newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

12-04-202112-04-2021 11:49:36 IST
Updated On 12-04-2021 11:35:57 ISTUpdated On 12-04-20212021-04-12T06:19:36.688Z12-04-2021 2021-04-12T06:00:49.942Z - 2021-04-12T06:05:57.036Z - 12-04-2021

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ అనంతరం‌‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మాట్లాడుతూ తాము ఇక్కడి పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామని చెప్పుకొచ్చాడు. కేకేఆర్‌ పరిస్థితుల్ని అర్థం చేసుకుందని అందుకే విజయం సాధించిందన్నాడు. ఈ పిచ్‌పై అసలు ఇన్ని పరుగులు వస్తాయని అనుకోలేదని.. నేను అనుకున్నది ఒకటి.. జరిగింది ఒకటి అని చెప్పుకొచ్చాడు. మా ప్రణాళికల్ని అమలు చేయలేకపోయామని.. ఆరంభం నుంచి చివరి వరకూ దాదాపు ఇదే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చాడు.

మేము ఆరంభంలో వికెట్లు కోల్పోయినా మనీష్‌ పాండే-బెయిర్‌ స్టో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని.. దాంతో మాకు చాన్స్‌ దొరికిందని అనుకున్నామన్నాడు. బౌలర్లు ఓవర్‌ పిచ్‌ బంతులు వేస్తే ఈజీగా హిట్‌ చేయడం అనేది కనిపించింది. సీమ్‌ విభాగంలో మా కంటే కేకేఆర్‌ మెరుగ్గా కనిపించింది. ఈ మ్యాచ్‌ గెలవాల్సింది.. కానీ ఓడిపోయాం. ఇంకా ఈ వేదికలో నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. దాంతో ఇక్కడ గ్రౌండ్‌లో ఎలా ఆడాలనే దాన్ని మిగతా మ్యాచ్‌ల్లో ఉపయోగించుకుంటామని వార్నర్‌ తెలిపాడు.

కేకేఆర్‌ నిర్దేశించిన 188 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఆరెంజ్‌ ఆర్మీ చేధించలేకపోయింది. నమ్ముకోదగ్గ ఫినిషర్ ఉండి ఉంటే సన్ రైజర్స్ మ్యాచ్ ను గెలిచేదని.. గతంలో కూడా ఇలానే జరిగిందని.. ఈ ఏడాది కూడా మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫినిషింగ్ చేయలేక చేతులెత్తేసిందని అభిమానులు అంటూ ఉన్నారు.

కోల్కతా నైట్ రైడర్స్ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా 56 బంతుల్లోనే 80 పరుగులతో రాణించాడు. త్రిపాఠి 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రే రస్సెల్ మరోసారి విఫలమయ్యాడు.

హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. భువీ, నటరాజన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. భువీ భారీగా పరుగులు ఇవ్వడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించింది.  లక్ష్యఛేదనకు దిగిన సన్ రైజర్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ వికెట్ కోల్పోయింది. జానీ బెయిర్ స్టో (55) హాఫ్ సెంచరీ సాధించినా, విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. మనీష్ పాండే 61 (నాటౌట్) పరుగులు చేసి రాణించాడు. పాండే, బెయిర్ స్టో జోడీ 92 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తరువాత వరుసగా వికెట్లు పడుతూ ఉండటంతో రన్ రేట్ పెరిగిపోయి, మిగతా వారిపై ఒత్తిడి పెరిగింది. యువ ఆటగాడు అబ్దుల్ సమద్ హిట్టింగ్ చేసినప్పటికీ 188 పరుగులను మాత్రం ఆ జట్టు అందుకోలేక పరాజయం పాలైంది. 

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle