newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కోహ్లీ సేనకు కూడా కరోనా టెన్షన్.. ఆ యంగ్ క్రికెటర్ కు కరోనా

04-04-202104-04-2021 18:21:09 IST
2021-04-04T12:51:09.838Z04-04-2021 2021-04-04T08:05:49.657Z - - 20-04-2021

కోహ్లీ సేనకు కూడా కరోనా టెన్షన్.. ఆ యంగ్ క్రికెటర్ కు కరోనా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ లో కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే..! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ కొట్టాలనే ఆశ ఇంకా తీరలేదు. ఈ సీజన్ లో అయినా తప్పకుండా టైటిల్ నెగ్గాలని ఆర్సీబీ భావిస్తోంది. ఇంతలోనే ఆ జట్టు యంగ్ క్రికెటర్, దేశవాళీ సంచలనం దేవదత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డాడు. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ క‌రోనా బారిన ప‌డ్డాడని టీమ్ మేనేజ్మెంట్ చెబుతోంది. ప్ర‌స్తుతం అత‌డు క్వారంటైన్‌లో ఉన్నాడు. దీంతో బెంగ‌ళూరు శిబిరంలో ఆందోళన మొద‌లైంది. గ‌తేడాదే ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన ఈ ఆట‌గాడు అద‌ర‌గొట్టాడు. 15 మ్యాచుల్లో 31.53 సగ‌టుతో 473 ప‌రుగులు సాధించాడు. ఇటీవ‌ల ముగిసిన విజ‌య్ హ‌జారే ట్రోఫీలో 737 ప‌రుగుల‌తో టోర్నీలో రెండో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ‌ఈసారి కూడా అతడు రాణిస్తే జట్టు మంచి ఫలితాలు సాధించడం కష్టమేమీ కాదు. వచ్చే శుక్రవారం మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.. ఆ మ్యాచ్ సమయానికి పడిక్కల్ అందుబాటులోకి రావడం కష్టమే..!   

ఇప్ప‌టికే ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లేయ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ కూడా క‌‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక ఇంత‌కుముందు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్ నితీష్ రాణా.. దాని నుంచి కోలుకొని మ‌ళ్లీ టీమ్‌తో చేరాడు. అటు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను కరోనా వ‌ద‌ల్లేదు. కంటెంట్ టీమ్‌లోని స‌భ్యుడు ఒక‌రు క‌రోనా బారిన ప‌డ్డాడు. వాంఖడే స్టేడియంలో 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఐపీఎల్ పోటీల నిర్వహణ కోసం బీసీసీఐ నియమించిన ఆరుగురు ఈవెంట్ మేనేజర్లకు కూడా కరోనా సోకింది. కరోనా సోకిన వారందరినీ ఇళ్లకు పంపించి వేసి, వారి స్థానంలో కొత్త సిబ్బందిని తీసుకున్నారు. ఆటగాళ్లందరూ బయో బబుల్ లో ఉన్నారని, పైగా ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తున్నందున టోర్నీని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తామని బీసీసీఐ చెబుతోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతే హైదరాబాద్, ఇండోర్ నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.  ఇక ఆటగాళ్లకు కరోనా సోకడంతో నిర్వాహకులు షాక్ అవుతూ ఉన్నారు. కోల్ కతా నైట్ రైడర్స్‌ ఆటగాడు నితీష్‌ రాణాకు కరోనా సోకగా.. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు కరోనా వైరస్‌ సోకింది. అక్షర్‌కు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందనే  విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం ప్రకటించింది. అక్షర్‌కు కరోనా  వైరస్‌ సోకిందని.. ఇది చాలా దురదృష్టకరమని ఐపీఎల్ ఫ్రాంచైజీ తెలిపింది.   ప్రొటోకాల్ ప్రకారం అక్షర్‌ ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle