newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ

19-04-202119-04-2021 08:22:21 IST
Updated On 19-04-2021 09:58:47 ISTUpdated On 19-04-20212021-04-19T02:52:21.861Z19-04-2021 2021-04-19T02:51:32.370Z - 2021-04-19T04:28:47.555Z - 19-04-2021

భారీ లక్ష్యమైనా.. చితక్కొట్టిన ఢిల్లీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పంజాబ్ కింగ్స్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ కేపిటల్స్ ఏ మాత్రం తడబడలేదు. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 196 పరుగుల విజయ లక్ష్యాన్ని 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు కెప్టెన్ రాహుల్, మయాంక్ అగర్వాల్ లు మంచి ఓపెనింగ్ పార్ట్నర్ షిప్ ను అందించారు. రాహుల్ 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేయగా, అగర్వాల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. గేల్ (11), పూరన్ 9 నిరాశ పరిచారు. దీపక్ హుడా (22), షారూక్ ఖాన్ (15) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మెరివాలా, రబడ, అవేశ్ ఖాన్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

196 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి శిఖర్ ధవన్, పృథ్వీ షా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా ధవన్ మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. స్ట్రైక్ రేట్ ను రొటేట్ చేస్తూ.. బౌండరీలు బాదుతూ ఢిల్లీని మ్యాచ్ రేసులోనే ఉంచాడు. ఎక్కడా కూడా రన్ రేట్ విషయంలో అజాగ్రత్త చూపించకుండా మంచి షాట్స్ తో అలరించాడు ధవన్. కేవలం 49 బంతుల్లోనే 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు.

ఈ ఏడాది కూడా సెంచరీతో కదంతొక్కుతాడు అని అనుకోగా 92 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. పృథ్వీషా 32 పవర్ ప్లేలో మంచి షాట్స్ ఆడాడు. స్మిత్ 9, రిషభ్ పంత్ 15, స్టోయినిస్ 27, లలిత్ యాదవ్ 12 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జే రిచర్డ్‌సన్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్, మెరిడిత్ చెరో వికెట్ తీసుకున్నారు. మూడు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధవన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle