newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

11-04-202111-04-2021 17:15:24 IST
2021-04-11T11:45:24.524Z11-04-2021 2021-04-11T03:22:18.234Z - - 15-05-2021

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో ఈ ఏడాది ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ దృఢ సంకల్పంతో ఉంది. అయితే మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ కు అంతగా కలిసి రాలేదు. ఫీల్డింగ్ లో చెన్నై ఆటగాళ్లు చాలా తప్పులు చేశారు. దీంతో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా కోపం వచ్చేసింది. ఓపెనర్ పృథ్వీ షాఇచ్చిన క్యాచ్‌ని సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిచెల్ శాంట్నర్ వదిలేశాడు. అతని ఫీల్డింగ్ చూసిన ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్యాచ్ వదిలే సమయానికి  20 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు పృథ్వీ షా.  అతని క్యాచ్ వదిలేయడంతో ధోనీ కాస్త సహనం కోల్పోయాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా పృథ్వీ షా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి ఎక్కువ ఎత్తులో గాల్లోకి లేచింది. లాంగాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ మిచెల్ శాంట్నర్.. ఆ బంతిని క్యాచ్‌గా అందుకోవడంలో విఫలమయ్యాడు. ముందుకు డైవ్ చేయగా.. అతని చేతిలో పడిన బంతి బౌన్స్ అయ్యి నేలపాలైంది. 10వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చిన మొయిన్ అలీ బౌలింగ్‌లో మరోసారి పృథ్వీ షా క్యాచ్ ఇచ్చాడు. ఈ సారి రుతురాజ్ గైక్వాడ్ ఆ క్యాచ్‌ని చేజార్చాడు. దీంతో పృథ్వీ షా చెలరేగి ఆడాడు. తన జట్టుకు కావాల్సిన పరుగులను అవలీలగా చేస్తూ వెళ్ళిపోయాడు. 

మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ తమ బౌలింగ్ మెరుగుపడాలని చెప్పుకొచ్చాడు. పిచ్‌పై డ్యూ (మంచు) కనబడిందని..ఇది మొదట  బ్యాటింగ్‌ చేసిన జట్టుపై చాలా ప్రభావం చూపుతుందని అనుకున్నామని.. మంచు పిచ్‌పై ఉంటే అది ఛేజింగ్‌ జట్టుకే అనుకూలంగా ఉంటుందనేది కాదనలేని వాస్తవమని తెలిపాడు ధోని. టాస్‌ ఓడిపోయినప్పటికీ ఈ పిచ్‌పై సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే అనుకున్నామని.. అలాగే తొలి అరగంట చాలా జాగ్రత్తగా ఆడాలనుకున్నా అది వీలుపడలేదని ధోని చెప్పుకొచ్చాడు. మేం సాధ్యమైనన్ని ఎక్కువ పరుగుల్ని బోర్డుపై ఉంచాలనే అనుకున్నామని.. అదే లక్ష్యంతో బ్యాటింగ్‌ చేశాం.. ఇంకా 15-20 పరుగులు చేసి ఉంటే బాగుండేదని తెలిపాడు. మాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మంచు ఉండటంతో బంతి గమనంపై అంచనా దొరకదని.. బంతి ఆగుతూ వస్తుంది. ఫలితంగా ఆరంభంలో కీలక వికెట్లను చేజార్చుకున్నాం. అయినా మా బ్యాటర్స్‌ బాగా ఆడారు. మా బౌలింగ్‌ ఇంకా మెరుగుపడాలి.. బౌలర్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉందని కాస్త అసహనం వ్యక్తం చేశాడు ధోని. వారు ప్రత్యర్థికి బౌండరీలు ఇవ్వడమే లక్ష్యంగా బంతులు వేసినట్లు కనబడిందని.. తదుపరి మ్యాచ్‌లకు ఈ మ్యాచ్‌ ఒక గుణపాఠమన్నాడు. ఈ తరహా పిచ్‌పై 200 పరుగులు ఉంటేనే గెలుస్తాం.. ఢిల్లీ బౌలర్లు మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు వేశారు. ఈ తరహా పిచ్‌పై ఏ బంతులు వేయాలో అవే వేసి సక్సెస్‌ అయ్యారని అన్నాడు. మా ఓపెనర్లకు ఢిల్లీ బౌలర్లు వేసిన బాల్స్‌ నిజంగా అద్భుతమని ధోని మెచ్చుకున్నాడు. తర్వాతి మ్యాచ్ లలో తప్పకుండా పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు ధోని. 

 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle