newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్.. ఓటమిపై బాధను వ్యక్తం చేస్తూ

19-10-202019-10-2020 10:57:33 IST
Updated On 19-10-2020 11:02:39 ISTUpdated On 19-10-20202020-10-19T05:27:33.919Z19-10-2020 2020-10-19T05:27:30.361Z - 2020-10-19T05:32:39.427Z - 19-10-2020

కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్ వార్నర్.. ఓటమిపై బాధను వ్యక్తం చేస్తూ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును డేవిడ్ వార్నర్ లిఖించాడు. ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ ఐదువేల ఐపీఎల్‌ పరుగుల మార్కును చేరాడు. ఈ మార్కు చేరిన తొలి విదేశీ ఆటగాడిగా వార్నర్‌ రికార్డు నమోదు చేశాడు.  వేగవంతంగా ఐదువేల ఐపీఎల్‌ పరుగులు సాధించిన రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. వార్నర్‌ 135వ ఐపీఎల్‌ మ్యాచ్‌ లో 5000 పరుగుల మార్కును దాటాడు.‌ విరాట్‌ కోహ్లి 157 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగులు సాధించాడు. ఐదువేల పరుగులు సాధించిన నాల్గో బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ నిలిచాడు. కోహ్లి(5,759 పరుగులు 186 మ్యాచ్‌ల్లో), సురేశ్‌ రైనా(5,468 పరుగులు183 మ్యాచ్‌ల్లో), రోహిత్‌ శర్మ(5,149 పరుగులు 196 మ్యాచ్‌ల్లో)ల తర్వాత స్థానంలో వార్నర్‌ నిలిచాడు. విదేశీ ఆటగాళ్లలో డివిలియర్స్‌ 163 మ్యాచ్‌ల్లో 4,680 పరుగులతో ఉన్నాడు. వార్నర్ కు దగ్గరగా ఉన్నది డివిలియర్స్ మాత్రమే..! 

ఆదివారం జరిగిన మ్యాచ్ లో వార్నర్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గెలిపించలేకపోయాడు. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కోల్‌కతా అద్భుత విజయాన్నందుకుంది. ఫెర్గూసన్ అద్భుత బౌలింగ్‌కు సూపర్ ఓవర్‌లో మూడు బంతులే ఆడిన హైదరాబాద్ రెండు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ బాల్‌కే వార్నర్ క్లీన్ బౌల్డ్ కాగా.. అబ్దుల్ సమద్ సెకండ్ బాల్‌కు డబుల్ తీశాడు..  మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక రషీద్ వేసిన ఓవర్‌లో కేకేఆర్ నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది.

హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ ఓటమిపై‌ స్పందించాడు.  మొదట మ్యాచ్‌ను బాగానే ప్రారంభించినప్పటికీ ముగింపులో మాత్రం తమ జట్టు విఫలమవుతోందని..  తనకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదని తెలిపాడు. తాము చివరి మూడు మ్యాచుల్లో విజయం అంచుల దాకా వచ్చి, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయామని చెప్పాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడం సరైన నిర్ణయమే అని తాను అనుకున్నానని.. దుబాయ్‌తో పోల్చితే అబుదాబి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమైనదే అయినప్పటికీ, ఇన్నింగ్స్‌ మధ్య ఓవర్లలో బ్యాటింగ్‌కు ఇబ్బందికరంగా మారిందని తెలిపాడు. విలియమ్సన్‌ గాయంతో ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్‌ చేశాడని వార్నర్ చెప్పుకొచ్చాడు. 9 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది.. 6 మ్యాచ్ లలో ఓటమిని చవి చూసింది. ఇంకో రెండు మ్యాచ్ లు ఓడిపోతే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఛాన్సెస్ దూరమైనట్లే..! 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle