ఈ ఏడాది ఐపీఎల్ కు డేవిడ్ వార్నర్ దూరం అయ్యే ఛాన్స్..?
23-02-202123-02-2021 08:21:21 IST
Updated On 23-02-2021 10:14:58 ISTUpdated On 23-02-20212021-02-23T02:51:21.396Z23-02-2021 2021-02-23T02:51:05.563Z - 2021-02-23T04:44:58.743Z - 23-02-2021

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం చాలా వరకూ డేవిడ్ వార్నర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ టైటిల్ కొట్టేలా చేశాడు. ఇక గత ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆటగాళ్ల గాయాలు ఇబ్బంది పెట్టగా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ఇంకో రెండు నెలలు సమయం ఉన్నప్పుడే షాక్ తగిలింది. డేవిడ్ వార్నర్ 14వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండో వన్డే మ్యాచులో అయిన గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి డేవిడ్ వార్నర్‌కు మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు మెరుగైన చికిత్స తీసుకుంటున్నాడని.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వార్నర్ విషయంలో ప్రత్యక శ్రద్ద తీసుకుంటోందని ఆస్ట్రేలియా మీడియా చెబుతోంది. గత కొన్ని వారాలుగా త్రో వేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. అయితే వచ్చే వారం నుంచి త్రో వేయడం ప్రారంభిస్తా. ప్రస్తుతం వికెట్ల మధ్య పరిగెత్తడమే అసలు సమస్య. గాయం నుంచి కోలుకోవడానికి మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. మెరుగైన చికిత్స తీసుకుంటున్నా. ఈ చికిత్సతో త్వరగా గాయాన్ని అధిగమిస్తానని ఆశిస్తున్నానని వార్నర్ ఫాక్స్ మీడియా సంస్థకు తెలిపాడు. రెండు నెలల్లో ఐపీఎల్ 2021 ప్రారంభం కానుండటంతో గాయంతో డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయని అనుకుంటూ ఉన్నారు. వార్నర్ పూర్తిగా కోలుకోవడానికి 6-9 నెలల సమయం పడుతుందంటే.. ఐపీఎల్ 14వ సీజన్ మొత్తానికి అతడు దూరమవుతాడని.. అది సన్ రైజర్స్ విజయాలపై ప్రభావం చూపుతుందని అనుకుంటూ ఉన్నారు. గతేడాది నవంబర్ లో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయమవ్వడంతో నొప్పితోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌లోని మొదటి రెండు టెస్టులకు సైతం ఆడలేదు. ఆడిన రెండు టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఇక గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు.

205 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
6 hours ago

హ్యాట్రిక్ తీసిన బౌలర్ కు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పోలార్డ్
12 hours ago

మరికొద్ది గంటల్లో ఇంగ్లాండ్-భారత్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్.. పిచ్ గురించే చర్చ..!
a day ago

నాలుగో టెస్టుకైనా కాస్త న్యాయమైన పిచ్‌ని ఆశించవచ్చా.. అక్తర్ వ్యాఖ్య
03-03-2021

అక్కడ సెంచరీ కొట్టేసి.. చరిత్ర సృష్టించిన కోహ్లీ
02-03-2021

స్పిన్ తిరిగితే చాలు.. ప్రతి ఒక్కడూ ఏడ్చేవాళ్లే.. నాథన్ లియోన్ విమర్శ
01-03-2021

ఐపీఎల్ వేదికల జాబితాలో హైదరాబాదుకు దక్కని స్థానం.. నిర్వహించాలని కోరిన కేటీఆర్
28-02-2021

టెస్టుల్లో కూడా దూసుకొస్తున్న రోహిత్.. అశ్విన్ కూడా సూపర్..!
28-02-2021

ఆడలేక పిచ్‌పై పడతారా.. అజారుద్దీన్ అదిరిపోయే వ్యాఖ్య
28-02-2021

నాలుగో టెస్టుకు బుమ్రా దూరం
27-02-2021
ఇంకా