newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

భారత్‌–ఇంగ్లండ్‌ సిరీస్‌ మన దేశంలోనే.. గంగూలీ

29-09-202029-09-2020 09:41:30 IST
2020-09-29T04:11:30.926Z29-09-2020 2020-09-29T04:11:28.287Z - - 25-10-2020

భారత్‌–ఇంగ్లండ్‌ సిరీస్‌ మన దేశంలోనే.. గంగూలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కోవిడ్-19 పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తూనే, వచ్చే జనవరి-ఫిబ్రవరిలో భారత్- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సీరీస్‌ని స్వదేశంలోని నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఈ సిరీస్‌ను యూఏఈలో నిర్వహించే విధంగా అక్కడి బోర్డులో బీసీసీఐ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నప్పటికీ... మన దేశంలో నిర్వహించాలనేదే తమ ఆలోచన అని గంగూలీ చెప్పాడు. 

ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 5 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు జరగాల్సి ఉంది. భారత గడ్డపై దీనిని జరిపేందుకే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాం. యూఏఈ తరహాలో మన నగరాల్లోని మైదానాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి బయో బబుల్‌ను ఏర్పాటు చేయవచ్చు. క్రికెట్‌ భారత్‌లో జరగాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడేమీ చెప్పలేం అని గంగూలీ పేర్కొన్నాడు.

కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో క్రికెట్ వ్యవహారంలో గత ఆరు నెలలుగా పరిస్థితేం బాగా లేదు. అటు ఆట జరిగాలి. ఇటు జీవితాలూ నిలవాలి కాబట్టి అన్నీ ఆలోచించాల్సి ఉంటుంది. ఐపీఎల్‌ జరిగేందుకు ఏమాత్రం అవకాశం లేదని భావించిన సమయంలో మేం దానిని నిర్వహిం చి చూపించడం సంతోషంగా ఉంది’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. 

తన మార్గదర్శనంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తాయనే విమర్శలపై కూడా ‘దాదా’ పెదవి విప్పాడు. సుమారు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన తను అయ్యరే కాదు, కోహ్లి... ఇంకే ఆటగాడు అడిగినా సాయమందిస్తానని చెప్పాడు. అంత మాత్రాన దీనికి విరుద్ధ ప్రయోజనాలు అపాదించడం తగదని హితవు పలికాడు.  

మరోవైపు ధోని సాధించిన ఘనతలను బట్టి చూస్తే అతనిడి అన్ని విధాలా గౌరవించుకోవాలన్న గంగూలీ... ప్రస్తుత పరిస్థితుల్లో ధోని వీడ్కోలు మ్యాచ్‌ విషయంపై మాత్రం ఏమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. 

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే మహేంద్ర సింగ్ ధోనీతో మాట్లాడాను. కానీ ఐపీఎల్ సీజన్‌లో నేరుగా తనను కలిసి మాట్లాడే వీలులేదు. వారంతా బయో బబుల్‌లో ఉంటున్నారు కాబట్టి ఏ విషయంలోనైనా సంప్రదింపులకు తావు లేదని గంగూలీ చెప్పాడు. కానీ భారత్‌కు తాను సాధించిపెట్టిన విజయాలను గమనిస్తే ధోనీ అన్నింటికీ అర్హుడేనని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అయితే కోవిడ్ కారణంగా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని ఏమాత్రం ఊహించలేమని, నువ్వు వచ్చి పలానా ఆట ఆడు అని చెప్పడానికి ఇప్పడు అసాధ్యమని గంగూలీ పేర్కొన్నాడు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle