:53.918Z19-01-2021 2021-01-19T17:07:38.304Z - 2021-01-20T05:00:33.714Z - 20-01-2021

బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న భారతజట్టుకు ఇంగ్లాండ్ సిరీస్ సవాల్ ఎదురుకానుంది. అది కూడా ఫిబ్రవరి నెలలోనే..! ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం భారతజట్టును ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. కోహ్లీ ఇటీవల పితృత్వపు సెలవుపై ఆస్ట్రేలియా నుంచి భారత్ వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో నాలుగు టెస్టుల సిరీస్ సందర్భంగా తొలి రెండు టెస్టులకు భారత జట్టును ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్సీలో 18 మందితో జట్టును ప్రకటించారు. హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ లకు స్థానం లభించింది. ఆస్ట్రేలియాతో సిరీస్ లో దారుణంగా విఫలమైన యువ ఓపెనర్ పృథ్వీషాను జట్టు నుంచి తప్పించారు. గాయాల నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చారు. గాయాల నుంచి కోలుకోని ఉమేశ్ యాదవ్, షమీ, విహారి, జడేజాలకు సెలెక్టర్లు ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు విశ్రాంతి ఇచ్చారు. ఆంధ్రా క్రికెట్ జట్టు వికెట్ కీపర్ కేఎస్ భరత్ ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు స్టాండ్ బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. తొలి రెండు టెస్ట్ లకు ప్రకటించిన భారతజట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్. స్టాండ్ బై ఆటగాళ్లు: కేఎస్ భరత్, అభిమన్యు ఈశ్వరన్, షాబాజ్ నదీమ్, రాహుల్ చహర్, ప్రియాంక్ పాంచల్. నెట్ బౌలర్లు: అంకిత్ రాజ్ పుత్, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరభ్ కుమార్. భారత్ లో ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌కు జాతీయ సెలెక్షన్ కమిటీ మంగళవారం సాయంత్రం భారత జట్టును ప్రకటించింది.

ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో భారత్ విన్
15 hours ago

మరో సారి ధోని వారసుడు అంటూ.. పంత్ పై ప్రముఖుల ట్వీట్ల వర్షం
17 hours ago

5 బంతుల్లో ఆఖరి మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సుందర్ సెంచరీ మిస్
20 hours ago

సెహ్వాగ్ వీర విహారం.. ఇండియా లెజెండ్స్ ఘన విజయం..!
20 hours ago

పంత్ సూపర్ సెంచరీ.. లీడ్ లో భారత్..!
05-03-2021

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
04-03-2021

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
04-03-2021

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
03-03-2021

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-2021
ఇంకా