newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్

04-03-202104-03-2021 16:05:00 IST
Updated On 04-03-2021 16:15:39 ISTUpdated On 04-03-20212021-03-04T10:35:00.127Z04-03-2021 2021-03-04T10:34:56.068Z - 2021-03-04T10:45:39.827Z - 04-03-2021

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టీమిండియాతో జరుగనున్న నాలుగో టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ చేయడంతో ఇంగ్లాండ్ 205 పరుగులు మొదటి ఇన్నింగ్స్ లో చేసింది. అక్షర్ పటేల్ కు నాలుగు వికెట్లు, అశ్విన్ కు మూడు, మొహమ్మద్ సిరాజ్ కు రెండు, సుందర్ కు ఒక వికెట్ దక్కాయి. 

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ కు అక్షర్ పటేల్ 5వ ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన 5వ ఓవర్‌ రెండో బంతి సిబ్లీ బ్యాట్‌ మధ్యలో నుంచి వెళ్లి నేరుగా వికెట్లను తాకింది. దీంతో ఇంగ్లండ్‌ 10 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. రెండు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు సిబ్లీ.  అక్షర్‌ వేసిన రెండో ఓవర్‌లో 9 పరుగులు చేసిన జాక్‌ క్రాలే భారీ షాట్‌కు యత్నించి సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్‌ 15 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. మహ్మద్‌ సిరాజ్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌ తొలి బంతికే రూట్‌ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ 30 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది. లంచ్‌ విరామ సమయానికి ఇంగ్లండ్‌ జట్టు 25 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ 78 పరుగుల వద్ద బెయిర్ స్టో నాలుగో వికెట్ ను‌ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసిన అనంతరం బెన్ స్టోక్స్ కూడా పెవిలియన్ చేరాడు. 55 పరుగులు చేసిన స్టోక్స్ ను సుందర్ పెవిలియన్ కు పంపాడు. 

అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 61వ ఓవర్‌ మూడో బంతిని ఓలీ పోప్‌ ఫ్లిక్‌ చేయగా.. ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయి షార్ట్‌ లెగ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ చేతిలో పడింది. దీంతో ఇంగ్లండ్‌ 166 పరుగులు వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత స్వల్ప విరామాల్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పెవిలియన్ కు చేరడంతో 205 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle